https://oktelugu.com/

దిశ యాప్: జగన్ మరో సంచలనం

మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు తెస్తున్నా అగత్యాలు ఆగడం లేదు. ఎక్కడో ఓ చోట ఆకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. అమ్మాయిలు సమిధలు అయిపోతున్నారు. వారిపై జరిగే దురంతాలకు వరద కట్ట వేసేందుకు సంకల్పించారు. దీనికి ప్రభుత్వం తన వంతు సహకారం అందించేందుకు సిద్ధమైది. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల భద్రత కోసం దిశ యాప్ తీసుకొచ్చింది. దీంతో కలిగే మేలును ప్రతి ఇంటికి తెలియజేసే అవసరముందని సీఎం జగన్ పేర్కొన్నారు. ఇటీవల ప్రకాశం బ్యారేజీ వద్ద […]

Written By:
  • Srinivas
  • , Updated On : June 29, 2021 / 01:31 PM IST
    Follow us on

    మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు తెస్తున్నా అగత్యాలు ఆగడం లేదు. ఎక్కడో ఓ చోట ఆకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. అమ్మాయిలు సమిధలు అయిపోతున్నారు. వారిపై జరిగే దురంతాలకు వరద కట్ట వేసేందుకు సంకల్పించారు. దీనికి ప్రభుత్వం తన వంతు సహకారం అందించేందుకు సిద్ధమైది. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల భద్రత కోసం దిశ యాప్ తీసుకొచ్చింది. దీంతో కలిగే మేలును ప్రతి ఇంటికి తెలియజేసే అవసరముందని సీఎం జగన్ పేర్కొన్నారు.

    ఇటీవల ప్రకాశం బ్యారేజీ వద్ద జరిగిన ఘటన నేపపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం ఆహ్వానించదగినదే. విజయవాడ శివారు గొల్లపూడిలో మహిళా పోలీసులు, వలంటీర్లతో దిశ యాప్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. దిశ యాప్ ను ఎంత ఎక్కువగా డౌన్ లోడ్ చేయించగలిగితే అంతగా అక్కాచెల్లెళ్లకు ఇది తోడుగా ఉంటుందని చెప్పారు. ఈయాప్ దేశ వ్యాప్తంగా నాలుగు అవార్డులు సాధించింది.

    ఇప్పటికే 17 లక్షల డౌన్ లోడ్లు పెరిగాయని పేర్కొన్నారు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి యువతి దీన్ని డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు.రాష్ర్టంలో కనీసం కోటి మంది మహిళల మొబైళ్లలో దిశ యాప్ ఉండేలా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. మహిళలు తమ మొబైల్ లో దిశ యాప్ డౌన్ లోడ్ చేసుకుంటే అన్న తోడుగా ఉన్నట్లు ఉంటుందని తెలిపారు. అనుకోని ఆపద ఎదురైనప్పుడు యాప్ లోని ఎన్ వో ఎన్ బటన్ నొక్కితే నిమిషాల్లో పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుంటారని సూచించారు.

    యాప్ ద్వారా బాధితులు ఉన్న లొకేషన్ వివరాలు నేరుగా కంట్రోల్ రూం, పోలీస్ స్టేషన్ కు చేరేలా పటిష్టమైన కార్యాచరణ రూపొందించామని చెప్పారు. ఇప్పటికే పోలీస్ గస్తీ వాహనాలను పెంచామని పేర్కొన్నారు. దిశ యాప్ వాడకంపై మహిళల్లో అవగాహన కల్పించాల్సి ఉందన్నారు. మహిళా పోలీస్ సిబ్బంది, వలంటీర్లకు నిబంధనలపై సూచనలు చేశారు. అక్కా చెల్లెళ్ల కోసం తమ ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని వివరించారు.