https://oktelugu.com/

TDP vs YCP: ఎన్టీఆర్ ను వాడుకొని చంద్రబాబు-లోకేష్ పై వైసీపీ దాడి?

TDP vs YCP:  ప్రతిదాన్ని సాంతం వాడుకొని మీడియాతో ప్రత్యర్థులను చెడుగుడు ఆడడంలో టీడీపీ అధినేత చంద్రబాబు మించిన రాజకీయ చాణక్యుడు లేడు. బలమైన మీడియా చంద్రబాబు చేతిలో ఉండడం అదనపు బలం. అందుకే ఏపీలో అధికారం కోల్పోయినా కానీ చంద్రబాబు ప్రత్యర్థులను ఇరుకునపెట్టడం ఆపడం లేదన్న చర్చ సాగుతోంది. ముఖ్యంగా ఏపీలో కొలువైన వైసీపీ ప్రభుత్వాన్ని చంద్రబాబు, ఆయన మీడియా అతలాకుతలం చేస్తోంది. తాజాగా ‘భీమ్లానాయక్’ మూవీపై ఏపీలో ఉక్కుపాదం మోపారని చంద్రబాబు, లోకేష్, ఆయన […]

Written By:
  • NARESH
  • , Updated On : February 26, 2022 / 11:16 AM IST
    Follow us on

    TDP vs YCP:  ప్రతిదాన్ని సాంతం వాడుకొని మీడియాతో ప్రత్యర్థులను చెడుగుడు ఆడడంలో టీడీపీ అధినేత చంద్రబాబు మించిన రాజకీయ చాణక్యుడు లేడు. బలమైన మీడియా చంద్రబాబు చేతిలో ఉండడం అదనపు బలం. అందుకే ఏపీలో అధికారం కోల్పోయినా కానీ చంద్రబాబు ప్రత్యర్థులను ఇరుకునపెట్టడం ఆపడం లేదన్న చర్చ సాగుతోంది.

    Chandrababu and Jr NTR

    ముఖ్యంగా ఏపీలో కొలువైన వైసీపీ ప్రభుత్వాన్ని చంద్రబాబు, ఆయన మీడియా అతలాకుతలం చేస్తోంది. తాజాగా ‘భీమ్లానాయక్’ మూవీపై ఏపీలో ఉక్కుపాదం మోపారని చంద్రబాబు, లోకేష్, ఆయన మీడియా చేసిన రాద్ధాంతం అంతా ఇంతాకాదు.. ఈ దెబ్బకు ఏకంగా ఏపీ ప్రభుత్వమే షేక్ అయ్యింది. వెంటనే ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.

    చంద్రబాబు.. తాజాగా పవన్ భీమ్లానాయక్ మూవీపై గన్ పెట్టి వైసీపీ ప్రభుత్వాన్ని కాల్చాడు. దీంతో వైసీపీ కూడా చంద్రబాబు సొంత మనిషితోనే ఆయన కంట్లో పొడిచే ఎత్తుగడను వేసింది. ఈ క్రమంలోనే వైసీపీ ప్లాన్ బి దెబ్బకు చంద్రబాబు కూడా డిఫెన్స్ లో పడిపోయాడు.

    Also Read: బీజేపీతో ఇక తెగదెంపులేనా..? దూరంగా ఉంటున్న పవన్? కారణం నాగబాబేనా?

    చంద్రబాబు తాజాగా పవన్ కళ్యాణ్ ను వాడుకుంటే.. ఇదే చంద్రబాబుపై ‘జూనియర్ ఎన్టీఆర్’ అస్త్రాన్ని బయటకు తీశారు వైసీపీ బ్యాచ్. పవన్ తో వైసీపీ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేస్తే.. టీడీపీ తొక్కేసిన జూనియర్ ఎన్టీఆర్ తో చంద్రబాబును కొట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు.

    భీమ్లానాయక్ మూవీని బాగా ప్రమోట్ చేస్తున్న టీడీపీకి ఇప్పుడు వైసీపీ తెరపైకి తెచ్చిన ఎన్టీఆర్ వల్ల ఇరుకునపడింది. ఎందుకంటే లోకేష్ కు పోటీ అయిన ఎన్టీఆర్ ను చంద్రబాబు, ఆయన తనయుడు ప్రస్తావించే అవకాశాలు లేవు. అందుకే ఆయన పేరును ఆయన సినిమాలను ఎప్పుడైనా ప్రమోషన్ చేశారా? అని పేర్ని నాని ప్రశ్నించారు. ఇలా ఎత్తుకు పైఎత్తులతో ఈ వార్ యమ రంజుగా సాగుతోంది.

    Also Read: ‘భీమ్లానాయక్’కు చంద్రబాబు, లోకేష్ సపోర్టు.. జూ.ఎన్టీఆర్, బాలకృష్ణను లాగి కౌంటర్ ఇచ్చిన పేర్ని నాని

    Recommended Video:

    Tags