https://oktelugu.com/

యూపీలో త్వరలో ఇద్దరు పిల్లల నిబంధన

జనాభా పరంగా దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ జనాభాను నియంత్రించేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఇద్దరు పిల్లల నిబంధనతో కొత్త చట్టం తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఇద్దరు కంటే ఎక్కువ సంతానం ఉన్నవారికి ప్రభుత్వ ఉద్యోగాలు, సంక్షేమ పథకాలు అందకుండా ఆంక్షలు ప్రతిపాదించింది. ఈ మేరకు యూపీ జనాభా నియంత్రణ బిల్లు, 2021 ముసాయిదాను ఆ రాష్ట్ర లా కమిషన్ తాజాగా విడుదల చేసింది. ఈ బిల్లు ఆమోదం పొంది చట్టంగా మారితే యూపీలో ఇద్దరు పిల్లల నిబంధన […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : July 10, 2021 3:24 pm
    Follow us on

    జనాభా పరంగా దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ జనాభాను నియంత్రించేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఇద్దరు పిల్లల నిబంధనతో కొత్త చట్టం తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఇద్దరు కంటే ఎక్కువ సంతానం ఉన్నవారికి ప్రభుత్వ ఉద్యోగాలు, సంక్షేమ పథకాలు అందకుండా ఆంక్షలు ప్రతిపాదించింది. ఈ మేరకు యూపీ జనాభా నియంత్రణ బిల్లు, 2021 ముసాయిదాను ఆ రాష్ట్ర లా కమిషన్ తాజాగా విడుదల చేసింది. ఈ బిల్లు ఆమోదం పొంది చట్టంగా మారితే యూపీలో ఇద్దరు పిల్లల నిబంధన అమల్లోకి రానుంది.