https://oktelugu.com/

CM Jagan: వందల కోట్లు ఉన్న నిర్మాతకు ఆర్ధిక సాయం అవసరమా జగన్ ?

CM Jagan: ప్రముఖ సినీ నటుడు, నవరసాల నట చక్రవర్తి కైకాల సత్యనారాయణ గారు గత ఏడాది నవంబర్ లో అనారోగ్యం పాలై అపోలో హాస్పిటల్ లో చేరి చికిత్స తీసుకున్నారు. ప్రస్తుతం కైకాల గారి ఆరోగ్య పరిస్థితి పూర్తి స్థాయిలో మెరుగుపడింది. అయితే, తాజాగా ఈ దిగ్గజ నటుడు జగన్ పై తన అభిమానాన్ని ఘనంగా చాటుకున్నాడు. తన అనారోగ్య సమయంలో సహాయం అందించిన జగన్‌ కి కైకాల ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ.. ఓ లేఖ […]

Written By:
  • Shiva
  • , Updated On : January 20, 2022 / 02:17 PM IST
    Follow us on

    CM Jagan: ప్రముఖ సినీ నటుడు, నవరసాల నట చక్రవర్తి కైకాల సత్యనారాయణ గారు గత ఏడాది నవంబర్ లో అనారోగ్యం పాలై అపోలో హాస్పిటల్ లో చేరి చికిత్స తీసుకున్నారు. ప్రస్తుతం కైకాల గారి ఆరోగ్య పరిస్థితి పూర్తి స్థాయిలో మెరుగుపడింది. అయితే, తాజాగా ఈ దిగ్గజ నటుడు జగన్ పై తన అభిమానాన్ని ఘనంగా చాటుకున్నాడు. తన అనారోగ్య సమయంలో సహాయం అందించిన జగన్‌ కి కైకాల ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ.. ఓ లేఖ రాశారు.

    CM Jagan:

     

    ఇంతకీ ఈ నవరసాల నట చక్రవర్తి లేఖలో ఏమి రాశాడు అంటే.. ‘ఎంతో బిజీ షెడ్యూల్‌లో ఉన్నప్పటికీ జగన్ గారు నాకు వ్యక్తిగతంగా కాల్ చేశారు. నేను అడగకుండానే ఆయన ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం అందిస్తామని నాకు హామీ ఇచ్చారు. జగన్ గారు మీరు నా పై చూపిన శ్రద్ధ పట్ల నాకు చాలా సంతోషం కలిగింది. మీరు నాకు హామీ ఇచ్చినట్టుగానే మీ ఉన్నతాధికారులు నా దగ్గరకు వచ్చారు.

    Also Read: ప్చ్.. కరోనా బారిన పడిన మరో హీరోయిన్ !

    వాళ్ళు నా వైద్య ఖర్చులతో పాటు నాకు ఆర్థిక సహాయాన్ని అలాగే అన్ని రకాల సహాయాన్ని అందించారు. ఆ కష్ట సమయాల్లో మీ సహాయం నాకు, నా కుటుంబానికి అద్భుతమైన శక్తిని ఇచ్చిందని.. మీకు తెలియజేస్తున్నాను. జగన్ గారు మీరు చూపిన ఈ శ్రద్ధ మీకు కళాకారుల పట్ల, అలాగే వారి శ్రేయస్సు పట్ల ఉన్న గౌరవాన్ని తెలియజేస్తుంది. ప్రజల పట్ల మీకు ఉన్న శ్రద్ధ రాష్ట్రం మంచి చేతుల్లో ఉందనే భరోసాను ఇస్తుంది’ అంటూ కైకాల తన లేఖలో రాసుకొచ్చాడు.

    అంతా బాగానే ఉంది. దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణ గారికి జగన్ సాయం చేయడంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే, కైకాల సత్యనారాయణ కుమారుడు పెద్ద నిర్మాత, కేజీఎఫ్ లాంటి పాన్ ఇండియా సినిమాను తీసిన నిర్మాత. అలాంటి వందల కోట్లు ఉన్న నిర్మాతకు ఆర్ధిక సాయం చేయాల్సిన అవసరం ఏముంది ? ఆకలి అరుపులకు చనిపోతున్న ప్రజలు ఉన్న రాష్ట్రంలో జగన్ వాళ్ళను వదిలేసి.. ఏమి చేస్తున్నాడో తెలియకుండా చేసుకుంటూ పోతున్నాడు.

    Also Read:   ఆ రికార్డులో   తొలి తెలుగు చిత్రం  అఖండ మాత్రమే !   

    Tags