Pawan Kalyan Kodali Nani: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విశాఖ స్టీల్ ఉద్యమ సెగ వైసీపీకి కాస్త గట్టిగానే తగులుతున్నట్టుగా ఉంది.. ఆయన విమర్శలకు ఏపీ సీఎం జగన్ ఎలాగూ స్పందించారు. అయితే పేర్ని నాని.. లేదంటే కొడాలి నాని.. ఈసారి కొడాలి వంతు వచ్చింది. ఈ క్రమంలోనే పవన్ పై పంచులతో కొడాలి నాని విరుచుకుపడ్డారు. పవన్ వి ఫక్తు చిన్నపిల్లల చేష్టలుగా అభివర్ణించాడు. అంతేకానీ తాము మాత్రం విశాఖ స్టీల్ కోసం పోరాటంచేసేది లేదని స్పష్టం చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో గమ్మున ఉంటున్న వైసీపీ భరతం పడుతున్నాడు జనసేనాని పవన్ కల్యాణ్.. వరుసబెట్టి విమర్శలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో డిజిటల్ యుద్ధం కూడా చేస్తున్నారు. వైసీపీ ఎంపీలు పార్లమెంట్ లో మౌనంగా ఉండి చేష్టలుడిగి చూస్తున్న తీరును కడిగేస్తున్నారు. ఎంపీలను ట్యాగ్ చేసి మరీ వారిని ట్రోల్స్ చేస్తున్నారు.
అయితే కేంద్రాన్ని వదిలేసి వైసీపీ సర్కార్ ను టార్గెట్ చేయడాన్ని ఆ పార్టీ అస్సలు తట్టుకోలేకపోతోంది. ఈ క్రమంలోనే మంత్రి పేర్ని నానిని రంగంలోకి దించింది. నాని అసలే ముదురు.. ఇష్టమొచ్చినట్టు తిట్టేస్తాడు.. ఇప్పుడూ అలానే చేశాడు. అసలు ప్రైవేటీకరణపై వైసీపీ స్టాండ్ ఏంటో తెలుపకుండా పవన్ రాజకీయ అజ్ఞాని అని చిన్న పిల్లలు కూడా చెబుతారంటూ ఎద్దేవా చేశారు. అసలు విశాఖ స్టీల్ ప్రైవేటీకరణపై పవన్ ఏం చేశాడో చెప్పాలని.. మాకు సలహాలిస్తాడా? అని కొడాలి నాని ఫైర్ అయ్యాడు. మేం పీకేని పెట్టుకున్నామని.. పీకే పీకే అంటే ప్రశాంత్ కిషోర్ అని.. పవన్ కళ్యాణ్ కాదంటూ ఎద్దేవా చేశారు.
పార్లమెంట్ లో ఫ్లకార్డులు పట్టుకోవాలన్న పవన్ సలహాకు కొడాలి నాని వేసిన పంచ్ అదిరింది. ప్లకార్డులు ఏం ఖర్మ.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించవద్దని మా వైసీపీ ఎంపీల చొక్కాల మీద ముందు వెనుకా రాయించేస్తామంటూ.. నీ ఉచిత సలహాలు విన్నోడు ఎవరూ అసెంబ్లీకి రాలేడని ఎద్దేవా చేశాడు. కావాలంటే చంద్రబాబుకు ఇచ్చి ఆయన్ను ఓడించుకో అని కొడాలి వేసిన పంచులు పేలాయి.
మొత్తంగా పవన్ విశాఖ స్టీల్ ఉద్యమంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వైసీపీ చివరకు తిట్ల దండకాలు.. ఎద్దేవాలు, కౌంటర్లతోనే సరిపెట్టుకుంటోంది. అసలు స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం అయితే చేయలేమని.. బీజేపీ ప్రభుత్వం తీసుకున్ననిర్ణయంపై దేశమంతా పోరాడాలని వైసీపీ మంత్రి చెబుతూ కాడి వదిలేస్తోంది.