ABN RK Sharmila: ఏబీఎన్ ఆర్కేతో షర్మిల.. జగన్ తో గొడవ.. ‘కేటీఆర్ ఎవరు’పై క్లారిటీ!

ABN RK Sharmila: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ.. ఈయన ఫక్తు టీడీపీ వాది. చంద్రబాబుకు రైట్ హ్యాండ్ గా రాజకీయవర్గాల్లో.. మీడియా సర్కిల్స్ లో ఎవరిని అడిగినా చెబుతుంటారు. వైఎస్ఆర్ ఫ్యామిలీ అయినా.. కాంగ్రెస్ అన్నా అస్సలే పడని మేధావి. నిండు అసెంబ్లీలో ‘ఆ రెండు పత్రికలు’ కాంగ్రెస్ కు శత్రువులు అని నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రకటించాడు. అంతటి బద్ధ విరోధి ఆర్కేతో వైఎస్ఆర్ కూతురే భేటి అయితే..  ‘ఓపెన్ హార్ట్ విత్ […]

Written By: NARESH, Updated On : September 24, 2021 7:19 pm
Follow us on

ABN RK Sharmila: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ.. ఈయన ఫక్తు టీడీపీ వాది. చంద్రబాబుకు రైట్ హ్యాండ్ గా రాజకీయవర్గాల్లో.. మీడియా సర్కిల్స్ లో ఎవరిని అడిగినా చెబుతుంటారు. వైఎస్ఆర్ ఫ్యామిలీ అయినా.. కాంగ్రెస్ అన్నా అస్సలే పడని మేధావి. నిండు అసెంబ్లీలో ‘ఆ రెండు పత్రికలు’ కాంగ్రెస్ కు శత్రువులు అని నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రకటించాడు. అంతటి బద్ధ విరోధి ఆర్కేతో వైఎస్ఆర్ కూతురే భేటి అయితే..  ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’లో అన్నీ ఓపెన్ గా చెప్పేస్తే  ఏమవుతుంది? సంచలనమవుతుంది.. ఇప్పుడే అదే జరిగింది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ మొదలుపెట్టిన తొలి ఇంటర్వ్యూ కార్యక్రమానికి రీఎంట్రీలో వైఎస్ షర్మిల రావడం రాజకీయవర్గాలను అందరినీ ఆశ్చర్యపరిచింది. షర్మిల చెప్పిన డైలాగులు.. పంచుకున్న విశేషాలపై ఉత్కంఠ నెలకొంది.

‘శత్రువుకు శత్రువు’ మిత్రుడు అన్నది నానుడి. ఇప్పుడు తన తోడబుట్టిన వాడే కాలదన్నిన వేళ ఇక వేరే దారిలేక తన శత్రువు పంచనే చేరింది ఆంధ్రా ఆడకూతురు వైఎస్ షర్మిల. తనకు అలివి కాని పక్కరాష్ట్రంలో రాజకీయం మొదలుపెట్టింది మరీ. నిజానికి ఆమె తెలంగాణ రాజకీయాల్లోకి వస్తుందని ఆ మీడియా మేధావికి ముందే తెలుసు.. అతడే బ్రేక్ చేశాడు కూడా.. కానీ ముందు ‘తూచ్’ నే రావట్లేదు అంది.. ఆ తర్వాత మాట సవరించి రాజకీయాల్లోకి వచ్చేసింది వైఎస్ షర్మిల.. కట్ చేస్తే ఇప్పుడు జగన్(YS JAGAN) కు పగవాడు, శత్రువుగా భావించే ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణతోనే ఇంటర్వ్యూ కు రెడీ అయిపోయింది. ఈ పరిణామం తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ(ABN Radha krishna) తోపాటు మరో మీడియా సంస్థ అధినేత ఇద్దరూ కూడా టీడీపీ అధినేత చంద్రబాబుకు గట్టి మద్దతుదారులు అని తెలుగు రాష్ట్రాల్లో ఎవరిని అడిగినా చెబుతారు. వారి పత్రికల్లో చానెల్స్ లో వైసీపీపై దుమ్మెత్తిపోస్తుంటారు. వైసీపీని నీరుగార్చేలా కథనాలు బోలెడు వచ్చాయి. అస్సలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్నా.. జగన్ అన్నా ఈ టీడీపీ అనుకూల మీడియా దుమ్మెత్తి పోస్తుంటుంది. స్వయంగా వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు వీటిపై ప్రతీకారంతో రగిలిపోయారు. అలాంటి మీడియా అధిపతితో ఇప్పుడు తెలంగాణలో ‘వైఎస్ఆర్ టీపీ’ అనే పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల భేటి కావడమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్న ప్రశ్న..

