
ఏపీ సర్కారు పై హైకోర్టు సీరియస్ అయ్యింది. బుధవారం ఉపాధి హామీ పథకం బిల్లులపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. సుమారు గంటన్నర పాటు జరిగిన ఈ విచారణలో ప్రభుత్వాధికారులు పలు విషయాలను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. అధికారుల మాటలు విన్న హైకోర్టు ప్రభుత్వం పై ప్రశ్నల వర్షం కురిపించడంతో పాటు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 1,794 కోట్లకుగానూ 413 కోట్లు చెల్లించామని ఏపీ అధికారులు తెలిపారు. కేవలం 43 కోట్లు మాత్రమే చెల్లించారని డిఫెన్స్ న్యాయవాదులు చెప్పారు. పూర్తి డేటాతో ప్రమాణపత్రం దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.