Homeఆంధ్రప్రదేశ్‌Magunta Sreenivasulu Reddy: టిడిపిలోకి ఒంగోలు ఎంపీ మాగుంట.. వెంట వారు కూడా!

Magunta Sreenivasulu Reddy: టిడిపిలోకి ఒంగోలు ఎంపీ మాగుంట.. వెంట వారు కూడా!

Magunta Sreenivasulu Reddy: ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీని వీడడం దాదాపు ఖాయమేనా? ఆయన తెలుగుదేశం పార్టీలో చేరుతారా? చంద్రబాబుకు టచ్ లోకి వెళ్ళారా? వెళ్తూ వెళ్తూ తన వెంట కొందరు ఎమ్మెల్యేలను తీసుకువెళ్తారా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. గత కొద్దిరోజులుగా వైసిపి హై కమాండ్ తీరుపై మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆగ్రహంగా ఉన్నారు. అడుగడుగునా తనకు అవమానాలు ఎదురవుతున్నాయని ఆవేదనతో ఉన్నారు. కానీ ఎక్కడా వ్యక్తం చేయడం లేదు. తన పని ఏదో తాను చేసుకుంటున్నారు. ఒంగోలు ఎంపీ అభ్యర్థి విషయంలో తన కుమారుడికి జగన్ క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో.. ఇక పార్టీలో ఉండడం అనవసరమని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే టిడిపిలోకి వెళ్లేందుకు దాదాపు ఒక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

టిడిపి అధినేత చంద్రబాబుకు మాగుంట టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఒంగోలు లేదా నెల్లూరు ఎంపీ టికెట్ తన కుమారుడికి ఇస్తే సైకిల్ ఎక్కేందుకు తాను రెడీగా ఉన్నట్లు మాగుంట చెప్పినట్లు సమాచారం. చంద్రబాబు నుంచి స్పష్టమైన హామీ పొందినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రెండుసార్లు చంద్రబాబుతో మాగుంట చర్చించినట్లు టాక్ నడుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే అతి త్వరలో మాగుంట తన కుమారుడు రాఘవరెడ్డి తో కలిసి టిడిపి లోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే నెల్లూరు, ప్రకాశం జిల్లాలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారే అవకాశాలు ఉన్నాయి.

వైసీపీలో మరోసారి ఎంపీ టికెట్ లభించాలంటే రూ.180 కోట్లు చెల్లించాలని.. చంద్రబాబుతో పాటు పవన్, లోకేష్ ను గట్టిగా తిట్టాలని జగన్ సూచించినట్లు వార్తలు వచ్చాయి. తాను వ్యక్తిగతంగా విమర్శలు చేయనని మాగుంట చెప్పడంతో జగన్ పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఒంగోలు ఎంపీగా వైవి సుబ్బారెడ్డి తో పోటీ చేయించాలని ఒక నిర్ణయానికి రావడంతో మాగుంట పార్టీ నుంచి బయటికి వెళ్లిపోవడమే మేలన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మరోవైపు మాగుంటకు ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, మానుగుంట మహీధర్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సీట్ల విషయంలో చంద్రబాబు ఆచీ తూచీ నిర్ణయం తీసుకుంటున్నారు. అయితే మాగుంట చర్యలతో వైసిపి శిబిరంలో టెన్షన్ మొదలైనట్లు సమాచారం. ఒక్క మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు మాత్రమే టిడిపిలో చేరుతారా? ఒకరిద్దరు కీలక ఎమ్మెల్యేలు కూడా క్యూ కడతారా? అన్నది చూడాల్సి ఉంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version