https://oktelugu.com/

YS Sharmila: షర్మిల దీక్ష.. ఫలితం మాత్రం దక్కలేదు పక్కా

YS Sharmila: తానోటి తలిస్తే దైవమొకటి తలచిందన్నట్లుగా ఉంది షర్మిల పరిస్థితి. ఏదో అనుకుంటే మరేదో జరిగినట్టు తయారయింది. హైదరాబాద్ లో ఆరేళ్ల చిన్నారి హత్యాచారం కేసులో వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల తన ప్రభావం చూపెట్టుకోవాలని సంకల్పించింది. కానీ వ్యూహం బెడిసికొట్టింది. రాజకీయం చేయడమంటే అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవడం కాదు. దాని వల్ల ఒనగూడే ప్రయోజనాలు లెక్కలోకి తీసుకోవాలి. అలా కాకుండా అనుకున్నదే తడవుగా చిన్నపిల్లలు చేసినట్లు చేయడంతో మొదటికే మోసం వచ్చింది. అందరిలో అభాసుపాలయ్యారు. […]

Written By:
  • Srinivas
  • , Updated On : September 16, 2021 / 11:16 AM IST
    Follow us on

    YS Sharmila: తానోటి తలిస్తే దైవమొకటి తలచిందన్నట్లుగా ఉంది షర్మిల పరిస్థితి. ఏదో అనుకుంటే మరేదో జరిగినట్టు తయారయింది. హైదరాబాద్ లో ఆరేళ్ల చిన్నారి హత్యాచారం కేసులో వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల తన ప్రభావం చూపెట్టుకోవాలని సంకల్పించింది. కానీ వ్యూహం బెడిసికొట్టింది. రాజకీయం చేయడమంటే అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవడం కాదు. దాని వల్ల ఒనగూడే ప్రయోజనాలు లెక్కలోకి తీసుకోవాలి. అలా కాకుండా అనుకున్నదే తడవుగా చిన్నపిల్లలు చేసినట్లు చేయడంతో మొదటికే మోసం వచ్చింది. అందరిలో అభాసుపాలయ్యారు.

    షర్మిలకు తెలంగాణలో పెద్దగా నాయకులు లేరు. ఆమె ఎక్కడికి వెళ్లినా పది సంఖ్యలో మాత్రమే జనం కనబడతారు. దీంతో ఆమె తన అనుచరులను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. బుధవారం హైదరాబాద్ లో దీక్ష చేసిన షర్మిల వెంట తక్కువ మందే ఉన్నారు. పైగా వారు ఎప్పుడు వెళ్లిపోతామనే ఆతృతతోనే ఉన్నట్లు కనిపించింది. ఈ నేపథ్యంలో బాధితురాలి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేసినా ఎవరు పట్టించుకున్న దాఖలాలు కనిపించ లేదు. దీంతో ఆమె దీక్ష కాస్త అపహాస్యం అయిందని తెలుస్తోంది.

    ఆమెకు ఎవరు సలహా ఇచ్చారో తెలియదు కానీ తప్పుడు దారిలో వెళ్లినట్లు కనిపించింది. వ్యూహాన్ని అమలు చేయడంలో ఆమె వెనుకబడిపోయినట్లు అనిపించింది. అందుకే దీక్షలో ఫెయిల్ అయ్యారు. ఆమె చేసిన ఏ డిమాండ్ కూడా ఫలితం చూపించలేదు. బాలిక కుటుంబాన్ని ఆదుకోవాలని, నష్టపరిహారం అందజేయాలని సూచించినా ప్రభుత్వం నుంచి పెద్దగా స్పందన రాలేదు. దీంతో ఆమె కులం చెడినా ఫలితం దక్కకపోవడం వంటి సామెతలా మారింది.

    బాలిక వ్యవహారాన్ని రాజకీయం చేయాలని భావించినా సఫలం కాలేదు. రాజకీయాల్లో చాంపియన్ కావాలని కలలు కన్న నెరవేరలేదు. తెలంగాణ రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టించాలని అనుకున్నా సాధ్యం కాలేదని తెలుస్తోంది. చిన్నారి హత్యతో రాజకీయ మైలేజీ సాధించాలని చూసినా ఫలితం మాత్రం దక్కలేదు. దీంతో ఆమె నైరాశ్యంల పడిపోయారు. షర్మిల అందరిలా కాకుండా ప్రత్యేకంగా ఉండాలని అనుకున్నా సాధ్యం కాకపోవడంతో నవ్వుల పాలయినట్లు తెలుస్తోంది. మొత్తానికి కులం చెడినా ఫలితం మాత్రం దక్కలేదని పార్టీ నేతలు ప్రకటించడం కొసమెరుపు.