ఓపెన్ హార్ట్ విత్.. షర్మిల

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ వైఎస్ కుటుంబానికి బద్ధ శత్రువుగా మొదటి నుంచి అందరూ భావిస్తుంటారు. ఈ మధ్య వైఎస్ కుటుంబం పై దృష్టి సారించిన ఆర్కే.. మరో సిక్సర్ కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. షర్మిల పార్టీ పెట్టేందుకు ఒక దశలో పరోక్షంగా కారణమైన రాధాకృష్ణ షర్మిలతో త్వరలో ప్రత్యేక ఇంటర్వ్యూ ప్లాన్ చేసినట్లు సమాచారం. షర్మిల టీం నుంచి వచ్చిన ఇప్పటికే వచ్చిన సమాచారం మేరకు.. రాధాకృష్ణ సైతం అంగీకారం తెలిపినట్లు సమాచారం. ఈ […]

Written By: Srinivas, Updated On : April 8, 2021 2:58 pm
Follow us on


ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ వైఎస్ కుటుంబానికి బద్ధ శత్రువుగా మొదటి నుంచి అందరూ భావిస్తుంటారు. ఈ మధ్య వైఎస్ కుటుంబం పై దృష్టి సారించిన ఆర్కే.. మరో సిక్సర్ కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. షర్మిల పార్టీ పెట్టేందుకు ఒక దశలో పరోక్షంగా కారణమైన రాధాకృష్ణ షర్మిలతో త్వరలో ప్రత్యేక ఇంటర్వ్యూ ప్లాన్ చేసినట్లు సమాచారం. షర్మిల టీం నుంచి వచ్చిన ఇప్పటికే వచ్చిన సమాచారం మేరకు.. రాధాకృష్ణ సైతం అంగీకారం తెలిపినట్లు సమాచారం. ఈ విషయంపై జోరుగా చర్చసైతం జరుగుతోంది.

ఏబీఎన్లో గతంలో వేమూరి రాధాకృష్ణ ప్రత్యేక ఇంటర్వ్యూలు చేసేవారు. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే పేరుతో అందుకు సంబంధించిన కార్యక్రమాలు వారంతంలో ప్రసారం అయ్యేవి. మొదట్లో వివాదాస్పద ప్రశ్నలతో సంబంధిత కార్యక్రమానికి ఆర్కే విపరీతమైన క్రేజ్ తీసుకొచ్చి పెట్టారు. చాలాకాలం పాటు నడిచిన ఆ కార్యక్రమం.. కొంతకాలం క్రితం సరైన సెలబ్రెటీలు లేక మధ్యలో నిలిచిపోయింది. అయితే ఇప్పుడు తిరిగి ప్రారంభించాలని అనుకుంటున్న ఆర్కే… షర్మిలతో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రాంను లాంచ్ చేయాలని చూస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఏర్పాట్లన్ని పూర్తయ్యాయని… రాధాకృష్ణతో ఇంటర్వ్యూ అంటే.. షర్మిల కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.

వైఎస్ కుటుంబలో విభేదాలు ఉన్నాయని చెప్పేందుకు ఆర్కే ఈ కార్యక్రమాన్ని వినియోగించుకుంటున్నారు. అయితే షర్మిల మొత్తంగా రాజకీయ నేతగా మారారు కాబట్టి.. ఆమె ఎలాంటి ప్రొజెక్షన్ కోరుకుంటుందో.. అదే ఇంటర్వ్యూలో వెల్లడించే అవకాశలున్నాయి. కుటుంబంలో గొడవలు ఉన్నాయని.. బయటపెట్టాలని అనుకుంటే.. పెడతారని అంటున్నారు. అయితే ఇతర మీడియాలకు కాకుండా షర్మిల ఆంధ్రజ్యోతికి ప్రాధాన్యం ఇవ్వడం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. షర్మిల తెలంగాణలో తన రాజకీయ పార్టీకి మీడియా సహకారం ఎంతో అవసరం అని నమ్ముతున్నారు.

సోదరుడు ఏపీ సీఎం వైఎస్. జగన్ మోహన్ రెడ్డి మీడియా కవరేజీ కూడా షర్మిలకు ఇవ్వడం లేదు. ఎక్కడో చిన్న మూలన వార్తను సాక్షి ప్రసారం చేస్తోంది. ఇతర మీడియాలు కవరేజీ ఇస్తున్నా.. వాటి అజెండా వేరు. తమ యజమానులకు అవసరమైన పెద్దలకు ఉపయోగపడేంత వరకు షర్మిలకు హైప్ ఇస్తాయి. తరువాత కాడి కింద పడేస్తాయి. అందుకే షర్మిల తెలంగాణలో ఆంధ్రజ్యోతిని నమ్ముకుంటున్నట్లుగా కనిపిస్తోంది.