Liger: పెళ్లిచూపులు సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టి.. అర్జున్ రెడ్డి సినిమాతో సూపర్ హిట్ కొట్టిన హీరో విజయ్ దేవరకొండ.. సినీ పరిశ్రమలో ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా.. కష్టపడి స్టార్ హీరో స్థాయి గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్. ఆతర్వాత కూడా విభిన్న కథాంశంతో ఉన్న సినిమాలను ఎంచుకుంటూ.. ముందుకు దూసుకెళ్లిపోతున్నాడు. ప్రస్తుతం డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ విజయ్ హీరోగా ఓ సినిమా తరకెక్కుతోంది. ఈ సినిమాకు లైగర్ అనే టైటిల్ ప్రకటించారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్గా నటిస్తోంది.
Boys chilling in vegas before kick starting an intense schedule 💪🏻#LIGER @TheDeverakonda @PuriConnects pic.twitter.com/z7UfP0mjhp
— Charmme Kaur (@Charmmeofficial) November 13, 2021
తాజాగా, లైగర్ టీమ్ షూటింగ్ కోసం యూఎస్ వెళ్లిన సంగతితెలిసిందే. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ చేసేందుకు చూస్తున్నాడు పూరి జగన్నాథ్. కాగా, హీరో విజయ్ దేవరకొండతో కలిసి పూరి లాస్‌వెగాస్‌లో చిల్ అవుతున్న ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. పూరి విజ్ కలిసి ఓ క్యాసినోలో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు ఛార్మి పోస్ట్ చేసింది. కొత్త షెడ్యూల్ స్టార్‌కు ముందు అబ్బాయిలు చిల్ అవుతున్నారు అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న సినిమా లైగర్. యూఎస్ షెడ్యూల్లో అంతర్జాతీయ బాక్సర్ మైక్ టైసన్ పాల్గొననున్నారు. ఈ ఎపిసోడ్లు సినిమాకు ప్రధాన హైలెట్‌గా నిలుస్తాయని తెలుస్తోంది. పూరి, ఛార్మి, కరణ్ జోహార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.