Odisha CM Naveen Patnaik: నవీన్ పట్నాయక్.. భారతదేశ రాజకీయాల్లో పరిచయం అక్కర లేని పేరు. పెళ్ళాం, పిల్లలు అట్లాంటి బంధాలు లేవు. ఉన్న బంధుగణాన్ని కూడా దగ్గరికి రానివ్వడు. అధికారులతో కూడా మితంగానే మాట్లాడుతాడు. ప్రతిపక్షాలపై “రండ, గోకుతా” లాంటి థర్డ్ గ్రేడ్ లాంగ్వేజ్ వాడడు. తాను వేసుకున్న లాల్చి ఎంత తెల్లగా ఉంటుందో, అతడు అంతే నిర్మలంగా ఉంటాడు. ముఖ్యమంత్రి అయినప్పటికీ ఏమాత్రం బేషజం కనిపించనీయడు. ఎటువంటి హావాభావాలను కూడా పలికించడు. అంతటి కరోనాలోనూ నింపాదిగానే పని చేసుకుంటూ వెళ్ళాడు. రాష్ట్రంలో కరోనా బాధితులందరికీ ఆక్సిజన్ అందించాడు. మిగతా రాష్ట్రాలకు తన వంతు చేయూతను అందించాడు. పాతికేళ్లుగా ముఖ్యమంత్రి పీఠం లో ఉన్నా అవినీతి జాడను దరిదాపుల్లో కూడా రానివ్వలేదు. సాయంత్రం ఐదు అయితే చాలు ఒక సిగరెట్ ప్యాకెట్, లాప్టాప్, రెండు పెగ్గుల విస్కీ తో బెడ్ రూమ్ లోకి వెళ్ళిపోతాడు. ఇంకా తనను ఎవరు డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు. అత్యవసరం అయితే తప్ప. చదువుతుంటేనే ఎంతటి డిఫరెంట్ క్యారెక్టర్ అనిపిస్తోంది కదా!
ఒడిస్సీల ముందు కన్నీరు కార్చాడు.
సమకాలిన దేశ రాజకీయాల్లో నవీన్ లాగా బతకాలంటే చాలా కష్టం. అవినీతి మరకలేదు. దోచుకుని దాచుకోవాలనే
యావలేదు. ఆ మాటకు వస్తే పక్షాలను వీసమెత్తు మాట అనాల్సిన అవసరం లేదు. అందుకే కాబోలు పాతికేళ్ళయినా నవీన్ పట్నాయక్ ఇంకా ముఖ్యమంత్రిగానే కొనసాగుతున్నారు. పైకి ఎంతో గంభీరంగా, ముఖంలో ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ లేకుండా ఉండే పట్నాయక్.. కంటనీరు పెట్టుకున్నాడు. 12 దేశాల్లో స్థిరపడిన ఒడిస్సీల ముందు గుండె ఆర్ద్రత ను ప్రదర్శించాడు. ఇంతకీ ఏంటి ఆ ఘటన? పట్నాయక్ అంతలా కదిలించిన ఆ వ్యక్తి ఎవరు?
Also Read: KCR vs BJP: కేంద్రంపై మరోపోరాటం.. రెడీ అయిన కేసీఆర్..
