Homeజాతీయ వార్తలుYS Sharmila: సంచ‌ల‌న నిర్ణ‌యం దిశ‌గా ష‌ర్మిల‌.. ఎన్నిక‌ల‌కు దూరంగానే..?

YS Sharmila: సంచ‌ల‌న నిర్ణ‌యం దిశ‌గా ష‌ర్మిల‌.. ఎన్నిక‌ల‌కు దూరంగానే..?

YS Sharmila: తెలంగాణ‌లో పార్టీ పెట్టి ఇక్క‌డ జెండా పాతాల‌ని చూస్తున్న ష‌ర్మిల‌కు మొద‌టి నుంచి షాక్ లు త‌గులుతూనే ఉన్నాయి. పార్టీ పెట్ట‌క ముందు ఆమెకు ఉన్న గౌర‌వ‌, మ‌ర్యాద‌లు వేరు. ఏపీలో ఆమె సీఎం చెల్లెలిగా తిరుగులేని ప‌వ‌ర్‌లో ఉండేవారు. కానీ అనూహ్యంగా తెలంగాణ‌లోకి వ‌చ్చి ఇక్క‌డ అధికారంలోకి రావాలని చూడట‌మే పెద్ద స‌వాల్‌. ఎందుకంటే వైఎస్సార్ ఫ్యామిలీ మీద తెలంగాణ ప్ర‌జ‌ల‌కు వ్య‌తిరేక‌త తీసుకు వ‌చ్చారు కేసీఆర్‌.

YS Sharmila
YS Sharmila

కానీ ఆమె మాత్రం రాజ‌న్న బిడ్డ‌ను, తెలంగాణ కోడ‌లిని అంటూ.. రాజ‌న్న రాజ్యం సెంటిమెంట్‌ను వాడాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. కానీ అది ఏ కోశాన జ‌ర‌గ‌ట్లేదు. నిరుద్యోగుల త‌ర‌ఫున ఎన్ని దీక్ష‌లు చేసినా పెద్ద‌గా స్పంద‌న మాత్రం రావ‌ట్లేదు. పైగా అన్న జ‌గ‌న్‌తో వ‌చ్చిన విభేదాలు కూడా ఆమెకు ఇబ్బ‌దులు తెచ్చిపెడుతున్నాయి. ఈ కార‌ణంగానే ఆమె పార్టీలో ఎవ‌రూ పెద్ద‌గా జాయిన్ కావ‌ట్లేదు. ఒక్క నియోజ‌క‌వ‌ర్గంలో కూడా చెప్పుకోద‌గ్గ నేత‌లు ఆమె పార్టీలో లేరు.

Also Read: సమ్మె చేయాలని ఉద్యోగులను చంద్రబాబు, రామోజీ, రాధాకృష్ణ రెచ్చగొడుతున్నారా?

మొన్న‌టికి మొన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి టీఆర్ ఎస్‌ను వీడుతార‌నే వార్త‌ల క్ర‌మంలో.. ఆయ‌న వెళ్లి జ‌గ‌న్ స‌ల‌హా తీసుకున్నారు. జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితుడు కావ‌డంతో.. జ‌గ‌న్‌కూడా ఆయ‌న్ను టీఆర్ ఎస్‌లోనే ఉండాలంటూ సూచించారంట‌. అదే జ‌గ‌న్‌తో ష‌ర్మిల‌కు విభేదాలు లేక‌పోతే జ‌గ‌న్‌ను చూసి అయినా ష‌ర్మిల పార్టీలోకి వ‌చ్చేవారు చాలామందే ఉన్నారు.

ఇక సుదీర్ఘ పాద‌యాత్ర కూడా కొన్ని కార‌ణాల వ‌ల్ల వాయిదాలు వేసుకున్నారు ష‌ర్మిల‌. ఎప్పుడు స్టార్ట్ చేస్తారో కూడా తెలియ‌ని ప‌రిస్థితి. వాస్త‌వానికి తెలంగాణ‌లోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆమె పార్టీ పెట్టిన‌ట్టు కూడా పెద్ద‌గా ఎవ‌రికీ తెలియ‌దు. ఇక ఎన్నిక‌ల‌కు కూడా పెద్ద‌గా స‌మ‌యం లేదు. ఇలాంటి ప‌రిస్థితుల్లో పార్టీని వ‌చ్చే ఎన్నిక‌ల్లో బ‌రిలో దింప‌క‌పోవ‌డ‌మే బెట‌ర్ అని భావిస్తున్నారంట‌. ఇంత త‌క్కువ స‌మ‌యంలో పార్టీని బ‌లోపేతం చేయ‌డం సాధ్యం అవుతుందా అనే అంశం మీద అత్యంత సన్నిహితులు, పార్టీ కీల‌క నేత‌ల‌తో ఆమె చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్టు తెలుస్తోంది.

Also Read: దైవ‌భ‌క్తి మెండు.. ప్ర‌స్తుతానికి ఇదే ట్రెండ్.. జ‌గ‌న్ వెళ్లేది అందుకేనా?

ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో పోటీ చేస్తే అటు డ‌బ్బుతో పాటు, పేరు కూడా పూర్తిగా పోతుంద‌ని, ప్ర‌జ‌ల్లో న‌మ్మ‌కం కోల్పోతామ‌ని చ‌ర్చ‌ల్లో స‌న్నిహితులు చెబుతున్నారంట‌. కాబ‌ట్టి పూర్తిగా పార్టీని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లిన త‌ర్వాతే పోటీ చేయ‌డం మంచిద‌ని, నేత‌ల‌ను పార్టీలో చేర్చుకుంటేనే బ‌లోపేతం అవుతుంద‌ని ఆలోచిస్తున్నారంట‌. ఈ ప‌రిణామాల రీత్యా ఆమె ఎన్నిక‌ల‌కు పార్టీని దూరంగా దూరంగా ఉంచాల‌ని డిసైడ్ అయ్యారంట‌.

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

3 COMMENTS

  1. […] Chiranjeevi: టికెట్ రేట్లు తగ్గించి జగన్ ప్రభుత్వం సినిమా పరిశ్రమను దెబ్బ కొట్టింది. అయితే, జగన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పై పెదవి విప్పడానికి కూడా ఏ హీరోకి ధైర్యం సరిపోవడం లేదు. అందుకే ఇప్పటివరకు ఏ తెలుగు స్టార్ హీరో ఈ అంశం పై స్పందించలేదు. అయితే విచిత్రంగా ఇప్పుడు తెలుగు స్టార్ హీరోలంతా జగన్ తో భేటీకి సిద్ధం అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి మిగతా పెద్ద హీరోలను కూడా జగన్ దగ్గరకు తీసుకెళ్లడానికి రంగం సిద్ధం చేశారు. […]

  2. […] Sarkaru Vaari Paata: సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు – సెన్స్ బుల్ డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ‘సర్కారు వారి పాట’. కాగా తాజాగా జరుగుతున్న షెడ్యూల్‌ లో మహేష్ కూడా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. మార్చి చివరి నాటికి ఈ సినిమా షూటింగ్‌ ను పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. పరశురామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular