Kodali Nani On Viveka Murder Case: ఏపీలో కొందరు వైసీపీ నేతలు రాజకీయ ప్రత్యర్థులపై వాడే భాష అభ్యంతరకరంగా ఉంటుంది. మరీ ఎబ్బెట్టుగా, జుగుప్సాకరంగా ఉంటుంది. ఇతరులకు కంపు అయినా.. అధికార పార్టీ శ్రేణులకు మాత్రం ఇంపుగా, హీరోయిజాన్ని చాటేలా ఉంటుంది. తటస్థులు, రాజకీయాలతో సంబంధం లేని వారు మాత్రం అటువంటి నేతల చర్యలను తప్పుపడుతున్నారు. అటువంటి వారి కామెంట్స్ చదవడం, వినడం, చూడడం మానేస్తున్నారు. అయితే ఇటువంటి మాటలకు అలవాటుపడిపోయిన నేతలు సొంత పార్టీ నేతలపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారు. తాజాగా మాజీ మంత్రి కొడాలి నాని వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీఎం జగన్ ను వెనుకేసుకొచ్చే ప్రయత్నంలో వాడిన భాష మాత్రం అభ్యంతరకరంగా ఉంది. తన మార్క్ భాషతో వైఎస్ కుటుంబంపైనే కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు.
Also Read: CM Jagan- Kodali Nani: కొడాలి నానిపై సీఎం జగన్ ఆగ్రహం.. అసలేంటి వివాదం
వివేకా చచ్చినా..బతికినా అంటూ నాని కామెంట్స్ ప్రారంభించారు. దినం ఖర్చులు, కాఫీ ఖర్చులు అంటూ చెలరేగిపోయారు. ఈ క్రమంలో వివేకానందరెడ్డి హత్యకేసులో కొన్ని విషయాలను బయటపెట్టేశారు. ‘వివేకానందరెడ్డి బతికి ఉన్నా.. జగన్ అవినాష్ రెడ్డికే ఎంపీ సీటు ఇచ్చుండేవారు. ఎందుకంటే కాంగ్రెస్ కు రాజీనామా చేసి కడప ఎంపీగా జగన్, పులివెందుల ఎమ్మెల్యేగా విజయమ్మ పోటీచేసినప్పుడు వివేకానందరెడ్డి ప్రత్యర్థులకే సపోర్టు చేశారు. అవినాష్ రెడ్డి ఆయన తండ్రి భాస్కరరెడ్డి మాత్రం వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ వెంటే ఉన్నారు. ఆయన విజయానికి తొడ్పాటు అందించారు. అందుకే జగన్ వారికే టిక్కెట్ ఇస్తారంటూ వ్యాఖ్యానించారు.
అయితే ఇప్పుడు నాని వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. కేసులో అసలు నిజాలు తెలుస్తున్నాయి. కొన్నిరకాల అనుమానాలు నివృత్తి అవుతున్నాయి. నాని కామెంట్స్ వైఎస్ కుటుంబం మొత్తాన్ని కించపరిచేలా ఉన్నాయి. కుటుంబంలో ఏం జరిగినా పరువు కాపాడుకోవాల్సిన పెద్దలు కొడాలి నాని లాంటి వారికి స్వేచ్చనిచ్చి… తమ కుటుంబంపైనే ఇష్టారీతిన మాట్లాడే అవకాశం కల్పిస్తున్నారు. ఎమ్మెల్యేలతో జగన్ భేటీ తర్వాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిన కొడాలి నాని.. మాట్లాడిన భాష విన్న వారెవరికైనా… జగన్ అనుమతి లేకుండా ఇలాంటి భాష మాట్లాడతారా అనే డౌట్ రాకుండా ఉండదు. అయితే చాలామందికి నాని కామెంట్స్ ఆశ్చర్యపరచలేదు. కానీ వైఎస్ కుటుంబ అభిమానులకు మాత్రం ఇవి మింగుడుపడడం లేదు.
వివేకాను హత్యచేయడం వల్ల ఆయన ఆస్తులు భార్య, పిల్లలకు దఖలు పడ్డాయని.. వారే లబ్ధిదారులు అయినప్పుడు.. వారెందుకు చంపకూడదన్న వాదన తెరపైకి తెచ్చారు. ఇప్పుడేమో వివేకా జగన్ నాశనాన్ని కోరుకున్నారని గుర్తు చేస్తూ కొత్త అనుమానాలకు అవకాశమిచ్చారు. నాశనాన్ని కోరుకున్నాడు కనుక హత్య జరిగినా తప్పులేదన్న అర్ధం వచ్చేలా నాని మాట్లాడారు. అవినాష్ రెడ్డికి అండగా జగన్ ఉండడాన్ని సమర్థించుకున్నారు. అయితే ఇది నాని అభిప్రాయమే కాదు. జగన్ అభిప్రాయం కూడా. కేవలం తమను వ్యతిరేకించారు కనుక వివేకాకు ఏం జరిగినా తప్పులేదన్న సరికొత్త వాదన ఇబ్బందికరంగా ఉంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తరువాత కుటుంబమంతా ఏకతాటిపైకి వచ్చి జగన్ ను ప్రోత్సహించింది. కానీ జగన్ అధికారంలోకి వచ్చాక ఆ కుటుంబాన్ని ఏకతాటిపైకి తేవడంలో మాత్రం విఫలమవుతున్నారు. ఇప్పుడు కొడాలి నాని వంటి వారిని ప్రయోగించి నవ్వులపాలవుతున్నారు.
Also Read:Rushikonda Green Matt : ట్రోల్ ఆఫ్ ది డే : రుషికొండకు గ్రీన్ మ్యాట్.. ఇంతకంటే సెటైర్ ఉండదేమో