Minister Extortion : ఆ సంబరాల మంత్రి పేరు తెలియని వారు ఏపీలో ఉండరు. సంక్రాంతి సందర్భంగా ఆయన చేసిన సంబరాలు అలాంటివి. రోడ్డు పై డ్యాన్సులేస్తూ జనానికి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. అభివృద్ధి చేయకపోయినా కనీసం ఎంటర్టైన్మెంట్ అయినా ఇస్తున్నాడని జనం ఆయన టాలెంట్ ను మెచ్చుకోలేక ఉన్నారట. ఇప్పుడు ఆ మంత్రి సంగతెందుకు అనుకుంటున్నారా ?. ఆ సంబరాల బాబే కాదు.. సైకో బాబు అని కూడా నిరూపించుకుంటున్నాడు.

ఆయన నియోజకవర్గంలోని డ్రైనేజీ పనుల్లో ఒకరు మరణించారు. బిడ్డ మరణించడంతో తల్లిదండ్రులు అనాథలయ్యారు. పోషించేవారు లేక నిరాశ్రయులయ్యారు. దీంతో వారికి ప్రభుత్వం పరిహారంగా ఐదు లక్షలు ప్రకటించింది. ఇక రేపో.. ఎల్లుండో చెక్కు పంపిణీ చేయాలి. కానీ బాధితులకు చెక్కు పంపిణీ జరగలేదు. కారణం ఏంటని చూస్తే .. సంబరాల బాబుకు సగం వాటా ఇవ్వకపోవడమే చెక్కు పంపిణీ చేయకపోవడానికి కారణమని తెలుస్తోంది. బాధితులకు వచ్చే ఐదులక్షల్లో .. రెండున్నర లక్షలు తనకు ఇవ్వాలని మంత్రి డిమాండ్ చేశారట.
బాధితులు మంత్రి డిమాండ్ కు ఒప్పుకోలేదు. సగం డబ్బు ఇచ్చేందుకు నిరాకరించారు. పైగా జనసేన నేతల సహాయంతో మీడియా ముందుకొచ్చారు. దీంతో అంబటికి అరికాల్లో మండింది. తనపైనే మీడియాకెక్కుతారా ? అంటూ తన ప్రతాపం చూపారు. చెక్కు పంపిణీ చేయాల్సిన సమయానికి చెక్కు పోయిందంటూ నాటకమాడారు. ఆ తర్వాత చెక్కు వెనక్కి పంపామని అధికారులు సెలవిచ్చారు. సంబరాల బాబు సైకోయిజం పై జనం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారట. మంత్రి మరీ ఇంత శాడిస్టా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బాధితులు బిడ్డను పోగొట్టుకుని పుట్టెడు బాధలో ఉన్నారు. అలాంటి వారి పై కక్ష సాధించడం ఎంతవరకు సమంజసమని బాధితులు వాపోతున్నారు. తమ ఉసురుపోసుకుంటాడంటూ బాధితులు శాపనార్థాలు పెడుతున్నారు. అయినా కూడా మంత్రి తీరు మారకపోవడం గర్హనీయం. శవాల మీద పేలాలు ఏరుకోవడం అంటే ఇదే. ఇంతటి సైకోయిజమా ?. ప్రజల్ని రాబందుల్లా పీక్కు తినడానికా అధికారం ఇచ్చిందని జనం ప్రశ్నిస్తున్నారు. జనం ప్రశ్నకు సమాధానం చెప్పగలరా ? తలెక్కడ పెట్టుకుంటారు మంత్రి గారు.