YCP Ministers: వైసీపీలో జనసేనాని పవన్ కళ్యాణ్ భయం అలుముకుంది. వైసీపీ కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు తాజాగా రాజమండ్రిలో సమావేశమై దూరమవుతున్న కాపులను, వారి ఓట్లను మళ్లీ దగ్గరచేసుకునేందుకు కొత్త నాటకానికి జగన్ డైరెక్షన్ లో తెరతీశారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ కాపులను రెచ్చగొట్టి వైసీపీకి దూరం చేస్తున్నారని.. తమ ప్రభుత్వం కంటే ఎక్కువగా కాపులకూ ఎవరూ చేయలేరని.. పవన్ ను నమ్మవద్దంటూ కాపులపై లేని ప్రేమను ఒలకబోస్తూ వ్యాఖ్యానించారు. చంద్రబాబుతో కలవకుండా దమ్ముంటే పవన్ ఒంటరిగా పోటీచేయాలని సవాల్ చేశారు.
వైయస్సార్‌సీపీలో కాపు సామాజిక వర్గానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు రాజమండ్రిలో సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రులు బొత్స సత్యనారాయణ, కొట్టు సత్యనారాయణ, అంబటి రాంబాబు, దాడిశెట్టి రాజా. మాజీ మంత్రి కురసాల కన్నబాబులు పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌గారితోనే కాపులకు రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయం వైయస్సార్‌సీపీ కాపు ప్రజా ప్రతినిధుల స్పష్టం చేశారు. ‘కాపు సామాజిక వర్గానికి ప్రభుత్వంలో పెద్దపీట అన్ని పధకాలు, రంగాలలో అత్యధిక ప్రాధాన్యమిస్తున్నామని.. చంద్రబాబు కంటే లక్ష రెట్లు మేలు చేసిన ప్రభుత్వం వైయస్సార్‌సీపీ’ అని ఆ పార్టీ కాపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల ప్రకటించారు.
మూడేళ్లలో కాపులకు దాదాపు రూ.27 వేల కోట్లు గతంలో వైయస్సార్ ప్రభుత్వం ఒక్కటే కాపులకు మేలు చేసిందని.. మళ్లీ జగన్‌గారి ప్రభుత్వంలో గౌరవంగా బతుకుతున్నామని వైయస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల వెల్లడించారు. కాపు ఎమ్మెల్యేలపై పవన్‌కళ్యాణ్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని కాపు మంత్రులు అన్నారు. రంగా హత్య ఘటనపైనా పవన్ కళ్యాణ్ అనైతిక మాటలు రంగాను కాపులు ఎందుకు కాపాడుకోలేదని పవన్ ప్రశ్నించారు. అదే రంగాను చంపించిన చంద్రబాబుతో వెంటనే భేటీ అయ్యారు. ఈ విషయాన్ని కాపు సోదరులు, సామాజికవర్గం గమనించాలని గుర్తు చేసిన బొత్స, కొట్టు, అంబటి, దాడిశెట్టి, కురసాల
‘పవన్‌ను తిట్టేందుకు మేము సమావేశం కాలేదని.. ఆయన్ను తిట్టలేదు. నా కొడుకా అనలేదు. చెప్పు చూపలేదు..మాకు సభ్యత, సంస్కారం ఉంది. స్వశక్తితో ఎదిగాం’ అని వైయస్సార్‌సీపీ మంత్రులు స్పష్టం చేశారు. పవన్‌కళ్యాణ్ 175 సీట్లలో సింగిల్‌గా పోటీ చేస్తారా? ధైర్యం ఉంటే చెప్పండి. మేము అలా పోటీ చేస్తాం. మీడియా మీట్‌లో పవన్‌ను మంత్రులు సవాల్ చేశారు. ‘‘పవన్‌కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో 175 సీట్లలో సింగిల్‌గా పోటీ చేస్తారా? చెప్పండి. ఆ పని మేము చేస్తాం. వచ్చే ఎన్నికల్లో మొత్తం 175 సీట్లలో ఎన్ని సీట్లకు పవన్‌కళ్యాణ్ పార్టీ సింగిల్‌గా పోటీ చేస్తుంది? ధైర్యముంటే చెప్పమనండి. అసెంబ్లీ సమావేశాల సమయంలో మరోసారి సమావేశమై, అన్నీ చర్చించి సీఎంగారిని కలవాలన్న ఆలోచన కూడా వచ్చింది. ఇక రిజర్వేషన్ల గురించి మా పరిధిలో ఉన్న అంశాన్ని మేము చెప్పాం. చంద్రబాబు మాదిరిగా మోసం చేయడం లేదు. ’’ అంటూ సవాళ్లు విసిరారు.
ఇలా పవన్ ను రెచ్చగొట్టి చంద్రబాబుతో కలవనీయకుండా వైసీపీ మంత్రులు గేమ్ ప్లాన్ చేసినట్టుగా అర్థమవుతోంది. మరి ఈ ట్రాప్ లో పవన్ పడుతారా? లేక పొత్తులతోనే వైసీపీని ఓడిస్తారా? అన్నది వేచిచూడాలి.