YS Vivekanandareddy case : అప్రూవర్ గా మారి జగన్, అవినాష్ రెడ్డిపై బాంబు పేల్చిన దస్తగిరి

YS Vivekanandareddy case :  ఏపీలో వైఎస్ వివేకానందరెడ్డి కేసు విచారణ ప్రకంపనలు సృష్టిస్తోంది. నాలుగేళ్ల క్రితం జరిగిన ఈ హత్యోదంతంపై వేగం పెంచిన సీబీఐ అధికారులు చేస్తున్న అరెస్టులు డైరెక్టుగా అధికార వైసీపీని తాకుతున్నాయి. ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న డ్రైవర్ దస్తగిరి, ఆ తరువాత అప్రూవర్ గా మారిపోయారు. చేసిన తప్పునకు పశ్చాత్తాప పడుతున్నట్లు చెప్పారు. అందుకే కేసులోని అన్ని విషయాలను సీబీఐ అధికారులకు చెప్పేసినట్లు తెలిపారు. వివేకా హత్య కేసుకు సంబంధించిన పలు […]

Written By: SHAIK SADIQ, Updated On : April 17, 2023 8:04 pm
Follow us on

YS Vivekanandareddy case :  ఏపీలో వైఎస్ వివేకానందరెడ్డి కేసు విచారణ ప్రకంపనలు సృష్టిస్తోంది. నాలుగేళ్ల క్రితం జరిగిన ఈ హత్యోదంతంపై వేగం పెంచిన సీబీఐ అధికారులు చేస్తున్న అరెస్టులు డైరెక్టుగా అధికార వైసీపీని తాకుతున్నాయి. ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న డ్రైవర్ దస్తగిరి, ఆ తరువాత అప్రూవర్ గా మారిపోయారు. చేసిన తప్పునకు పశ్చాత్తాప పడుతున్నట్లు చెప్పారు. అందుకే కేసులోని అన్ని విషయాలను సీబీఐ అధికారులకు చెప్పేసినట్లు తెలిపారు. వివేకా హత్య కేసుకు సంబంధించిన పలు కీలక విషయాలను మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు.

అప్రూవర్ గా మారిన దస్తగిరిపై ఎంపీ అవినాష్ రెడ్డి పలుమార్లు ఫైర్ అయ్యారు. అతను చెప్పిన ప్రకారం సీబీఐ నడుచుకుంటుందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన దస్తగిరి మాట్లాడుతూ ఆ రోజు అప్రూవర్ గా మారినప్పుడు విమర్శించని వాళ్లు, ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. తమదాకా వస్తేగాని తెలియడం లేదా అని అన్నారు. మొన్నటి వరకు మంచి వ్యక్తి అయిన తాను ఇప్పుడు చెడ్డవాడినయ్యానా అని పేర్కొన్నారు.

డబ్బులకు ఆశపడి ఆ రోజు యర్ర గంగిరెడ్డి చెప్పినట్లు చేశానని దస్తగిరి అన్నారు. ఇప్పుడు ఆ అవసరం లేదని పేర్కొన్నారు. ‘‘దస్తగిరి అనే వాడు సునీతమ్మ దగ్గర గాని, ఇతరుల వద్ద పది రూపాయలు తీసుకున్నట్లు నిరూపించగలరా’’ అని సవాల్ విసిరారు. పలుకుపబడి ఉందని సీబీఐ ఏఎస్పీ రాంసింగ్ ను మార్చేశారని ఆరోపించారు. అంతమాత్రాన కేసు కొత్త కోణంలోకి వెళ్తుందా అని అన్నారు. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి పాత్ర ఉండటం వల్లే పలుమార్లు సీబీఐ విచారించిందని స్పష్టం చేశారు.

ఇప్పటికీ అవినాష్ రెడ్డి వల్ల తనకు ప్రాణహాని ఉందని దస్తగిరి పేర్కొన్నారు. ‘‘ నేను తప్పు చేస్తే జైలుకు వెళ్లడానికి రెడీ. మీరు తప్పు చేసినట్లు రుజవు అయితే పదవులకు రాజీనామా చేస్తారా’’ అని అవినాష్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. తాను ఎక్కడికీ పారిపోలేదని పులివెందుల వైఎస్ జయమ్మ కాలనీలోనే ఉన్నానని దస్తగిరి అన్నారు.

ఇదిలా ఉండగా, ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ పిటీషన్ ను తెలంగాణ హై కోర్టు రేపటికి వాయిదా వేసింది. రేపు సాయంత్రం వరకు ఆయనను విచారించవద్దని సీబీఐని కూడా ఆదేశించింది. మరోవైపు జగన్ పార్టీ నేతలతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి భవిష్యత్తు కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ఆ వెంటనే పేర్ని నాని మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రతిపక్షాలపై విమర్శల దాడిని ఎక్కు పెట్టి కౌంటర్ ఎటాక్ మొదలుపెట్టారు.