Value of Money: కొంతమంది పుట్టగానే ధనవంతులుగా మారిపోతారు. వారికి వారి తల్లిదండ్రులు అప్పటికే ఎక్కువ డబ్బులు సంపాదించి రెడీగా వస్తారు. దీంతో వారు ఏ కష్టం లేకుండా పెరిగి పెద్దవారు అవుతారు. పెద్ద పెద్ద చదువులు చదువుకుంటారు. అయితే వీరిలో కొందరు ఆ ధనాన్ని మరింత రెట్టింపు చేస్తారు. మరికొందరు మాత్రం ఎంజాయ్ చేస్తూ విలాసంగా గడుపుతారు. ఇక్కడ రెండో వర్గం ప్రజలు పేదవారీగా పుట్టి ధనవంతులుగా మారిపోవాలని అనుకుంటారు. కానీ వీరిలో కొందరు మాత్రమే డబ్బు సంపాదిస్తారు. మిగతావారు మాత్రం సమయాన్ని వృధా చేస్తారు. అయితే ఒకవైపు ఎంజాయ్ చేయాలన్న ఆలోచన ఉండి.. మరోవైపు డబ్బు సంపాదించాలన్న కోరిక ఉన్నవారు.. అయోమయంలో పడి ఏం తెలుసుకోలేక పోతారు. ఇలాంటి అప్పుడు ఏం చేయాలంటే?
కొన్ని సినిమాల్లో చెప్పినదాని ప్రకారం.. నీతులు చెప్పడానికి బాగానే ఉంటాయి.. కానీ అనుభవిస్తే దాని ఫలితం తెలుస్తుంది. డబ్బు గురించి చాలామంది చాలా రకాలుగా చెబుతూ ఉంటారు. డబ్బు జీవితం కాదు.. బంధాలు, బంధుత్వాలే జీవితం అని అంటూ ఉంటారు. కానీ ఉదాహరణకు కరోనా పరిస్థితి తెలుసుకుంటే.. ఈ సమయంలో డబ్బు ఉన్నవారు కొందరు బయటపడ్డారు.. డబ్బు లేని వారు ట్రీట్మెంట్ చేయించుకోలేక చనిపోయారు. ఇలాంటి సమయంలో ఏ బంధుత్వమ కాపాడలేదు. అలాగే అత్యవసర సమయాల్లో నేటి కాలంలో సొంతవారే పట్టించుకునే పరిస్థితి లేదు. అందువల్ల డబ్బు అనేది చాలా అవసరం.
Also Read: భారతదేశానికి India అనే పేరు ఇలా వచ్చింది…
ఒక ఉద్యోగికి జీతం రూ. పదివేలు వచ్చినప్పుడు కొంచెం కష్టంగా జీవితం ముందుకు వెళుతుంది. ఈ సమయంలో అతనికి స్నేహితులు ఉంటారు. కానీ పెద్దగా పట్టించుకోరు. కొన్ని విషయాల్లో కలుపుకోకుండా ఉంటారు. అంతేకాకుండా ఈ డబ్బుతో సరైన దుస్తులు వేసుకోలేక పోతారు. చేతిలో అనుగుణంగా వాహనం ఉండదు. ఈ పరిస్థితి చూసి ఎదుటివారి జాలిపడతారు. కానీ అత్యవసర సమయంలో ఎవరూ సహాయం చేయరు.
అదే రూ. పది లక్షల జీతం ఉన్నప్పుడు కొత్త స్నేహితులు పుట్టుకొస్తారు. అవసరం లేకున్నా అప్పు ఇవ్వడానికి ముందుకు వస్తారు. బ్యాంకులో అయితే లోన్లు తీసుకోమని క్యూ కడుతూ ఉంటాయి. ఇంకా కొందరు పక్కనే ఉంటూ ఎప్పటికీ సహాయం చేస్తున్నావ్ అన్నట్లు నటిస్తూ ఉంటారు. దానికి కారణం డబ్బు అని గుర్తుంచుకోవాలి.
Also Read: వయసు 38 సంవత్సరాలు.. ఒక్క రోజులోనే 1.6 బిలియన్ డాలర్ల సంపాదన.. ఇంతకీ ఇతడు ఎక్కడి వాడు? ఏం చేస్తాడు?
అయితే డబ్బు కోసం ఇతరులను ఇబ్బంది పెట్టే పరిస్థితి తెచ్చుకోకూడదు. కావలసిన దానికంటే ఎక్కువ డబ్బు సంపాదించాలి. కానీ అది న్యాయబద్ధంగా ఉండాలి. అంటే కుటుంబ సభ్యులను విస్మరించి.. ఎదుటివారినీ మోసం చేసి డబ్బు సంపాదించాల్సిన అవసరం లేదు. అలా డబ్బు సంపాదించిన తర్వాత మానవత్వం కూడా మర్చిపోకుండా ఉండాలి. అంటే డబ్బు బాగా సంపాదించాలి. కానీ దానిని వృధా చేయకుండా ఉండాలి. డబ్బు బాగా సంపాదించాలంటే సమయాన్ని వృధా చేసుకోకుండా ఉండాలి. ప్రతి నిమిషం.. కష్టపడితేనే డబ్బు కూడుతుంది. కానీ సమయాన్ని వృధా చేస్తే చేతిలో చిల్లిగవ్వ కూడా ఉండదు.