
తెలంగాణ ప్రభుత్వం పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. శుక్రవారం కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో భేటీ అయిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని, టీఆర్ఎస్ నేతలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. చట్టం ప్రకారం కృష్ణా జలాలను వాడుకునేలా చర్యలు తీసుకోవాలని కోరామన్నారు.