YS Sharmila Khammam Tour: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ సోదరి, తెలంగాణ YSRTP పార్టీ అధినేత్రి షర్మిల ఆదివారం ఖమ్మం జిల్లాలోని తనికెళ్ల గ్రామం లో పర్యటిస్తున్న సమయం లో వడదెబ్బ తగిలి సొమ్మసిల్లి అక్కడికక్కడే కుప్పకూలిపోయిన ఘటన అభిమానులను మరియు పార్టీ కార్యకర్తలను తీవ్రమైన ఆందోళనకి గురి చేసింది. తనికెళ్ళ గ్రామం లో దెబ్బతిన్న పంటలను పరిశీలించడానికి వెళ్ళింది షర్మిల, అక్కడి రైతులతో కూడా సమస్యలను అడిగి తెలుసుకుంది.
ఆ తర్వాత మీడియా తో మాట్లాడుతున్న సమయం లో ఒక్కసారిగా కుప్పకూలిపోవడం అందరినీ షాక్ కి గురి చేసింది. ఆ తర్వాత ఆమెని సమీపం లో ఉన్న హాస్పిటల్ కి తీసుకెళ్లి అత్యవసర చికిత్స అందించారు. ఆమె కేవలం వడ దెబ్బ తగిలే క్రింద పడిపోయారని, అభిమానులు మరియు కార్యకర్తలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఒక రెండు రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని చెప్పుకొచ్చారు.
షర్మిల ఈమధ్య తరుచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే, త్వరలోనే తెలంగాణ లో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్న ఈ నేపథ్యం లో రాజకీయ పార్టీలన్నీ తమ తమ వ్యూహాలతో జనాల్లోకి ముందుకు వెళ్తున్నాయి. షర్మిల కూడా గత కొంత కాలం క్రితమే పాదయత్రని ప్రారంభించింది. అయితే రీసెంట్ గా ఈమె ఇంటి చుట్టూ పోలీసులు వచ్చి, ఆమెని గడప దాటి బయటకి అడుగుపెట్టనివ్వకుండా చేసే ప్రయత్నం చేసారు.
ఈ క్రమం లో పోలీసులు ఆమెని అడ్డుకోగా, ఒక లేడీ కానిస్టేబుల్ పై చెయ్యి చేసుకుంది. దీనితో ఆమెని వెంటనే అరెస్ట్ చేసి ఒక రోజు రిమాండ్ లో ఉంచారు. ఆ తర్వాత ఆమెని చూడడానికి వచ్చిన విజయమ్మ ని కూడా అడ్డుకోవాలని చూడగా ఆమె కూడా పోలీసుల పై చెయ్యి చేసుకుంది. ఇలా తరుచు ఎదో ఒక విధంగా షర్మిల వార్తల్లో నిలుస్తుంది.