
ఆటగాళ్లకు కరోనా సోకుతున్న నేపథ్యంలో ఐపీఎల్ ను వాయిదా వేసిన బీసీసీఐ ఇప్పుడు లీగ్ లో పాల్గొన్న వాళ్లందరినీ తిరిగి పంపే పనిలో నిమగ్నమైంది. అందరినీ సురక్షితంగా ఇంటికి పంపేందుకు తమ అధికార పరిధిలో చేయాల్సిందంతా చేస్తామని బోర్డు హామీ ఇచ్చింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అది అంత సులువుగా కనిపించడం లేదు. ఇప్పటికే ఆస్ట్రేలియా భారత్ నుంచి వచ్చే విమానాలపై ఈ నెల 15వరకు నిషేధం విధించింది. లీగ్ లో మొత్తం 14 మంది ప్లేయర్స్ తోపాటు రికీ పాంటింగ్ , హస్సీ సోదరులు, మాథ్యూ హేడెన్, లిసా స్టాలేకర్ లాంటి ఆస్ట్రేలియా దేశస్తులు చాలా మందే ఉన్నారు. వీళ్లను ఆస్ట్రేలియా పంపించడం బోర్డుకు అంత సులువైన పని కాదు.