Adani vs Hindenburg : అదానీ వ్యవహారం మోడీ మెడకు చుట్టుకుంటుందా?

గౌతం అదానీ.. గత వారం రోజుల నుంచి ముఖ్యంగా నేషనల్ చానెల్స్ వేరే వార్తలు లేకుండా ఆయన వివాదాన్ని హైలెట్ చేస్తోంది. జనవరి 24 దాకా గౌతం అదానీ అనగానే ప్రపంచంలోనే 3వ అత్యంత ధనవంతుడు. రెండో రిచెస్ట్ పర్సన్ గా కూడా చేరువయ్యాడు. కానీ 24వ తేదీ తర్వాత అదానీ కథ మారిపోయింది. 100 మిలియన్ల డాలర్లు నష్టపోయి ఇప్పుడు 17వ స్థానానికి అదానీ పడిపోయాడు. జనవరి 24న గౌతం అదానీకి వ్యతిరేకంగా హిండెన్ బర్గ్ […]

Written By: NARESH, Updated On : February 7, 2023 5:08 pm
Follow us on

గౌతం అదానీ.. గత వారం రోజుల నుంచి ముఖ్యంగా నేషనల్ చానెల్స్ వేరే వార్తలు లేకుండా ఆయన వివాదాన్ని హైలెట్ చేస్తోంది. జనవరి 24 దాకా గౌతం అదానీ అనగానే ప్రపంచంలోనే 3వ అత్యంత ధనవంతుడు. రెండో రిచెస్ట్ పర్సన్ గా కూడా చేరువయ్యాడు. కానీ 24వ తేదీ తర్వాత అదానీ కథ మారిపోయింది. 100 మిలియన్ల డాలర్లు నష్టపోయి ఇప్పుడు 17వ స్థానానికి అదానీ పడిపోయాడు.

జనవరి 24న గౌతం అదానీకి వ్యతిరేకంగా హిండెన్ బర్గ్ రిపోర్టు వచ్చినా జనవరి 27న అదానీ ఎఫ్.టీఓకు వెళ్లారు. అది సబ్ స్క్రిప్షన్ అయితే అయ్యింది. బ్లడ్ బాత్ మాత్రం ఆగలేదు. ఇక గ్రూప్ ఏక కాల వృద్ది పై హిండెన్ బర్గ్ రెండు ఏళ్ళుగా తవ్వుతున్నది. ఇందుకోసం తీవ్రంగా శ్రమించింది. అర డజను కు పైగా దేశాలను సందర్శించింది. వేలాది డాక్యుమెంట్లను పరిశీలించింది. అదానీ గ్రూప్ మాజీ ఉద్యోగులతో మాట్లాడింది. నివేదిక రూపొందించింది. పన్ను ఎగవేత దారులకు స్వర్గ ధామాలకు ప్రసిద్ది చెందిన కరేబియన్ దీవులు, సైప్రస్, మారిషస్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాల్లో అదానీ గ్రూప్ ప్రమోటర్లు, వారి కుటుంబ సభ్యులకు ఉన్న షెల్ కంపెనీల జాడ కూడా బయట పడిందని హండెన్ బర్గ్ చెప్పడం విశేషం.

గౌతం అదానీ ఈ హిండెన్ బర్గ్ రిపోర్టును ఖండించాడు. ఇది మేం ఇచ్చిన రిపోర్ట్ అని.. కొత్తదనం ఏదీ లేదని ఖండించారు. అయితే స్టాక్ మార్కెట్ మాత్రం హిండెన్ బర్గ్ రిపోర్టునే నమ్మింది. దీంతో అదానీ సంపద ఒక్కసారిగా పడిపోయింది. ఆయన షేర్ల పతనం వేగంగా సాగింది. ఇండియన్ స్టాక్ మార్కెట్ సైతం కండీషన్లు పెట్టింది.

అయితే అదానీ ఎదుగుదలలో మోడీతోపాటు బీజేపీ సర్కార్ సహకారం ఎంతో ఉందన్న ఆరోపణలున్నాయి. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సో అదానీ వ్యవహారం మోడీ మెడకు చుట్టుకుంటుందా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియో చూడొచ్చు.