YCP Plenary : Jagan, Sharmila, Sunita met : వైఎస్ఆర్ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న వైసీపీ ప్లీనరీ ఆయన కుటుంబ సభ్యులను ఏకం చేసింది. కుటుంబ సభ్యులు అంతా నిన్న రాత్రియే వైఎస్ఆర్ సమాధి ఉన్న ఇడుపులపాయకు చేరుకున్న వైఎస్ కుటుంబ సభ్యుల మధ్య రాత్రి జరిగిన చర్చలు సఫలం అయినట్టు తెలిసింది. అందుకే అందరూ కలిసి వైఎస్ఆర్ కు నివాళులర్పించినట్టు తెలిసింది.
సీఎం జగన్ , వైఎస్ షర్మిల మధ్య విభేదాలకు ఇడుపుల పాయలో చెక్ పడింది. వీరిద్దరూ కలిసి వైఎస్ఆర్ సమాధికి నివాళులర్పించారు. ఇక విజయమ్మ కూడా వీరికి తోడుగా ఉంది. ఇక వైఎస్ జగన్ పై పోరాడుతున్న వైఎస్ వివేకా కూతురు సునీతతో కూడా జగన్ ఫ్యామిలీ సయోధ్య చేసుకున్నట్టు తెలిసింది.
సునీతకు ఎమ్మెల్యే కానీ.. ఎమ్మెల్సీ కానీ ఇచ్చేందుకు జగన్ అంగీకరించారని తెలిసింది. పులివెందుల నుంచి కానీ జమ్మలమడుగు నుంచి కానీ సునీతను నిలబెట్టాలని జగన్ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. వైఎస్ వివేకా చనిపోవడంతో ఆయన కుమార్తె సునీతకు రాజకీయ ప్రాధాన్యత ఇచ్చే విధంగా కుటుంబ సభ్యుల మధ్య అవగాహనకు వచ్చినట్టు తెలిసింది.
ఇక జగన్ జైలుకు వెళ్లినప్పుడు ఆయన చెల్లెలు వైఎస్ షర్మిల పార్టీ కోసం పాదయాత్ర చేసి.. పార్టీని కాపాడి నిలబెట్టారు. జగన్ కోసం ప్రతీ ఎన్నికల్లోనూ ప్రచారం చేసి అభ్యర్థుల గెలుపునకు పాటుపడింది. కానీ జగన్ సీఎం అయ్యాక మాత్రం షర్మిలకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ఆమె అలిగి తెలంగాణలో పార్టీ పెట్టిందని.. ఇది జగన్ కు ఇష్టం లేదని..విభేదాలు పొడచూపాయని వార్తలు వచ్చాయి. ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ ఇంటర్వ్యూలోనూ విభేదాలున్న మాట వాస్తవమేనని.. ఎవరి ఇంట్లో ఉండవని షర్మిల నర్మగర్భంగా వ్యాఖ్యానించారు.
పోయిన ఏడాది వైఎస్ఆర్ జయంతికి ఎడమొహం.. పెడమొహంగా ఉన్న జగన్, షర్మిలలు ఈసారి మాత్రం కలిసి నివాళులర్పించారు. సునీతను కలుపుకుపోయారు. ఇక విజయమ్మ వీరికి తోడుగా ఉన్నారు. దీంతో పాటు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరుఫునే తాను ఉంటానని.. షర్మిలతోనే కొనసాగుతానని.. విజయమ్మ జగన్ పార్టీ గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.