వీరిద్దరి మధ్య సాగిన ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వీడియోలో తన ప్రత్యర్థి కూతురు అయిన సరే ఎబీఎన్ రాధాకృష్ణ ‘షన్ము’ అంటూ షర్మిలను ముద్దుపేరుతో పలకరించడం విశేషం. దీనికి నవ్వి ‘‘నన్ను ఇంట్లో అలానే పిలుస్తారని’’ షర్మిల బదులివ్వడం గమనార్హం. పైగా రాధాకృష్ణను ‘అన్నయ్య’ అనడం అదో ట్విస్ట్ అని చెప్పొచ్చు.

వైఎస్ షర్మిల ‘నాన్నకూచీ’ అని చర్చలో ప్రస్తావనకు వచ్చింది. ‘నాకు ఏదైనా అయితే నాన్న వైఎస్ఆర్ కళ్లలో నీళ్లు కనపడేవి’ అని షర్మిల గుర్తు చేసుకున్నారు. ఇక ‘వైఎస్ఆర్’ మరణం అని విధి రాసిన వింతనాటకం అని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ ఉంటే తెలంగాణ వచ్చేది కాదని ఆర్కే చెప్పుకొచ్చాడు.

తెలంగాణలో ప్రతిపక్షం లేదని.. నియంత పాలన సాగుతోందని.. అందుకే ఇక్కడ పార్టీ పెట్టానని వైఎస్ షర్మిల ఇంటర్వ్యూలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి కావడానికి కారణం సరైన ప్రత్యర్థులు, ప్రతిపక్షం లేకపోవడమేనని షర్మిల చెప్పుకొచ్చారు. తెలంగాణలో ప్రతిపక్షమే లేదని షర్మిల తెలిపారు.

తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలక కేసీఆర్ చేతిలో ఉందని.. ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు రేవంత్ పిలక.. తల కూడా కట్ చేయగలరని షర్మిల కీలక వ్యాఖ్యలు చేసింది.

వైఎస్ఆర్ తెలంగాణ విరోధిగా ఉన్నాడని.. ఆయన కూతురు ఇక్కడ రాజకీయం చేయడం ఏంటన్న ప్రశ్నకు షర్మిల ఆసక్తికర సమాధానం ఇచ్చింది. వైఎస్ఆర్ సంక్షేమం, అభివృద్ధి తెలంగాణకు అందించడం కోసమే ఇక్కడకు వచ్చానని.. నన్ను చూస్తేనే వైఎస్ఆర్ గుర్తొస్తారని షర్మిల చెప్పుకొచ్చారు.

‘కేటీఆర్ ఎవరు.. నాకు తెలియదు?’ అని ఎందుకు ప్రశ్నించావ్ అని ఏబీఎన్ ఆర్కే తన ఇంటర్వ్యూలో షర్మిలను సూటిగా ప్రశ్నించారు. దీనికి షర్మిల ఇప్పటివరకూ పంచుకోని సమాధానాన్ని ఇచ్చింది. ‘తాను దీక్ష చేస్తానని చెబితే.. వత్రాలు చేసుకోండని అంటాడా? మీరేమో ఫాంహౌస్ లలో బాగా తాగి పడుకుంటారా?’ నాకు కోపం వచ్చే ‘కేటీఆర్ ఎవరు?’ అని అడిగానని షర్మిల క్లారిటీ ఇచ్చారు.

ఇక అన్నయ్య జగన్ తో విభేదాలు వచ్చి విడిపోయి ఇక్కడి వచ్చారా? అన్న ప్రశ్నకు షర్మిల బదులిచ్చారు. కానీ అది తాజాగా విడుదలైన ప్రోమోలో హైడ్ చేశారు. ఈ ఆదివారం 8.30 గంటలకు ఏబీఎన్ లో ప్రసారమయ్యే షోలో దానిపై క్లారిటీ రానుంది..

-ఏబీఎన్ ఆర్కేతో వైఎస్ షర్మిల ఇంటర్వ్యూ వీడియో కింద చూడొచ్చు..