Bandla Ganesh: చంద్రబాబును దేవుడిని చేసిన బండ్ల గణేష్.. వైసీపీ సెటైర్లు ఓ రేంజ్ లో

చంద్రబాబు అరెస్టుకు నిరసనగా.. హైదరాబాదులోని గచ్చిబౌలి స్టేడియంలో సిబిఎన్స్ గ్రాటిట్యూడ్ పేరిట నిర్వహించిన కృతజ్ఞత సభకు వేలాది మంది తరలి వచ్చారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

Written By: Dharma, Updated On : October 30, 2023 12:36 pm
Follow us on

Bandla Ganesh: తెలుగు సినీ, రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు బండ్ల గణేష్. యాక్టర్ కం ప్రొడ్యూసర్ అయిన బండ్ల గణేష్ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు.పవన్ కళ్యాణ్ కు భక్తుడిగా మారిపోయారు. తన దేవుడు పవన్ కళ్యాణ్ అంటూ బాహటంగానే చెబుతూ ఉంటారు. చాలా సందర్భాల్లో రాజకీయ వివాదాల్లో సైతం చిక్కుకున్నారు. పవన్ పై ఈగ వాలనివ్వరు. ఈ క్రమంలో ఎంతటి వారైనా రిప్లై ఇస్తారు. ఇటీవల సీఎం జగన్ పవన్ వైవాహిక జీవితం పై మాట్లాడడాన్ని తప్పుపడుతూ ఏకంగా స్టేట్మెంట్ ఇచ్చారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత పలుమార్లు స్పందించిన బండ్ల గణేష్ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. మరోసారి అటువంటి వ్యాఖ్యలు చేస్తూ భావోద్వేగానికి గురయ్యారు. వేలాది మంది చూస్తున్న సభలో కొద్దిసేపు రోదిస్తూ కనిపించారు.

చంద్రబాబు అరెస్టుకు నిరసనగా.. హైదరాబాదులోని గచ్చిబౌలి స్టేడియంలో సిబిఎన్స్ గ్రాటిట్యూడ్ పేరిట నిర్వహించిన కృతజ్ఞత సభకు వేలాది మంది తరలి వచ్చారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపైఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు లాంటి వ్యక్తి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారంటే కడుపు మండిపోతుందంటూ కంటతడి పెట్టారు. బిల్ గేట్స్ ను, వాళ్ళు అంతర్జాతీయ సంస్థలను హైదరాబాద్ తీసుకురావడంతో చంద్రబాబుది కీలక పాత్ర అని గుర్తు చేశారు. కొద్దిసేపు సభా ప్రాంగణం పై అటూ ఇటు ఊగుతూ ఆవేశం తో మాట్లాడడం గమనార్హం.

ఈ సందర్భంగా బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ” నేను వినాయక చవితి పండుగ చేసుకోలేదు. దసరా పండుగ సైతం జరుపుకోలేదు. దీపావళి పండుగను అద్భుతంగా చేసుకునే అవకాశం కల్పించాలని భగవంతుడ్ని కోరుకుంటున్నాను” అని చెప్పుకొచ్చారు. శ్రీకృష్ణుడు అంతటివాడికి కూడా జైలే జన్మస్థలం అయింది. శ్రీకృష్ణుడు దేవుడు కాకుండా పోయాడా? అరణ్యవాసం వెళ్లిన రాముడు దేవుడు కాకుండా పోయాడా? 40 రోజులుగా జైల్లో ఉన్నంత మాత్రాన చంద్రబాబు దేవుడు కాకుండా పోతాడా? అంటూ బండ్ల గణేష్ కామెంట్స్ చేశారు.

అయితే దీనిపై వైసీపీ సోషల్ మీడియా సెటైరికల్ కామెంట్స్ పెడుతోంది. మిమ్స్ తో తెగ హల్చల్ చేస్తోంది. బండ్ల గణేష్ దేవుడు దేవుడు అనడాన్ని ప్రస్తావిస్తోంది. మహేష్ బాబు నటించిన ఖలేజా సినిమాలో వీడియోలను జత చేస్తూ బండ్ల గణేష్ తీరుపై ఉతికి ఆరేయడం విశేషం. గత కొద్దిరోజులుగా బండ్ల గణేష్ తీరుతో వైసిపి శ్రేణులు ఆగ్రహంగా ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ విషయంలో బండ్ల గణేష్ అతి చేస్తున్నాడని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. అందుకే బండ్ల గణేష్ ను టార్గెట్ చేసుకున్నాయి.