Zipline horror in Manali: అందమైన ప్రకృతిని.. ఆహ్లాదమైన వాతావరణాన్ని ఆస్వాదించే పర్యాటకులు మనదేశంలో చాలామంది ఉన్నారు. ఇక ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అలాంటి ప్రకృతిని ఆస్వాదించడానికి ఆ కుటుంబం మనాలి అనే ప్రాంతానికి వెళ్ళింది. అక్కడ ఎత్తైన కొండ ప్రాంతాలలో ఉన్న ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించడానికి వారు అక్కడికి వెళ్లారు.. కొండలను కలిపి ఏర్పాటు చేసిన తీగ ప్రాంతంలో జిప్ లైన్ ద్వారా విహారం మొదలుపెట్టారు. ఇలా విహరిస్తున్న క్రమంలో ఆ కుటుంబంలోని 12 సంవత్సరాల బాలిక ప్రమాదం బారిన పడింది. లోయ నుంచి అమాంతం కింద పడిన క్రమంలో ఆ బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. లోయలో రాళ్లు అధికంగా ఉండడంతో ఆ బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. రక్త స్రావం కూడా అధికంగా జరగడంతో తీవ్రంగా ఇబ్బంది పడింది. ఆ తర్వాత అక్కడి అధికారులు వెంటనే ఆ బాలికను ఆసుపత్రికి తరలించారు..
Also Read: Monkey Latest Viral Video: కోతికేం తెలుసు డబ్బు విలువ.. లక్షల నగదు ఇలా పారేసింది..(వైరల్ వీడియో)
మహారాష్ట్రలోని నాగపూర్ ప్రాంతానికి చెందిన ప్రఫుల్ బిజ్వే కుటుంబం విహారయాత్రకు మనాలి ప్రాంతానికి వచ్చింది. విహారయాత్రలో భాగంగా అక్కడి ప్రాంతాలను ఆస్వాదించారు.. కొండ ప్రాంతాలను కలిపి ఏర్పాటు చేసిన జిప్ లైన్ లో విహరించారు. ఇందులో భాగంగా ప్రఫుల్ కుమార్తె త్రిష బిజ్వే కేబుల్ పై నడిచే జిప్ లైన్ పై ఆకాశమార్గంలో విహరించడానికి ఆసక్తి చూపించింది. ఆమె అలా వెళుతున్న క్రమంలో తీగ తెగిపోయింది. తీగ తెగిన తర్వాత కింద ఉన్న బండలపై అమాంతం పడిపోయింది. దీంతో ఆమెకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఆ తర్వాత ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆ బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నది. ప్రస్తుతం ఆమెకు ఎటువంటి ప్రాణాపాయం లేదని వైద్య వర్గాలు చెబుతున్నాయి. ఆ బాలిక లోయలో పడిపోయిన ఉదంతానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది. కేబుల్ ఎక్కిన తర్వాత కొంతవరకు ఆమె ప్రయాణం సాఫీగానే సాగిపోయింది. ఉన్నట్టుండి కేబుల్ తెగడంతో కింద పడింది. ఈ ప్రమాదంలో ఆ బాలిక తీవ్రంగా గాయపడింది. కాళ్ళ భాగంలో గాయాలు కావడంతో రక్తస్రావం అధికంగా జరిగింది. ఫలితంగా ఆమెను ఆసుపత్రికి తరలించారు..” ఘటన జరిగిన తర్వాత నిర్వాహకులు వెంటనే స్పందించారు. బాలికను ఆసుపత్రికి తరలించారు. స్థానికంగా ఉన్న అధికారులు కూడా నిర్వాహకులకు సహకరించారు. ఆ తర్వాత ఆ బాలిక ఆసుపత్రిలో కోలుకుంటున్నది. అత్యవసర వైద్య విభాగంలో చికిత్స పొందుతున్నదని” మనాలి డిఎస్పి వెల్లడించారు. అయితే ఈ వ్యవహారంపై బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయలేదని.. పోలీసులు చెబుతున్నారు. అందువల్లే కేసు నమోదు చేయలేదని వారు స్థానికంగా ఉన్న విలేకరులతో వెల్లడించారు.
షాకింగ్ వీడియో.. మనాలిలో జిప్ లైన్ తెగి లోయలో పడిపోయిన యువతి
జిప్ లైన్ చేస్తుండగా తెగిపోవడంతో 30 అడుగుల లోతైన లోయలో పడిన యువతి
తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలింపు
నాగ్‌పూర్‌కు చెందిన త్రిష అనే యువతిగా గుర్తింపు pic.twitter.com/71W97wYNDl
— Telugu Scribe (@TeluguScribe) June 15, 2025