Yogi Adityanath: ఉత్తర ప్రదేశ్.. యోగి ఆదిత్యనాథ్ పరిపాలిస్తున్న రాష్ట్రం. గత ఏడు సంవత్సరాలుగా అతడి చేతిలో ఉన్న రాష్ట్రం. రౌడీ షీటర్లను, అల్లరి మూకలను ఎక్కడికక్కడ మట్టు పెట్టేలా చేస్తున్నాడు. శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాడు. అలాంటి యోగి ఆధ్వర్యంలోనే అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరుగుతోంది. అటువంటి యోగి ఏలుతున్న రాష్ట్రంలో, హిందూత్వకు ప్రతీకగా అతడు పరిపాలిస్తున్న రాష్ట్రంలో రామాలయాన్ని భక్తులు సందర్శించడం లేదు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 37 సంవత్సరాల నుంచి ఆ రామాలయానికి వారు దూరంగా ఉన్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది ముమ్మాటికి నిజం.
ఉత్తరాది ప్రాంతంలో ఉత్తర ప్రదేశ్ అనేక ఆలయాలకు ప్రసిద్ధి. చారిత్రక ప్రాశస్త్యం ఉన్న గంగానది ఈ రాష్ట్రంలో ఎక్కువగా ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నది ఒడ్డున అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ప్రసిద్ధి చెందిన వారణాసి, కాశీ, పలుశైవక్షేత్రాలు, వైష్ణవ క్షేత్రాలు కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి. అయితే లంకాధిపతి రావణుడు అత్తమామలు ఉత్తర ప్రదేశ్ లోని మేరట్ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని పరిపాలన సాగించారు. ఈ ప్రాంతం రావణుడి అత్తమామల నగరంగా ప్రసిద్ధి చెందింది. ఈ నగరంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగుల కాలనీలో 1962లో ఒక రామాలయాన్ని నిర్మించారు. సీతారాములు మాత్రమే కాకుండా కృష్ణుడు, శివలింగాలను కూడా అందులో ప్రతిష్టించారు. దాదాపు 25 సంవత్సరాల పాటు ఆ గుడి భక్తుల రాకతో సందడిగా ఉండేది.
1987లో ఈ ప్రాంతంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఒక వర్గం ఈ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయింది. కొన్నాళ్లు గడిచిన తర్వాత ఇక్కడ ఒక ఆలయం ఉందనే విషయాన్ని నగరవాసులు పూర్తిగా మర్చిపోయారు. ఆ గుడికి వెళ్లడం పూర్తిగా మానేశారు. ఫలితంగా భక్తులు వెళ్ళని రామాలయంగా ఆ కోవెలగా వినతికెక్కింది. 1989లో ఇక్కడికి వచ్చి స్థిరపడిన ఒక పూజారి మాత్రం నిత్యం పూజలు చేసేవారు. 2014లో అతడు చనిపోయిన తర్వాత, అతడి కుమారుడు ఆచార్య బాల గోవిందు జోషి పూజలు నిర్వహిస్తున్నారు. అయితే ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా, రాముడంటే విపరీతమైన భక్తి ఉన్న వ్యక్తిగా యోగి పాలిస్తున్న రాష్ట్రంలో రాముడి కోవెలను భక్తులు సందర్శించకపోవడం ఒకింత ఆశ్చర్యకరమే.