Homeఆంధ్రప్రదేశ్‌YCP: ఏపీలో జగన్ చేస్తోన్న సాహసమిదీ

YCP: ఏపీలో జగన్ చేస్తోన్న సాహసమిదీ

YCP: వచ్చే ఎన్నికల్లో కీలక మార్పులు దిశగా వైసిపి అడుగులు వేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చనుందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే 11మంది అభ్యర్థులను మార్చింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి బలమైన నేతను సైతం వదులుకునేందుకు సిద్ధపడింది. దీంతో వైసీపీలో రకరకాల చర్చ ప్రారంభమైంది. కొంతమంది మంత్రులకు సైతం ఉద్వాసన తప్పదని టాక్ నడుస్తోంది. ఇది వైసీపీ నేతల్లో కలవరపాటుకు కారణం అవుతోంది. అటు సోషల్ మీడియాలో సైతం నేతల మార్పు ఇది అంటూ రకరకాల ప్రచారం జరుగుతోంది. ఏకంగా 90 చోట్ల అభ్యర్థులు మారుతారని.. ఆ మేరకు వైసిపి హై కమాండ్ కసరత్తు చేసిందని కూడా కామెంట్స్ వినిపించాయి.

వై నాట్ 175 అన్న నినాదంతో వైసీపీ హై కమాండ్ ముందుకు సాగుతోంది. ప్రతి నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఎట్టి పరిస్థితుల్లో గెలుపు గుర్రాలను బరిలో దించాలని చూస్తోంది. ఎటువంటి మొహమాటలకు వెళ్లకుండా జగన్ జాగ్రత్త పడుతున్నట్లు పరిస్థితులు తెలియజేస్తున్నాయి. అయితే అభ్యర్థుల మార్పు వెనుక కీలక నాయకులు మీడియాకు కొత్త కొత్తగా లీకులు ఇస్తున్నారు. ఒక పదిమంది మంత్రులు సైతం సీట్లు కోల్పోనున్నారని వైసిపి అనుకూల మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే ఇది నాయకత్వం వ్యూహాత్మకంగా చేస్తున్న పని అని స్పష్టమౌతోంది. కానీ ఈ ప్రచారం పక్కదారి పడుతోంది. పార్టీలో ఒక రకమైన ఆందోళనకు కారణం అవుతోంది. వైసిపి హై కమాండ్ అలెర్ట్ కాకుంటే తప్పకుండా నష్టం జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 11 మంది అభ్యర్థులను మార్చుతూ వైసిపి హై కమాండ్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో ముగ్గురు మంత్రులకు స్థానచలనం కూడా జరిగింది. అయితే తరువాత ఎవరిపై వేటు వేస్తారా? ఎవరికి స్థాన చలనం కల్పిస్తారా? అన్న చర్చ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 76 నియోజకవర్గాల్లో కొత్త ముఖాలు తెరపైకి వస్తాయని తాజా తెలుస్తోంది. ఎప్పటికే 11చోట్ల అభ్యర్థులు మారారు. 15 మంది సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యే అభ్యర్థులుగా మారనున్నారు. మరో 20 మంది ఎమ్మెల్యేలు ఎంపీలుగా పోటీ చేయనున్నారు. మరో 30 మందికి పైగా కొత్తవారు బరిలో దిగనున్నారు. ఇలా వైసీపీలోనే ప్రచారం జరుగుతోంది. వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఉన్నారు. మరో నలుగురు ఇతర పార్టీల నుంచి ఫిరాయించారు. దీంతో వైసీపీ బలం 155 ఎమ్మెల్యేలకు చేరుకుంది. ఈ లెక్కన దాదాపు సగం మంది ఎమ్మెల్యేలను పక్కన పెట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ స్థాయిలో టిక్కెట్లు నిరాకరిస్తే మాత్రం పార్టీలో తిరుగుబాటు రావడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే జగన్ అంతటి సాహసం చేస్తారా? లేదా? అన్నది తెలియాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular