
ఏపీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. కరోనా విజృంభణతో ఈ ఏడాది పరీక్షలను రద్దు చేసిన ఇంటర్ విద్యామండలి పదో తరగతి మార్కులను 30 శాతం, ఇంటర్ ప్రథమ సంవత్సరానికి 70 శాతం వెయిటేజీతో మార్కులను కేటాయించింది. సబ్జెక్టుల వారీగా మార్కులతో పాటు మొత్తానికి సరాసరి గ్రేడ్ పాయింట్లు కేటాయించారు.