spot_img
Homeజాతీయ వార్తలువచ్చే ఎన్నికల్లో యోగికి చెక్‌ తప్పదా..?

వచ్చే ఎన్నికల్లో యోగికి చెక్‌ తప్పదా..?

Yogi Adityanath
‘కాయలు ఉన్న చెట్టుకే దెబ్బలు’ అన్నట్లు.. అధికారంలో ఉన్న వ్యక్తులపై, అధికారంలో ఉన్న పార్టీపై నిత్యం విమర్శలు వినిపిస్తూనే ఉంటాయి. అంతకుమించి ఏదో ఒక గాసిప్‌ వైరల్‌ అవుతూనే ఉంటుంది. అవి చివరకు అటు పార్టీకి.. ఇటు వ్యక్తికి డ్యామేజీ చేస్తుంటాయి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌కు కూడా అలాంటి సెగనే తాకుతున్నట్లు తెలుస్తోంది. ఒక్కొక్కటిగా ఆయనకు ముప్పు తీసుకొస్తున్నట్లు సమాచారం.

Also Read: పేదలపై గ్యాస్‌ బండ.. : సబ్సిడీకి కేంద్రం మంగళం

అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తర్‌‌ప్రదేశ్‌లో ఏ జెండా ఎగిరితే.. ఆ పార్టీనే ఢిల్లీ పీఠం కైవసం చేసుకుంటుందనేది సెంటిమెంట్‌. అందుకే అన్ని పార్టీలు ఉత్తర్ ప్రదేశ్ పైనే ఎక్కువ దృష్టి పెడతాయి. అది అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు. కానీ పార్లమెంటు ఎన్నికలు కావచ్చు దేశం దృష్టి మొత్తం ఉత్తర్ ప్రదేశ్ పైనే ఉంటుంది. ఈ రాష్ట్రంలో 75 జిల్లాలున్నాయి. 80 పార్లమెంటు స్థానాలున్నాయి. 403 అసెంబ్లీ స్థానాలున్న ఈ రాష్ట్రంలో ఇప్పుడు హాట్ టాపిక్ రాష్ట్ర విభజన. అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా విడగొడతారని పెద్దయెత్తున ప్రచారం జరుగుతోంది.

చిన్న రాష్ట్రాలకు బీజేపీకి ఎలాగూ అనుకూలమే.. కాబట్టి వచ్చే ఎన్నికలకంటే ముందు ఉత్తర్‌‌ప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా విడగొట్టాలని బీజేపీ భావిస్తోందని చెబుతున్నారు. గతంలోనూ మాయావతి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రతిపాదన వచ్చింది. 2011లో మాయావతి తాను అధికారంలో ఉన్నప్పుడే ఈ ప్రతిపాదనను తెచ్చినట్లు బీజేపీ నేతలు గుర్తించారు. అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్‌గా విడగొట్టారు. 2000 సంవత్సరంలో వాజపేయి హయాంలో ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పడింది. ఇప్పుడు మరోసారి బుందేల్ ఖండ్, పూర్వాంచల్, అవద్ ప్రదేశ్, హరిత ప్రదేశ్‌గా నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది.

Also Read: చంద్రబాబుకు షాకిచ్చిన నిమ్మగడ్డ.. టీడీపీ మేనిఫెస్టోకు చెక్

నిజానికి బుందేల్ ఖండ్, పూర్వాంచల్ రాష్ట్రాల డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. అయితే ఉత్తర్‌‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ మాత్రం ఈ ప్రచారాన్ని కొట్టిపారేస్తున్నారు. రాష్ట్ర విభజన జరగదని, ఉత్తర్‌‌ప్రదేశ్ చరిత్రను తాము తొలగించేది లేదని ఆయన చెబుతున్నారు. అయితే ఎన్నికల వేళ మాత్రం ఈ ప్రచారం అధికార బీజేపీని ఇబ్బంది పెట్టే అవకాశాలున్నాయి. మరో రెండేళ్లలో ఈ రాష్ట్రానికి అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. మరి ఎన్నికల సమయం నాటికి ఏం జరగబోతోందో చూడాలి.

మరిన్ని జాతీయం రాజకీయ వార్తల కోసం జాతీయం పాలిటిక్స్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసలపై సువేందు ఉక్కుపాదం..

Suvendu Adhikari:   గత 45 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడం, వారికి ఓటు హక్కు, గుర్తింపు పత్రాలు ఇవ్వడం వంటి విధానాలు అమలులో ఉన్నాయని వివరణలు ఉన్నాయి. ఈ...

NTR: కీలక నిర్ణయం దిశగా జూనియర్ ఎన్టీఆర్!

NTR: తెలుగుదేశంలో చంద్రబాబు తర్వాతే ఎవరూ అంటే మాత్రం చటుక్కున లోకేష్ పేరు వస్తుంది. ప్రస్తుతం ఆయన అనధికార అధినేత తెలుగుదేశం పార్టీకి. పైగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో అన్ని తానై...

Tammineeni Seetharam: ఏపీలో మారిన అరెస్టుల స్టైల్!

Tammineeni Seetharam: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు అరెస్టు భయం వెంటాడుతోంది. ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం కేసుల రూపంలో వెంటాడింది. కానీ కొందరు తమ వ్యవహార శైలితో ఏరి కోరి కేసులు తెచ్చుకున్నారు....

Ram Gopal Varma: ఆ హీరోను చంపేస్తా…ఆర్జీవీ కి చెప్పిన ఫ్యాక్షనిస్టు…వైరల్ వీడియో…

Ram Gopal Varma: 'శివ' సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ దశాదిశా మార్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ...అప్పటి వరకు తెలుగు సినిమాలు అంటే ఒక మూస ధోరణి కథలతో సాగేవిగా ఉండేవి...కానీ...

YSRCP: వైసీపీలో కాపు నేతల తిరుగుబాటు!

YSRCP: కాపు అస్త్రంతో కూటమిని చీల్చాలని జగన్మోహన్ రెడ్డి భావించారు. ఇప్పుడు అదే కాపు అస్త్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గుచ్చుకోబోతోంది. కూటమిని ఇరకాటంలో పెట్టేందుకు, కాపు ఓటు బ్యాంకు ను ఆకట్టుకోవడానికి...
Oktelugu Epaper
Exit mobile version