Yuga Tulasi Foundation : హిందుత్వ భారతదేశంలో గోవులను పవిత్రంగా పూజిస్తారు. దేవతలా కొలుస్తారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇప్పటికీ గోవధపై నిషేధం ఉంది. అయితే అన్ని రాష్ట్రాల్లో ఇది అమలు కావడం లేదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో విచ్చలవిడిగా గోవధ చేస్తున్నారు. దీనిపై హిందూ సంఘాలు ఎంత గొంతు చించుకున్నా ఇక్కడి ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. అందుకే కొందరు హైకోర్టుకు ఎక్కారు. గోవధపై నిషేధం అమలు చేయాలని కోరారు. హైకోర్టు గోవధపై ఇచ్చిన తీర్పు గోరక్షకులకు బలాన్ని ఇచ్చేలా ఉంది.
గోవధపై హైకోర్టు ఇచ్చిన తీర్పు గో రక్షకులకు బలాన్ని ఇస్తుందని యుగ తులసి ఫౌండేషన్ ఫౌండర్ శివ కుమార్ తెలిపారు. ఒక్క గోవు ను కూడా చంపడానికి వీలు లేదని కోర్ట్ స్పష్టం చేయడం ఆనందాన్ని ఇస్తోందన్నారు. బక్రీద్ సందర్భంగా జంతువులను భయంకరంగా హింసిస్తున్నారని.. ఎక్కడా చూసినా నగరంలో గోవులు కనిపిస్తునాయని వాపోయారు.
రెండు నెలల క్రితమే గోవధ నిషేధ చట్టం అమలు చేయాలని డీజీపీని కలిశామని తెలిపారు. ఒక వర్గం అనందం కోసం తల్లి లాంటి గోవులను చంపుతున్నారన్నారు. ఇతర ప్రాంతాల నుండి హైదరాబాద్ కు గోవులను తరలిస్తున్నా పోలీసులు ఎక్కడా అపడం లేదని శివకుమార్ నిలదీశారు.
కోర్ట్ తీర్పు ను హిందూ సంఘాలు అమలు చేయాలని.. హిందూ సంఘాలు వెంటనే గోవులను కాపాడే ప్రయత్నం చేయాలని శివకుమార్ పిలుపునిచ్చారు. కళ్ళ ముందు గోవు చనిపోతున్నా ఏమి చేయలేకపోతున్నామని శివకుమార్ తెలిపారు.
గోవధ జరగకుండా చూడాలని డీజీపీ, చీఫ్ సెక్రటరీ కు హైకోర్టు ఆదేశించింది. ఎక్కడ గోవధ జరిగిన పోలీస్ స్టేషన్ లలో కంప్లైంట్ చేయాలని సూచించింది. పోలీసులు గోవులను రక్షించకుంటే ఆగస్ట్ 2న హైకోర్ట్ లో కంటెంప్ట్ వేస్తామని శివకుమార్ స్పష్టం చేశారు.