Homeజాతీయ వార్తలుఅదే జరిగితే కాబోయే ప్రధాని యోగినా?

అదే జరిగితే కాబోయే ప్రధాని యోగినా?

yogi adityanathరాజకీయాలకు ఉత్తరప్రదేశ్ గుండెకాయలాంటిది. ఎందుకంటే దేశంలో అత్యధిక లోక్ సభ స్థానాలున్న రాష్ర్టంగా వినతికెక్కింది. ఏ పార్టీ అయినా ఇక్కడే తన ప్రభావాన్ని చూపాలని భావిస్తోంది. ప్రస్తుతం ఇక్కడ రాజకీయ పరిణామాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఒక వైపు సెకండ్ వేవ్ ప్రభావం చూపుతుండగా మరో వైపు మూడో దశపై జనం భయపడుతున్నారు. మరోవైపు కరోనా వ్యాక్సిన్ల పంపిణీ మందకొడిగా సాగుతోంది.

వ్యాక్సిన్ల బాధ్యత పూర్తిగా కేంద్రమే తీసుకుంటోంది. దేశంలో అవసరాలకు తగినట్లుగా వ్యాక్సిన్ల సరఫరా అవుతాయనేది ప్రశ్నార్థకమే. వ్యాక్సినేషన్ పూర్తి చేయకపోతే కరోనా మూడో దశ కూడా విజృంభించే అవకాశాలున్నాయి. యూపీ మీద బీజేపీ, ఆర్ఎస్ఎస్ దృష్టి సారించాయి కరోనా కూడా యూపీలో ఎలా గెలవాలనే అంశంపై సంఘ్ పరివార్ కసరత్తు చేస్తోంది. యూపీలో బీజేపీ ఓడిపోతే జాతీయ స్థాయిలో కూడా ఆ పార్టీకి కౌంట్ డౌన్ మొదలవతుందని చెప్పకతప్పదు.

2014 లోక్ సభ,2017 అసెంబ్లీ, 2019 లోక్ సభ ఎన్నికల్లో సాధించిన తరహా విజయాలు బీజేపీ రిపీట్ చేయాల్సి ఉంది. అప్పుడే బీజేపీ వేవ్ గట్టిగా ఉందని అనుకుంటారు. యూపీలో పడితే బీజేపీపై రాజకీయ ధిక్కార స్వరాలు వినిపించే అవకాశాలు పెరుగుతాయి. ఈ నేపథ్యంలో యూపీ కమలం పార్టీకి ప్రతిష్టాత్మక అంశంగా మారుతోంది. యోగి ప్రభుత్వ పనితీరుపై కమలం పార్టీ సమీక్షించుకోవడం అప్పుడే మొదలైంది. యోగిని దించి సీఎం పీఠంపై వేరేవారిని కూర్చోబెట్టాలనే ప్రచారాలు జరిగాయి. అయితే యోగి మాత్రం నన్నెవరు దించలేరని ప్రకటించుకున్నారు.

రాబోయే ఎన్నికల్లో బీజేపీ సంచలన విజయం నమోదు చేస్తే యోగీ తదుపరి అడుగులు ఢిల్లీ వైపు పడే అవకాశాలున్నాయనే ప్రచారం కూడా ఉత్తరాది మీడియాలోనే జరుగుతూ ఉంది. దేశంలోనే అత్యధిక లోక్ సభ సీట్లున్న రాష్ర్టంలో స్వీప్ చేయగలిగితే బీజేపీలో యోగి ఆదిత్యనాథ్ ఇమేజ్ పతాక స్థాయికి చేరే అవకాశాలున్నాయి. బీజేపీలో హిందూత్వవాదుల్లోని కొందరు కూడా మోడీ కన్నా యోగిని ప్రధానిగా చేయాలనే వారు ఉన్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version