https://oktelugu.com/

అంబటికి మంత్రి పదవి దక్కకుండా చేస్తున్నారా?

అంబటి రాంబాబు.. ఆది నుంచి వైఎస్‌ జగన్‌కు అండగా నిలుస్తున్నాడు. వైసీపీ పార్టీ ప్రారంభం నుంచి ఉన్నాడు. ప్రతిపక్షంలో ఉన్నా.. అధికార పక్షంలో ఉన్నా చంద్రబాబు ఆయన చేసే విమర్శలు మామూలుగా ఉండవు. ఒక విధంగా చెప్పాలంటే వైసీపీలో ఎదురుదాడికి దిగేది రాంబాబు, రోజా మాత్రమే. ఇప్పుడిప్పుడు అధికారంలోకి వచ్చాక కొంత మంది నేతలు మాట్లాడుతున్నా.. ముందు నుంచి జగన్‌ వెంటనే నడిచింది రాంబాబునే. Also Read: ఏపీ రాజధానిపై కేంద్రం వైఖరి ఇదేనా? అలాంటి రాంబాబు […]

Written By:
  • NARESH
  • , Updated On : September 27, 2020 5:44 pm
    Follow us on

    అంబటి రాంబాబు.. ఆది నుంచి వైఎస్‌ జగన్‌కు అండగా నిలుస్తున్నాడు. వైసీపీ పార్టీ ప్రారంభం నుంచి ఉన్నాడు. ప్రతిపక్షంలో ఉన్నా.. అధికార పక్షంలో ఉన్నా చంద్రబాబు ఆయన చేసే విమర్శలు మామూలుగా ఉండవు. ఒక విధంగా చెప్పాలంటే వైసీపీలో ఎదురుదాడికి దిగేది రాంబాబు, రోజా మాత్రమే. ఇప్పుడిప్పుడు అధికారంలోకి వచ్చాక కొంత మంది నేతలు మాట్లాడుతున్నా.. ముందు నుంచి జగన్‌ వెంటనే నడిచింది రాంబాబునే.

    Also Read: ఏపీ రాజధానిపై కేంద్రం వైఖరి ఇదేనా?

    అలాంటి రాంబాబు ఇప్పుడు వరుస వివాదాల్లో చిక్కుకుంటూ వైసీపీలోనే అత్యంత వివాదాస్పద నాయకుల్లో ఒకరవుతున్నాడు. అయితే.. ఆ ఆరోపణలు కూడా సొంత పార్టీ వారే చేస్తుండడంతో ఆసక్తిగా మారింది. మరో ఏడాదిలో జరగనున్న మంత్రి వర్గ పునర్‌ వ్యవస్థీకరణలో కేబినెట్ బెర్త్ కోసం పెద్ద ఎత్తున రేస్ నడుస్తోంది. సామాజిక సమీకరణలతోపాటు విధేయత పరంగా కూడా అంబటి రాంబాబుకు ప్లస్ పాయింట్లు ఉన్నాయి. అయితే గుంటూరులో రెడ్డి సామాజికవర్గం నేతలు బెర్త్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. వారికి బెర్త్‌ దక్కాలంటే ఆటోమెటిక్‌గా రాంబాబు ఇమేజీకి డ్యామేజీ చేయాలని అనుకుంటున్నారని రాంబాబు అనుమానిస్తున్నారు.

    అంబటి మైనింగ్ అక్రమాలకు పాల్పడుతున్నారంటూ సొంత పార్టీ కార్యకర్తలే హైకోర్టులో పిల్ వేశారు. ఈ వ్యవహారం విచారణ దశలో ఉండగానే మరో రెండు వివాదాలు ఆయన్ను చుట్టుకున్నాయి. అంబటికి అత్యంత సన్నిహితులైన ఇద్దరు నేతలు భూములను కబ్జా చేశారు. వాటి వివరాలు వైసీపీ నేతల నుంచే మీడియాకు అందాయి. బెదిరింపుల ఆడియోలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ మొత్తం వ్యవహారాలపై విచారణకు కూడా ఆదేశించారు. అధికారులు భూములను పరిశీలించారు. అవకతవకలు జరిగాయని ప్రాథమికంగా గుర్తించారు. దీంతో అంబటి ఇరుక్కుపోయారు.

    Also Read: టీడీపీ ప్రక్షాళన.. 25 లోక్ సభ నియోజకవర్గాలకు అధ్యక్షుల ప్రకటన

    అలాగే.. రెపల్లేకు చెందిన అంబటి రాంబాబుకు సత్తెనపల్లితో ఎలాంటి సంబంధం లేదు. సామాజికవర్గం బలంతో సత్తెనపల్లిలో పాగా వేసినా.. సత్తెనపల్లి వైసీపీ లీడర్లు రాంబాబుపై అంత సానుకూలంగా లేరట. ఇప్పుడు తమ ప్రాంతం నుంచి మంత్రి పదవికి పోటీగా వస్తున్నారని తెలిసి.. ఇతర నేతలూ రగిలిపోతున్నారు. అందుకే సత్తెనపల్లిని అంబటి రాంబాబు ఆదాయవనరుగా మార్చుకున్నారనే ఆగ్రహం వారిలో కనిపిస్తోంది. ఈ ఆగ్రహం కాస్త.. హైకోర్టులో పిటిషన్లు, పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదులు చేసే వరకూ వెళ్లింది. మొత్తంగా చూస్తే అంబటికి ప్రతిపక్షమైన టీడీపీ నుంచి కాకుండా ఇంటి పోరే మొదలు కావడంపై రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది.