YCP: వైసీపీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా మరో 27 మంది అభ్యర్థులను మార్చుతూ రెండో జాబితా విడుదల చేసింది. కొందరు ఎమ్మెల్యేలతో పాటు మంత్రులకు సైతం మొండి చేయి చూపింది. ఎంపీలను ఎమ్మెల్యేలుగా..ఎమ్మెల్యేలను ఎంపీలుగా మార్చింది.ఇక మంత్రి గుడివాడ అమర్నాథ్ కు గాలిలోనే ఉంచడం విశేషం. తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఇద్దరు మంత్రులకు వేరే స్థానాలు కేటాయించారు. నలుగురు ఎంపీలను ఎమ్మెల్యే అభ్యర్థులుగా మార్చారు. మొన్నటికి మొన్న 11 మంది అభ్యర్థులను మార్చగా, తాజాగా 27 మందితో మార్పు జాబితాలో మొత్తం 38 మంది చేరడం విశేషం. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుండడంతో.. తమకు టిక్కెట్ వస్తుందా? రాదా? అన్న ఆందోళనలో కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
రాజాం ఎస్సీ నియోజకవర్గానికి డాక్టర్ తలే రాజేశ్ ను సమన్వయకర్తగా నియమించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కంబాల జోగులను అనకాపల్లి జిల్లా పాయకరావుపేటకు బదిలీ చేశారు. అనకాపల్లిలో గుడివాడ అమర్నాథ్ స్థానంలో మలసాల భరత్ కుమార్ ను నియమించారు. పాయకరావుపేట ఎస్సీ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్ల బాబురావును తప్పించారు. ఆయనకు రాజ్యసభ స్థానాన్ని కల్పిస్తారని ప్రచారం జరుగుతోంది. రామచంద్రపురం నుంచి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అవుట్ అయ్యారు. ఆయన స్థానంలో పిల్లి సూర్యప్రకాశ్ ను నిర్మించారు. ఈ గన్నవరం నియోజకవర్గానికి విప్పర్తి వేణుగోపాల్ ను నియమించారు.
పిఠాపురానికి వంగా గీత, జగ్గంపేటకు తోట నరసింహం, ప్రత్తిపాడుకు పరుపుల సుబ్బారావు, రాజమండ్రి సిటీకి మార్గాని భరత్, రాజమండ్రి రూరల్ కు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పోలవరం ఎస్టి నియోజకవర్గానికి తెల్లం రాజ్యలక్ష్మి, కదిరికి బిఎస్ మక్సుల్ అహ్మద్, ఎర్రగొండపాలెం ఎస్సీ నియోజకవర్గానికి తాటిపర్తి చంద్రశేఖర్, ఎమ్మిగనూరుకు మాదాని వెంకటేష్, తిరుపతికి భూమన అభినయ రెడ్డి, గుంటూరు తూర్పు నియోజకవర్గం షేక్ నూరి ఫాతిమా, మచిలీపట్నానికి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు), చంద్రగిరికి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, పెనుకొండకు కేవీ ఉషశ్రీ చరణ్, కళ్యాణదుర్గానికి తలారి రంగయ్య, అరకు ఎస్టీ నియోజకవర్గానికి గొడ్డేటి మాధవి, పాడేరు ఎస్టీ నియోజకవర్గానికి మత్స్యరాస విశ్వేశ్వరరావు, విజయవాడ సెంట్రల్ కు వెల్లంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం షేక్ ఆసిఫ్ లను నియమిస్తూ వైసిపి హై కమాండ్ నిర్ణయం తీసుకుంది.
* అనంతపురం పార్లమెంట్ స్థానానికి మాల గుండ్ల శంకర్ నారాయణ, హిందూపురం లోక్ సభ స్థానానికి జూలద రాసి శాంత, అరకు ఎస్టీ నియోజకవర్గానికి కుట్టిగుల్లి భాగ్యలక్ష్మి ని నియమించారు.