‘‘దేవుడా.. ఓ మంచి దేవుడా.. రాజకీయాల్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇప్పించావ్.. అడగ్గానే ఎమ్మెల్యేను చేశావ్! ఇంటి చుట్టూ కార్యకర్తలను ఉంచావ్.. ఒంటి చుట్టూ బాడీ గార్డులను పెట్టావ్.. ప్రజలకు ఇంకా దగ్గర చేశావ్.. పరపతిని కూడా బాగా పెంచావ్.. కానీ, ఎందుకయ్యా మంత్రి సీటును దూరంగా నెట్టావ్?’’ అంటూ వైసీపీ ఎమ్మెల్యేలు మొర పెట్టుకుంటున్నారట. త్వరలో మంత్రివర్గ విస్తరణ జరగబోతున్న నేపథ్యంలో బెర్తులు ఆశిస్తున్న వాళ్లంతా.. దేవుళ్లకు చేస్తున్న పూజలు, భజనలు అన్నీఇన్నీ కావు. వాళ్లను స్తుతిస్తున్న తీరు అంతా ఇంతా కాదు!
ఇప్పుడు శ్రావణ మాసం వచ్చేసింది.. ఫుల్లు పండగల సీజన్. మామూలుగానే రాజకీయ నాయకులు దేవుళ్లను ఎక్కువగా మొక్కుతుంటారు. అలాంటిది పండగల సీజన్.. పైగా మంత్రివర్గ విస్తరణ జరగబోతున్న సమయం.. మరి, ఇలాంటి సమయంలో వరాలివ్వకుండా దేవుడిని విడిచిపెడతారా? ప్రసక్తే లేదు అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు వైసీపీలోని ప్రధాన ఎమ్మెల్యేలు.
వీరిలో వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా ముందు వరసలో ఉన్నారు. తాజాగా.. తన ఇంట్లో వరలక్ష్మీ వ్రతం అట్టహాసంగా నిర్వహించారు. గతంలో కూడా నిర్వహించినప్పటికీ.. ఈ సారి అంతకు మించి అన్న రేంజ్ లో నిర్వహించారు. రెండో విడత మంత్రివర్గ విస్తరణలో చోటు ఆశిస్తున్న వారిలో రోజా ముందు వరసలోనే ఉన్నారు. తొలిసారే ఆమెకు పదవి వస్తుందని భావించినప్పటికీ.. పలు సమీకరణాలతో ఆమెను పక్కనేపెట్టారు జగన్. అందువల్ల.. ఈ సారి తనకు ఖచ్చితంగా పదవి వస్తుందని, రావాలని పట్టుదలగా ఉన్నారు రోజా. ఇదే విషయాన్ని వరలక్ష్మిదేవికి గట్టిగానే కోరుకుని ఉంటారు. అందుకే ఘనంగా పండుగ నిర్వహించారని చెప్పుకుంటున్నారు.
మరోవైపు.. గుంటూరు జిల్లాకు చెందిన వైపీసీ ఎమ్మెల్యే విడదల రజనీ కూడా మంత్రివర్గంలో స్థానం ఆశిస్తున్నారు. ఈమె దేవుళ్లను పూజించడంతోపాటు ఏకంగా జగన్ లోనే దేవుడిని చూసుకునేంత పనిచేశారు. పొద్దు పొద్దున్నేలేచి.. అందరికన్నా ముందుగా వెళ్లి సీఎం జగన్ కు రాఖీ కట్టారు. మరి, చెల్లి రాఖీ కట్టిందంటే.. అన్నయ్య కానుకలు ఇవ్వాలి. కోరికలు తీర్చాలి. ఆ విధంగా చూసుకున్నప్పుడు ఈ చెల్లికి ఉన్న ఏకైక కోరిక ఏంటో అన్నయ్యకు కూడా తెలుసు. కాబట్టి, ఒక కుర్చీని ఖాళీగా ఉంచుతారేమో చూడాలి.
ఈ విధంగా మిగిలినవారు కూడా కేబినెట్లో బెర్త్ కోసం దేవుళ్లకు గట్టిగానే అర్జీలు పెట్టుకుంటున్నారట. ఇంకా ముందు చాలా ముఖ్యమైన పండగలు ఉన్నాయి. లంబోదరుడి ఉత్సవాలు అతి త్వరలోనే రాబోతున్నాయి. మొత్తానికి ఎవరికి వారు దేవుళ్లకు గట్టి పూజలు చేస్తున్నారట. అంతేకాదు.. ‘‘నువ్వు తప్పకుండా మా కోరిక తీరుస్తావ్.. మాకు తెలుసు.. ఎందుకంటే బేసికల్లీ యు ఆర్ ఏ గాడ్..’’ అని మొహమాటం కూడా పెట్టేస్తున్నారట. మరి, చూడాలి.. ఎవరి పూజలు ఎంత వరకు ఫలిస్తాయో?!
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Ycp mlas praying god for minister seat for jagan cabinet
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com