Homeఆంధ్రప్రదేశ్‌Amaravati Issue: అమరావతి విషయంలో వైసీపీ, టీడీపీ మాటల యుద్ధం?

Amaravati Issue: అమరావతి విషయంలో వైసీపీ, టీడీపీ మాటల యుద్ధం?

Amaravati Issue: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు మలుపులు తిరుగుతున్నాయి. అటు వైసీపీ ఇటు టీడీపీ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి విషయంలో చేసిన కామెంట్లకు వైసీపీ కూడా తగు రీతిలో సమాధానాలు ఇస్తోంది. అమరావతి కావాలా? అభివృద్ధి కావాలా? అంటూ ఆయన సంధించిన ప్రశ్నలకు వైసీపీ నేతలు కూడా జవాబులు చెబుతున్నారు.

Amaravati Issue
TDP, YCP

అమరావతిలో బినామీ ఆస్తులను కాపాడకునే క్రమంలో బాబు దాని జపం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు స్వలాభం కోసం చూస్తున్నారని పేర్కొంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో విశాఖ రాజధాని అవుతుందని జోస్యం చెబుతున్నారు. చంద్రబాబు అధికారం కోసం రక్తం మరిగిన పులిలా మారుతున్నారని విమర్శిస్తున్నారు.

Also Read: Rahul Gandhi Telangana Tour: రాహుల్ పర్యటనకు రంగులద్దాలని నేతల ప్రయత్నం?

సీఎం జగన్ మూడేళ్ల కాలంలో ఒక్కొక్కరి ఖాతాలో రూ. 38 వేలు వేశారని మీరు అధికారంలో ఉన్నప్పుడు రూపాయి కూడా వేశారా అని ప్రశ్నిస్తున్నారు. అప్పుడు వచ్చిన నిధులు ఎటు వెళ్లాయని అడుగుతున్నారు. ఏ పథకం కూడా ప్రజలకు చేరకుండా నేరుగా తమ ఖాతాల్లోకి డబ్బులు మళ్లించుకున్న ఘనత మీదేనని చమత్కరించారు.

Amaravati Issue
TDP, YCP

చంద్రబాబు రాస్ట్రానికి పట్టిన శని అయ్యారు. కొడుకు ఐరన్ లెగ్ గా ముద్ర పడిపోయారు. ఇక వీరికి అధికారం మీద ఉన్న యావతోనే లేనిపోని దుష్ర్పచారాలు చేస్తున్నారన్నారు. సెంటిమెంట్ తో ఆంటిమెంట్ రాయాలని చూస్తున్నారు. ఇందులో భాగంగానే తండ్రికొడుకులు కొత్త డ్రామాలు ఆడుతున్నారు. వారి మాటలను ఎవరు నమ్మరు. వైసీపీ రాబోయే ఎన్నికల్లో విజయదుందుబి మోగించడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Also Read:Babu Gogineni: విశ్వక్ సేన్ మరియు దేవి నాగవల్లి వివాదం గురించి బాబు గోగినేని సెన్సషనల్ కామెంట్స్

CM Jagan Fans Fun in Chandrababu Naidu Public Meeting || TDP vs YCP || Ok Telugu

YS Vijayamma Shocking Comments on CM Jagan || Praja Prasthanam Padayatra || Ok Telugu

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

1 COMMENT

Comments are closed.

Exit mobile version