YS Sharmila padayatra: వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాదయాత్రను విజయవంతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. రేపటి నుంచి ప్రారంభమయ్యే ప్రజాప్రస్థానం పాదయాత్ర కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ విభాగాల వారీగా సమన్వయ కమిటీలు నియమించింది. మొత్తం 26 కమిటీలు వేసి అగ్ర నాయకులను భాగస్వాములుగా చేసింది. జిల్లాస్థాయి సమన్వయకులకు బాధ్యతలు కేటాయించింది. దీంతో పాదయాత్రలో చేపట్టబోయే చర్యలపై ఓ క్లారిటీ ఇచ్చారు.

కొండా రాఘవరెడ్డి, తూడి దేవేందర్ రెడ్డి, వాడుక రాజగోపాల్ రెడ్డి, పిట్టా రామ్ రెడ్డి, ఏపూరి సోమన్న, సయ్యద్ ముజ్తాబా అహ్మద్, మతీన్ ముజాద్జాది, బానోతు సుజాత, బి. సత్యవతి, నీలం రమేశ్ నాయకుల సారధ్యంలో కమిటీలు పనిచేయాల్సి ఉంటుంది. రూట్ మ్యాప్ కోఆర్డినేషన్ కమిటీ, లాజిస్టిక్ కమిటీ, అకంపెయినింగ్ కమిటీ, రచ్చబండ, బహిరంగ సభల పర్యవేక్షణ మొబిలైజేషన్ సమన్వయ కమిటీలను పార్టీ నాయకత్వం నియమించింది.
పబ్లిసిటీ, సోషల్ మీడియా, ఎలక్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సమన్వయ కమిటీలు ఉన్నాయి. పాదయాత్ర సమయంలో షర్మిల ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా మెడికల్ కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేశారు. దీంతో పాదయాత్రలో తీసుకోబోయే ప్రతి చర్యలపై చర్చించారు. అడుగడుగునా ఆహారం, మంచినీటి వసతి కల్పించడానికి అగ్రస్థాయి నాయకులు అందుబాటులో ఉండనున్నారు.
క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకుంటూ నోటు తయారు చేసుకుని సమస్యలపై అధ్యయనం చేయనున్నారు. వాటిని పరిష్కరించే క్రమంలో ఎదురయ్యే సవాళ్లపై తీసుకోవాల్సిన చర్యలపై ఎంత బడ్జెట్ అవుతుందనే దానిపై నేతలతో చర్చించనున్నారు. పాదయాత్ర సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.