YS Vivekananda murder Case: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే అరెస్టయిన నలుగురు నిందితులు ఇచ్చిన వాంగ్మూలంలో అనేక విషయాలు వెలుగు చూస్తున్నాయి. వైఎస్ కుటుంబీకుడైన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. హత్య కేసులో ప్రధాన నిందితుడైన దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంతో అందరి మెడకు ఈ కేసు చుట్టుకోనుంది.

వివేకా హత్య కేసులో దస్తగిరితో పాటు నలుగురికి ప్రత్యక్ష ప్రమేయం ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు రూ.40 కోట్లు చేతులు మారినట్లు తెలుస్తోంది. వివేకా హత్య కేసులో దస్తగిరి వాంగ్మూలం కలకలం సృష్టిస్తోంది. వివేకానందరెడ్డి 2019 మార్చి 15న పులివెందులలోని తన నివాసంల దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. దీంతో సీఐడీ పోలీసులు సుదీర్ఘ కాలం దర్యాప్తు చేపట్టినా ఏమీ తేలకపోవడంతో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించింది. దీంతో అప్పటి నుంచి కేసులో పురోగతి కనిపించింది.
ఈ కేసులో నలుగు నిందితులను చేర్చింది. అందులో దస్తగిరితోపాటు పొలం పనులు చూసే గజ్జల ఉమాశంకర్ రెడ్డి, ఉమా స్నేహితుడు సునీల్ యాదవ్, వివేకా మాజీ అనుచరుడు యర్ర గంగారెడ్డి ఉన్నట్లు తెలిసిందే. ఈ నేపథ్యంలో దస్తగిరి వాంగ్మూలతో కేసులో చలనం వచ్చింది. దర్యాప్తులో భాగంగా దస్తగిరి వాంగ్మూలం ఈ ఏడాది ఆగస్టు 31న నమోదు చేశారు. కానీ దానికి సంబంధించిన కాపీ ఇప్పుడు బహిర్గతమైంది. దీంతో కేసుకు సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.
నలుగురు నిందితులు వివేకాను అంతమొందించినట్లు తెలుస్తోంది. హత్యకు ముందు రోజు రాత్రి 11.40కి వివేకా ఇంటికి చేరుకున్నాడు. అదే సమయంలో నలుగురు నిందితులు మద్యం సేవించి ఉన్నారు. రాత్రి 1.30 సమయంలో వివేకాను హత్య చేసేందుకు ఉపక్రమించారు. మెల్లగా ఇంట్లోకి ప్రవేశించారు. దీంతో వివేకా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారని ప్రశ్నించగా బెంగుళూరు సెటిల్మెంట్ డబ్బుల కోసం వచ్చారని సమాధానం చెప్పారు.
దీంతో వివేకా వారి మధ్య వాగ్వాదం నడుస్తుండగానే సునీల్ యాదవ్ వివేకాపై పిడిగుద్దులు కురిపించాడు. దీంతో వివేకా పక్కకు పడిపోవడంతో ఉమాశంకర్ రెడ్డి గొడ్డలితో తలపై గాయపరిచాడు. దీంతో కొనఊపిరితో ఉన్న వివేకా తల నుంచి రక్తం కారడంతో సునీల్ యాదవ్ చాతీపై ఏడెనిమిది సార్లు కొట్టడంతో వివేకాను బాత్ రూంలోకి తీసుకెళ్లి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. బలవంతంగా ఒక ఉత్తరం రాయించుకుని సంతకం చేయించుకుని తలపై నరికారు. దీంతో వివేకా ప్రాణాలు విడిచినట్లు తెలిపారు.
వివేకా హత్య కేసుకు భూ వివాదాలే కారణమని దస్తగిరి చెప్పడం కొసమెరుపు. బెంగుళూరులో వివేకాకు భూములున్నాయని వాటి సెటిల్మెంట్ లో భాగంగానే రూ. కోట్లు అందాల్సి ఉందని తెలుస్తోంది. వివేకా హత్య కేసులో ఆయన కుటుంబ సభ్యులే ప్రధాన నిందితులుగా ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ కేసులో ఇంకా ఎవరెవరు బాధ్యులుగా తేలుతారో వేచి చూడాల్సిందే.
Also Read: ప్రజల్లో పట్టు కోసం పవన్ కల్యాణ్ ప్రయత్నం
జగన్ సర్కార్ బిగ్ షాక్.. ఇండియన్ మెడికల్ డివైసెస్ రెడ్ నోటీసు