ఆత్మస్థైర్యాన్ని తట్టి లేపాడు
సంబల్పూర్ జిల్లాకు చెందిన కిషన్ శేషదేవ్ తనకు ఏడాది వయసు ఉన్నప్పుడే తల్లిని కోల్పోయాడు. 2006లో తండ్రి తీవ్ర అనారోగ్యం పాలైతే అతన్ని కాపాడుకునేందుకు కూలీ అవతారం ఎత్తాడు. పైసా పైసా కూడపెట్టి తండ్రికి వైద్యం చేయించాడు. ఇదే సమయంలో విధి వక్రించడంతో అనారోగ్యం పాలైన అక్కను కూడా కోల్పోయాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తండ్రి కూడా 2012లో కన్నుమూశాడు. అప్పటికి కిషన్ శేష దేవ్ కి 18 ఏళ్లు. కిషన్ శేష దేవ్ చిన్నప్పటి నుంచి మెరిట్ స్టూడెంట్. ప్రతి పరీక్షలోనూ తనే టాప్. 2005లో ఉత్తమ విద్యార్థి అవార్డు తీసుకొని నవోదయ ఎంట్రన్స్ లో టాపర్ గా నిలిచాడు. ప్లస్ టూ వరకు అక్కడే చదివాడు. తర్వాత 2012లో నేషనల్ ఎంట్రెన్స్ స్క్రీనింగ్ టెస్ట్ రాశాడు. 17వ ర్యాంకు సాధించాడు కానీ ఆ సంవత్సరమే తండ్రి చనిపోయాడు. ఏడాది పాటు దు:ఖంలో మునిగిపోయాడు. తన పేదరికం గుర్తొచ్చి మళ్ళీ కసితో చదివాడు. 2013లో మళ్ళీ పరీక్ష రాశాడు. ఈసారి రెండు ర్యాంకులు మెరుగుపరచుకొని 15వ స్థానంలో నిలిచాడు. ఎన్ఐఎస్ఈఆర్ లో ఐదేళ్ల ఎంఎస్సీ ఇంటిగ్రేటెడ్ కోర్సులో చేరాడు.
నవీన్ ఐఫోన్ కానుకగా ఇచ్చాడు
ఒడిశా నాలెడ్జ్ హబ్ లో 2018లో భారీ సమావేశం నిర్వహించారు. వివిధ రాష్ట్రాల నుంచి విద్యావేత్తలు, మంత్రులు, ఉన్నతాధికారులు, సాంకేతిక నిపుణులు ఆ సమావేశానికి హాజరయ్యారు. అప్పట్లో కిషన్ తెగిపోయిన చెప్పులు మాసిపోయిన బట్టలు చేతిలో డొక్కు నోకియా ఫోన్ ను వాడేవాడు. అతడి పరిస్థితిని గమనించిన నవీన్ పట్నాయక్ ఒక ఐఫోన్‌ను కానుక ఇచ్చాడు. అక్కడే తనకు హితబోధ చేశాడు. ఆ ఉత్సాహంతోనే ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ పూర్తయిన తర్వాత కిషన్ జర్మనీలోని “జార్జ్ ఆగస్ట్” యూనివర్సిటీలో చేరాడు. అక్కడ పీ హెచ్ డీ పూర్తి చేశాడు. అదే దేశంలో కెమికల్ ఇంజనీర్ గా స్థిరపడ్డాడు. అది కూడా ఏడు అంకెల జీతంతో..
