https://oktelugu.com/

Kapu naadu Meeting : జగన్ లో భయం.. కాపునాడుకు వైసీపీ దూరం.. ఇక జనసేనదే ‘కాపు’రాజ్యం.. 

Kapu naadu Meeting  : కాపు దిగ్గజ నేత వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా విశాఖలో ఏర్పాటు చేసిన ‘కాపునాడు’ ఏపీ రాజకీయ వర్గాల్లో అత్యంత ఆసక్తి రేపింది. ఈ సమావేశానికి పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల దిగ్గజ నేతలను పిలిచారు. కేవలం రంగా గారి వర్థంతి అని.. అందరూ కాపులు ఒక్కచోటకు చేరాలని నేతలు నిర్ణయించారు. దీంతో రాజకీయాలు పక్కనపెట్టి అందరూ ఒక్కటవుతారని.. తర్వాత కాపులు ఐక్యంగా ఒక గొడుగు కిందకు చేరాలని అంతా భావించారు. […]

Written By:
  • NARESH
  • , Updated On : December 26, 2022 / 08:48 PM IST
    Follow us on

    Kapu naadu Meeting  : కాపు దిగ్గజ నేత వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా విశాఖలో ఏర్పాటు చేసిన ‘కాపునాడు’ ఏపీ రాజకీయ వర్గాల్లో అత్యంత ఆసక్తి రేపింది. ఈ సమావేశానికి పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల దిగ్గజ నేతలను పిలిచారు. కేవలం రంగా గారి వర్థంతి అని.. అందరూ కాపులు ఒక్కచోటకు చేరాలని నేతలు నిర్ణయించారు. దీంతో రాజకీయాలు పక్కనపెట్టి అందరూ ఒక్కటవుతారని.. తర్వాత కాపులు ఐక్యంగా ఒక గొడుగు కిందకు చేరాలని అంతా భావించారు. సీన్ కట్ చేస్తే.. మొదటి నుంచి దీన్ని వ్యతిరేకిస్తూ జనసేనకు క్రెడిట్ దక్కవద్దని ప్లాన్ చేసిన వైసీపీ అన్నట్టే కుట్రలు చేసింది. వైసీపీ నేతలు ఎవరినీ ఈ కాపునాడుకు పంపకుండా షాకిచ్చింది.

    వైసీపీ అధిష్టానం కాపు నేతలు ఎవరూ కూడా విశాఖలో నిర్వహించే ‘కాపునాడు’ సమావేశానికి హాజరు కావద్దని.. దూరంగా ఉండాలని స్టిక్ట్ ఆదేశాలు ఇచ్చింది. దీంతో కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు తూతు మంత్రంగా వంగవీటి రంగ విగ్రహాలకు నివాళులర్పించి మమ అనిపించారు.

    ఉత్తరాంధ్ర సీనియర్ నేత గంటా శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో విశాఖ ఏఎస్ రాజా గ్రౌండ్స్ లో ‘కాపునాడు’ సభ పెట్టారు. టీడీపీకి దూరంగా ఉంటున్న గంటా శ్రీనివాస్ ఇటీవల కాపు రాజకీయాల్లో బిజీ అయ్యారు. అందరినీ ఒక్కచోటకు చేర్చి జనసేనకు మద్దతు ఇవ్వాలని.. జనసేనలో చేరాలని ఆయన స్కెచ్ గీశారు. ఈ మేరకు కాపు నేతలంతా వివిధ పార్టీలో ఉన్నవారంతా తమ భవిష్యత్ కోసం ఒక్కచోటకు రావాలని.. రాజకీయ ఎజెండా పక్కనపెట్టి ఒక్కటవ్వాలని పిలుపునిచ్చారు.

    ఈ క్రమంలోనే టీడీపీ, వైసీపీ, జనసేన, కాంగ్రెస్, బీజేపీ నేతలందరినీ కాపునాడుకు పిలిచారు. అందరి ఫొటోలను ఫ్లెక్సీల్లో పెట్టారు. అయితే కాపునాడు ఫక్తు జనసేనకు మద్దతిచ్చేందుకు ఏర్పాటు చేశారని వైసీపీ పసిగట్టింది. కాపులందరూ వారి సామాజికవర్గానికి చెందిన జనసేన వెంట నిలవబోతున్నారని ఉప్పందడంతో వైసీపీ అధిష్టానం ఈ సభకు ఏ వైసీపీ నేత వెళ్లొద్దని హుకూం జారీ చేసింది.

    దీన్ని కాపుల ఐక్యతకు, కాపులంతా జనసేన వైపు నిలుస్తారని తేలగానే వైసీపీలో భయం మొదలైనట్టుగా కనిపిస్తోంది.