https://oktelugu.com/

శివకుమార్ రాకతో యడ్డ్యూరప్పకు ముళ్లబాట!

ఒక వంక పార్టీ ప్రధాన కార్యదర్శి జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటు చేయడంతో మధ్య ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్ధకరమైన సమయంలోనే హడావుడిగా కర్ణాటకలో పార్టీ అధ్యక్షుడిగా కాంగ్రెస్‌లో ట్రబుల్‌ షూటర్‌గా పేరొందిన డీకే శివకుమార్‌ను ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నియమించారు లోక్ సభ ఎన్నికలలో పార్టీ పరాజయానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిన దినేష్ గుండూరావు స్థానంలో ఈ నియామకం జరిపారు. ఈ నిర్ణయం చాలా ముందుగానే జరిగినా అందుకు మాజీ ముఖ్యమంత్రి […]

Written By:
  • Neelambaram
  • , Updated On : March 12, 2020 / 03:27 PM IST
    Follow us on

    ఒక వంక పార్టీ ప్రధాన కార్యదర్శి జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటు చేయడంతో మధ్య ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్ధకరమైన సమయంలోనే హడావుడిగా కర్ణాటకలో పార్టీ అధ్యక్షుడిగా కాంగ్రెస్‌లో ట్రబుల్‌ షూటర్‌గా పేరొందిన డీకే శివకుమార్‌ను ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నియమించారు

    లోక్ సభ ఎన్నికలలో పార్టీ పరాజయానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిన దినేష్ గుండూరావు స్థానంలో ఈ నియామకం జరిపారు. ఈ నిర్ణయం చాలా ముందుగానే జరిగినా అందుకు మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉండడంతో నియామకంలో జాప్యం జరిగిన్నట్లు చెబుతున్నారు.

    శివకుమార్ ను నియమిస్తే కాంగ్రెస్ నుండి వైదొలిగి, మరో ప్రాంతీయ పార్టీ పెడతానని అంటూ సిద్ధారామాయ్య దిక్కారధోరణి ప్రదర్శించారు. అయితే ఇప్పుడు ఆయనను లెక్క చేయకుండా శివకుమార్ ను నియమించడం గమనార్హం. కానీ, పార్టీ శాసనసభ పక్ష నేతగా సిద్దరామయ్య చేసిన రాజీనామాను ఆమోదించకుండా, ఆయనను అదే పదవిలో కొనసాగించారు.

    మొదటి నుండి, తనకు కాకుండా కాంగ్రెస్ లో మరే నాయకుడు ఎదగడాన్ని సిద్దరామయ్య సహింపలేక పోతున్నారు. పైగా తాను ఎవ్వరిని ముఖ్యమంత్రిగా చేయడాన్ని తట్టుకోలేక జేడీఎస్ నుండి బైటకు వచ్చి, కాంగ్రెస్ లో చేరి ముఖ్యమంత్రి కాగలిగానే, అదే సిద్దరామయ్యను కాంగ్రెస్ మద్దతుతో ముఖ్యమంత్రిగా చేయడాన్ని తట్టుకోలేక పోయారు.

    అందుకనే, సిద్దరామయ్య మద్దతుదారులు తిరుగుబాటు చేయడంతోనే కాంగ్రెస్ – జేడీఎస్ ప్రభుత్వం కూలిపోయి, తిరిగి బీజేపీ అధికారంలోకి రాగలిగింది. ఒక విధంగా సిద్దరామయ్య కారణంగానే ఇప్పుడు యడ్డ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉండగలుగుతున్నారు. అటువంటిది బిజెపి ప్రలోభాలకు తగ్గుకొని సంకీర్ణ ప్రభుత్వం సంవత్సరంకు పైగా కొనసాగేటట్లు చేయడంలో కీలక పాత్ర వహించిన శివకుమార్ కు కాంగ్రెస్ నాయకత్వం అప్పజెప్పడం యడ్డియూరప్ప ముందున్నది ముళ్లబాటే అన్న సంకేతాన్ని ఇస్తున్నది.

    శివకుమార్ కు పార్టీ నాయకత్వం దక్కనీయకుండా చేయడం కోసం సిద్దరామయ్య ద్వారా యడ్డ్యూరప్ప కూడా విశేషంగా ప్రయత్నం చేసిన్నట్లు తెలుస్తున్నది. సిద్దరామయ్య ఏది అడిగినా ప్రభుత్వం వెంటనే చేస్తూ ఉండడం, ఆయన నియోజకవర్గానికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయడం గమనిస్తే వారిద్దరి మధ్య మంచి అనుబంధం నెలకొన్నట్లు అర్ధం అవుతుంది.

    గత మూడేళ్ళుగా ఐటి, ఈడీ శాఖల అధికారులు ఎన్నో సార్లు శివకుమార్, ఆయన సన్నిహితులపై దాడులు జరిపారు. ఆయనను అరెస్ట్ కూడా చేసి జైలులో ఉంచారు. అయినా బిజెపి నుండి వస్తున్న వత్తిడులకు లొంగడం లేదు. యడ్డ్యూరప్ప ముఖ్యమంత్రి పదవిలో కొనసాగడం బీజేపీలోని బలమైన వర్గాలకే ఇష్టం లేదు. అటువంటి పరిస్థితులలో రెండు వైపులా వత్తిడులు ఎదుర్కోవలసిన పరిస్థితి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వానికి ఏర్పడింది.