YS Sharmila: రాజన్న రాజ్యం తెస్తామని ప్రకటించిన వైఎస్ షర్మిల ఆ దిశగా అడుగులు వేస్తోంది. తన హామీల అమలుకు కృషి చేస్తానని చెబుతోంది. ఇందులో భాగంగా ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర చేపట్టారు. ఈ మేరకు ఆదివారం పాదయాత్ర చండూరు క్రాస్ రోడ్డు నుంచి రావిగూడెం వరకు కొనసాగింది. దారి పొడవునా షర్మిల ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధాన సమస్యలపై తనదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు.

కేసీఆర్ చేపడుతున్న పథకాలతో ప్రజలకు మేలు జరగకపోగా కీడే జరుగుతుందని వాపోయారు. చేనేత కార్మికులకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. చేనేత కార్మికులకు ఆరోగ్య బీమాతో పాటు జీవితబీమా ఉచితంగా అందజేస్తామన్నారు. దీని కోసం వారి కోసం వరాలు కురిపించారు. చేనేత కార్మికులకు జాతీయ స్థాయి హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేస్తామన్నారు.
సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి వైఎస్సార్ పెద్దపీట వేస్తే కేసీఆర్ మాత్రం అమ్యామ్యాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏడేళ్లలో కేసీఆర్ చేనేత కార్మికులకు చేసిందేమిటి అని ప్రశ్నించారు. చెండూరుకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేస్తామన్నారు. కేసీఆర్ వన్ని అబద్దాలే అని అన్నారు. ఎస్సీ, ఎస్టీలకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పి తాను అనలేదని విమర్శించారు.
Also Read: KCR vs BJP: ఏకుమేకవుతున్న బీజేపీ.. కేసీఆర్ లో అందుకేనా ఫస్ట్రేషన్?
ఆర్టీసీ కార్మికులు, ఫీల్డ్ అసిస్టెంట్లను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ప్రభుత్వ విధానాలతో అందరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ కు ప్రత్యామ్నాయం కావాలని సూచించారు. ప్రజల బాధలు తీర్చే వారిని ఎన్నుకునేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు. రాష్ర్టంలో ప్రత్యక్షంగా కేసీఆర్ పాలనతోనే ప్రజలు విసుగు చెందుతున్నారని వాపోయారు.
Also Read: jagan and kcr:కేంద్రంపై తెలుగు రాష్ట్రాల సీఎంల తిరుగుబాటు: ఇక యుద్ధమేనా..?