రోమ్ లో నవీన్ కంటతడి పెట్టాడు
జూన్ నెల చివరి వారంలో నవీన్ పట్నాయక్ పెట్టుబడుల ఆకర్షణ నిమిత్తం ఇటలీలోని రోమ్ నగరానికి వెళ్ళాడు. ఈ కార్యక్రమానికి 12 యూరప్ దేశాలకు చెందిన ప్రవాస ఒడిస్సీలను ఆహ్వానించారు. ఈ మీటింగ్ కిషన్ శేష దేవ్ కూడా జర్మనీ నుంచి రోమ్ వెళ్ళాడు. అప్పుడు కిషన్ శేష దేవ్ కి కూడా అందరి ఎదుట మాట్లాడే అవకాశం నవీన్ కల్పించాడు. సమయంలో తన చేతిలో ఉన్న ఐఫోన్ ను ఊపుతూ ముఖ్యమంత్రి తనకు ఏ ఏ సమయంలో అండగా నిలిచారో, తాను కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు ఏ విధంగా ధైర్యం చెప్పారో ఉద్వేగంతో చెప్పుకుంటూ వెళ్ళాడు.” అంతటి పట్నాయక్ సార్ నాతో మాట్లాడటం అంటేనే గొప్ప అనిపించింది. ఆయన డౌన్ టు ఎర్త్. నువ్వు కేవలం చదువుకోవడమే మాత్రం కాదు.నీ చదువు పదిమందికి ఉపయోగపడాలి అనే వారు. దానినే నేను ఆచరణలో పెట్టాను. కటిక పేదరికం నుంచి ఇవాళ జర్మనీలో పేరొందిన శాస్త్రవేత్తగా స్థిరపడ్డాను. నన్ను ఇంతవాన్ని చేసిన మా ఊర్లో 170 మంది పేద విద్యార్థుల కోసం ఒక కోచింగ్ సెంటర్ పెట్టించాను. ₹ 30 లక్షలతో స్వగ్రామంలో ఇల్లు కట్టుకున్నాను.అసలు ఏమీ లేదు అనే స్థాయి నుంచి..అన్నీ ఉన్నాయి అనే స్థాయి దాకా సీఎం సార్ నన్ను తీసుకువచ్చారు. నాకు ఇంత ఇచ్చిన సీఎం సార్ కోసం ఒడిస్సా కు ఎంతైనా ఇస్తాను. ఒక పెద్ద ఫార్మా కంపెనీని సొంత రాష్ట్రంలో పెడతాను. నాకు ఒడిస్సా లో ఎవరూ లేరు. నూనూగు మీసాల వయసులోనే అందర్నీ కోల్పోయాను. అయినా నాకేం భయం లేదు సార్. మీరు ఉన్నారు. మీరే నాకు తల్లిదండ్రి” అంటూ శేష దేవ్ ముగించాడు. సరిగా అదే సమయంలోనే ఎటువంటి బంధాలు అనుబంధాలు లేని పట్నాయక్ చలించి పోయాడు. కళ్ళ నుంచి జలజల కన్నీళ్లు రాల్చాడు. ఆ భావోద్వేగానికి ఏమని పేరు పెడతాం? తన కొడుకు ప్రయోజకుడయితే తండ్రి పడే ఆనందం అనాలా? తాను వేసిన పంట పదిమంది ఆకలి తీర్చుతోందని సంతోషపడే రైతు అనాలా? ఏ ఉపమానంతో పోల్చినా తక్కువే అవుతుంది.
నవీన్ చాలా డిఫరెంట్
రాజకీయమంటేనే ఒక క్షుద్రంగా భావిస్తున్న నేటి రోజుల్లో.. ఇలాంటి సందర్భాలు.. ఇలాంటి సందర్భానుసారం ప్రవర్తించే నేతలూ ఉన్నారు. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నెగిటివిటీ కమ్మేస్తున్న ఈ రోజుల్లో ఇలాంటి పాజిటివిటీ కోణాల్ని పరిశీలించాలి. రాజకీయ నాయకులు అంటేనే నోటీరియస్ కు పర్యాయపదాలుగా మారిన ఈ రోజుల్లో నవీన్ పట్నాయక్ లాంటి ముఖ్యమంత్రి ఔచిత్యాన్ని తెలుసుకోవాలి. అన్నింటికంటే ముఖ్యంగా కఠినమైన గుండె అంటూ ఏదీ ఉండదని, పరిస్థితుల ప్రభావాలే దాన్ని అలా మారుస్తాయని, దానికి గుండె తడి ఉంటుందని, అది కూడా కంటతడి పెడుతుందని తెలుసుకోవాలి. భావోద్వేగం పెల్లుబుకినప్పుడు అది కూడా ఆర్ద్రతను జల జలా ఒలికిస్తుందని గమనించాలి.
Also Read:EC Shock To YCP- TDP: వైసీపీ, టీడీపీకి గట్టి షాకిచ్చిన ఈసీ..
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Know why odisha cm naveen patnaik was moved to tears in rome
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com