Homeఆంధ్రప్రదేశ్‌YS Sharmila - YS Jagan : అన్నతో అంటీముట్టనట్టుగా షర్మిల

YS Sharmila – YS Jagan : అన్నతో అంటీముట్టనట్టుగా షర్మిల

YS Sharmila – YS Jagan :  ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహ నిశ్చితార్థ వేడుకలు ఘనంగా జరిగాయి. అట్లూరి ప్రియతో రాజారెడ్డి పెళ్లి నిశ్చయం అయిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా హైదరాబాద్ శివార్లలోని గండిపేట గోల్కొండ రిసార్ట్ లో నిశ్చితార్థ వేడుకలను ఏర్పాటు చేశారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. అయితే అందరి దృష్టి షర్మిల సోదరుడు, ఏపీ సీఎం జగన్ పైనే ఉంది. జగన్ కార్యక్రమానికి హాజరు కాగా.. షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్ కంటే విజయమ్మతో మాత్రమే చనువుగా గడపడం విశేషం.

నిశ్చితార్థ వేడుకలకు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు అధికంగా హాజరయ్యారు. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నటుడు మోహన్ బాబు, విష్ణు, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, ఏపీ కాంగ్రెస్ నేత శైలజనాథ్, జెడి శీలం, ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి, వివేక్ తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఏపీ సీఎం జగన్ మాత్రం కొద్దిసేపు మాత్రమే అక్కడ గడిపారు. సరిగ్గా రాత్రి ఎనిమిది గంటల సమయంలో సీఎం జగన్ దంపతులు రిసార్ట్ కు చేరుకున్నారు. భార్య భారతి తో కలిసి నేరుగా ప్రధాన వేదిక వద్దకు వెళ్లారు. ముందుగా తల్లి విజయమ్మను ఆప్యాయంగా హత్తుకున్నారు. పక్కనే ఉన్న షర్మిలను పలకరించారు. కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే షర్మిల దంపతులు అంటి ముట్టనట్టుగా వ్యవహరించడం విశేషం. సీఎం జగన్ తో గ్రూప్ ఫోటో దిగేందుకు షర్మిలను రెండుసార్లు పిలిచినా రాలేదు. చివరకు విజయమ్మ గట్టిగా కోరడంతో మూడోసారి షర్మిల వచ్చి చేరారు. అది కూడా వరుసలో చివరిగా నిల్చుని ఫోటోలకు దిగడం విశేషం. దీంతో పొడి పొడి పలకరింతలతో జగన్ అక్కడ నుంచి వెళ్లిపోయారు. జగన్ వెంట ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, వై వి సుబ్బారెడ్డి ఉన్నారు. మొత్తానికైతే జగన్ వచ్చారు.. అలా వెళ్లిపోయారే కానీ.. ఎక్కువగా ముభావంగా ఉండిపోయారు. అటు షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్ దంపతులు సైతం పెద్దగా జగన్ ను పట్టించుకోలేదు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version