https://oktelugu.com/

Pensions: పింఛన్లలో కోతతో వైసీపీకి నష్టం జరుగుతుందా?

Pensions: ఆంధ్రప్రదేశ్ లో సామాజిక పింఛన్లలో కోత విధిస్తున్నారు. దీంతో లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. సంక్షేమ పథకాల అమలులో దూసుకుపోతున్న వైసీపీ ప్రజలకు నేరుగా నగదు బదిలీ చేయడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇటీవల ప్రభుత్వం పింఛన్ల లో కోత విధిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలు నిరాశలోనే కొట్టుమిట్టాడుతున్నారు. ఏపీలో నిధుల కొరత వేధిస్తోంది. దీంతో పింఛన్ల లబ్ధిదారులను తగ్గించేందుకే ప్రాధాన్యం ఇస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంపై సహజంగానే ఆగ్రహం పెరుగుతోంది. వైఎస్సార్ […]

Written By:
  • Srinivas
  • , Updated On : September 17, 2021 / 03:23 PM IST
    Follow us on

    Pensions: ఆంధ్రప్రదేశ్ లో సామాజిక పింఛన్లలో కోత విధిస్తున్నారు. దీంతో లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. సంక్షేమ పథకాల అమలులో దూసుకుపోతున్న వైసీపీ ప్రజలకు నేరుగా నగదు బదిలీ చేయడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇటీవల ప్రభుత్వం పింఛన్ల లో కోత విధిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలు నిరాశలోనే కొట్టుమిట్టాడుతున్నారు. ఏపీలో నిధుల కొరత వేధిస్తోంది. దీంతో పింఛన్ల లబ్ధిదారులను తగ్గించేందుకే ప్రాధాన్యం ఇస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంపై సహజంగానే ఆగ్రహం పెరుగుతోంది.

    వైఎస్సార్ హయాం నుంచే పింఛన్ల పంపిణీ జరుగుతోంది. కుటుంబంలో ఎంత మంది ఉంటే అంత మందికి పింఛన్లు ఇచ్చేవారు. ఇటీవల సడలించిన నిబంధనలతో కుటుంబంలో ఒక్కరికే పింఛన్ ఇచ్చేలా ఏర్పాట్లు చేసింది. దీంతో అందరిలో ఆందోళన పెరుగుతోంది. పింఛన్ల తొలగింపుపై మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం వద్దని వారిస్తున్నారు. ఇలా చేస్తే భవిష్యత్ లో కష్టాలు తప్పవని హెచ్చరికలు చేస్తున్న సీఎం జగన్ పట్టించుకోవడం లేదు.

    జగన్ అధికారంలోకి వచ్చాక ప్రతి ఏటా పింఛన్ పెంచుతామని హామీ ఇచ్చింది. కానీ ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా ఒక్కసారి మాత్రమే పెంచి చేతులు దులుపుకుంది. ఇప్పుడు ఉన్న వాటినే తీసేస్తోంది. దీంతో లబ్ధిదారుల్లో నిరాశే పెరుగుతోంది. అసెంబ్లీలో కూడా విపక్షాలు గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వ వైఖరిలో మార్పు రావడం లేదు. దీంతో వైసీపీ సర్కారుకు పింఛన్ల సమస్య పెద్ద తలనొప్పిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.

    కేబినెట్ భేటీలో పింఛన్ల తొలగింపుపై జగన్ స్పష్టత ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో పింఛన్లలో కోతలు తప్పవని సూచిస్తున్నారు. రాబోయే రోజుల్లో పార్టీకి ఇది పెద్ద గుదిబండగా మారే సూచనలున్నాయని పార్టీ నేతలు చెబుతున్నా పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందర కూడా సైలెంట్ అయిపోయారు. ఏది జరిగినా ఎదుర్కోవాలని సూచిస్తున్నారు. పింఛన్లలో కోతలు తప్పవని చెప్పేశారు.