https://oktelugu.com/

ఉన్నట్టుండి జగన్‌కు అమరావతిపై ప్రేమెందుకు పుట్టుకొచ్చినట్లు..?

అమరావతిని రాజధాని వద్దన్న జగన్‌ సర్కార్‌‌ ఇప్పుడు ఉన్నట్టుండి అమరావతిపై ప్రేమను చూపిస్తున్నారు. ఎందుకో ఉన్నట్టుండి అమరావతి విషయంలో ప్రభుత్వం ఒక్కసారిగా చలనం మొదలైంది. నిర్మాణాలన్నీ ఆగిపోయాయని ఇప్పుడే తెలిసినట్లుగా హడావుడి ప్రకటన చేసేస్తున్నారు. అంతేకాదు.. ఆ నిర్మాణాలను పూర్తి చేయడానికి అత్యవసరంగా నిధులు అవసరం కాబట్టి రుణాలు తీసుకునేందుకు బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలని నిర్ణయించారు. శరవేగంగా నిర్మాణాలను పూర్తి చేయాలని నిర్ణయించింది. Also Read: ఏపీ సీఎం జగన్ ఉగాది కానుక ఒకప్పుడు 24 గంటలూ […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 24, 2021 / 01:54 PM IST
    Follow us on


    అమరావతిని రాజధాని వద్దన్న జగన్‌ సర్కార్‌‌ ఇప్పుడు ఉన్నట్టుండి అమరావతిపై ప్రేమను చూపిస్తున్నారు. ఎందుకో ఉన్నట్టుండి అమరావతి విషయంలో ప్రభుత్వం ఒక్కసారిగా చలనం మొదలైంది. నిర్మాణాలన్నీ ఆగిపోయాయని ఇప్పుడే తెలిసినట్లుగా హడావుడి ప్రకటన చేసేస్తున్నారు. అంతేకాదు.. ఆ నిర్మాణాలను పూర్తి చేయడానికి అత్యవసరంగా నిధులు అవసరం కాబట్టి రుణాలు తీసుకునేందుకు బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలని నిర్ణయించారు. శరవేగంగా నిర్మాణాలను పూర్తి చేయాలని నిర్ణయించింది.

    Also Read: ఏపీ సీఎం జగన్ ఉగాది కానుక

    ఒకప్పుడు 24 గంటలూ అన్నట్టుగా అమరావతిలో డెవలప్‌మెంట్‌ వర్క్స్‌ జరిగాయి. వాటికి బ్రేక్‌ వేసింది జగన్‌ సర్కార్‌‌. అమరావతి ప్రాంతాన్ని పూర్తిగా నిర్మానుష్యం చేసింది ఈ సర్కార్‌‌. ఒక్కటంటే ఒక్క పనినీ జరగనీయలేదు. ఆ దశలో పనులు ఆపితే.. వందల కోట్ల నష్టం వస్తుందని తెలిసినా .. డోంట్ కేర్ అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇటుక కూడా పెట్టనీయలేదు. మధ్యలో అమరావతిపై అనేకానేక నిందలు వేశారు. ఎడారి అన్నారు.. శ్మశానం అని కూడా వాడేశారు. అయితే.. ఇప్పుడు వాటిలో నిర్మాణాలు పూర్తి చేయాలనుకోవడం ఏంటో ఎవరికీ అంతుబట్టడం లేదు.

    ఈ కట్టడాలను పూర్తిచేసేందుకు ప్రభుత్వం నిధులు సమీకరిస్తుందని ఎవరూ అనుకోవడం లేదు. అసలు ఆ ప్రకటనను ఎవరూ నమ్మడం లేదు. దీనికి కారణం ప్రభుత్వ వైఖరే. వచ్చే నెల పదో తేదీ వరకూ ఈ హడావుడి ఉంటుందని ఆ తర్వాత మళ్లీ అమరావతి అనే మాటే ఎత్తరని అంటున్నారు. మున్సిపల్ ఎన్నికలు వచ్చే నెల పదో తేదీన జరగనున్నాయి. గుంటూరు, విజయవాడ కార్పొరేషన్లతో పాటు చుట్టుపక్కల మున్సిపాలిటీలన్నింటినీ గెల్చుకోవాలంటే అమరావతి విషయంలో సానుకూలంగా ఉన్నామన్న ఓ భావన ప్రజల్లోకి పంపించేందుకే ఈ ప్రకటనలు చేశారని అంటున్నారు. ఇదో ఎన్నికల జిమ్మిక్కుగా భావిస్తున్నారు.

    Also Read: డిబేట్ లో బీజేపీ నేతపై చెప్పుతో దాడి..లైవ్ కట్..ఆ తరువాత ఏం జరిగిందంటే..?

    ప్రభుత్వ నిర్ణయాలను నమ్మకపోవడానికి మున్సిపల్ ఎన్నికలే కాదు.. మరికొన్ని కారణాలు సైతం ఉన్నాయి. మూడు వేల కోట్ల అప్పుకు బ్యాంక్ గ్యారంటీ ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. అసలు అంత అప్పు ఇప్పుడు ఏ బ్యాంకు ఇస్తుందనేది ధర్మ సందేహం. ప్రభుత్వానికి రుణపరపతి పూర్తిగా పడిపోయింది. అనేకాకనేక కార్పొరేషన్లు పెట్టి రుణాలు తీసుకుంటున్నారు. వాటన్నింటికీ ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తోంది. కానీ.. రుణాలివ్వడానికి బ్యాంకులు పెద్దగా ముందుకు రావడంలేదు. ఇప్పుడు అమరావతి విషయంలో ప్రభుత్వ వైఖరి తెలిసి కూడా రుణాలిస్తాయని ఎవరూ అనుకోవడంలేదు. మభ్య పెట్టే రాజకీయం కోసమే ప్రభుత్వం నిర్మాణాలు పూర్తి చేస్తామని చెబుతోందని నమ్ముతున్నారు. నిజానికి నిర్మాణాలు పూర్తి చేస్తామని చెప్పడం ఇదే మొదటి సారి కాదు. చాలా సార్లు ఈ తరహా ప్రకటనలు చేశారు. ఇప్పటికిప్పుడు నిర్మాణాలు ప్రారంభించాలంటే కూడా పాత కాంట్రాక్టర్లకు రూ.600 కోట్ల వరకూ బకాయిలు చెల్లించాల్సి ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో కొత్త నిర్మాణాలు ఎలా ప్రారంభిస్తారో ప్రభుత్వానికే తెలియాలి.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్