పశ్చిమ బెంగాల్ సీఎంగా మూడోసారి బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన మమతా బెనర్జీ అనంతరం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఐపీఎస్ అధికారి వీరేంద్రను బెంగాల్ డీజీపీగా తిరిగి నియమించారు. జావేద్ షమీమ్ ను ఏజీపీ లా అండ్ ఆర్డర్ డా తిరిగి నియమించారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ సీ నియమించిన డీజీపీ నిరంజయన్ పాండేనే ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ కు, ఏడీజీ లా అండ్ ఆర్డర్ జగ్ మోహన్ ను సివిల్ డిఫెన్స్ కు బదిలీ చేశారు. బెంగాల్ లో హింసాత్మక ఘటనలను సహించబోమని సీఎం మమత అన్నారు. బీజేపీ పాత వీడియోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేసి హింసను ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు.