
ఏపీ అధికార పార్టీ వైసీపీలో ఈ మధ్య ఓ విషయమై జోరుగా చర్చ నడుస్తోంది. ఇటీవల జారీ అయిన రెండు సర్య్కులర్లు ఈ చర్చకు దారితీశాయట. ఈ సర్య్కులర్లతో నేతల్లోనూ గుబులు మొదలైందట. అంతేకాదు.. ఆ రెండు సర్య్కులర్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలను ఉద్దేశించినవేనని ప్రచారం జరుగుతోంది. వైసీపీలో కొన్నాళ్లుగా పరిస్థితి గాడి తప్పుతున్న విషయం తెలిసిందే. ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు వ్యవహరిస్తున్నారు. ఎంపీలు.. ఎమ్మెల్యేలు.. మంత్రులు ఆధిపత్య ధోరణితో ముందుకు సాగుతున్నారు.
Also Read: అమరావతి నిధులకు వైసీపీ ‘కత్తెర’
ఇదిలావుంటే.. మరికొందరు నాయకులు సైలెంట్‌గా ఉంటూ.. వైసీపీ తరఫున వాయిస్ వినిపించడమే మానేశారు. ఇంకొందరు.. ఈ దూకుడులో కులాలను టార్గెట్ చేశారు. సామాజిక వర్గాల పేరు పెట్టి మరీ తిడుతూ విరుచుకుపడ్డారు. ఇక పలు జిల్లాల్లో పలు నియోజకవర్గాల్లో వైసీపీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతల మధ్య ఏ మాత్రం పొసగడం లేదు. దీంతో వైసీపీ నేతలు ఆశించిన స్థాయిలో గ్రాఫ్ పెంచుకోలేక పోతున్నారనేది పార్టీ గ్రహించింది.
మరోవైపు.. టీడీపీ సైలెంట్‌గా విస్తరిస్తోందని.. గతంలో చంద్రబాబు ఏం చెప్పినా వినిపించుకోని కొన్ని వర్గాల ప్రజలు ఇప్పుడు ఆసక్తిగా ఆయన వైపు చూస్తున్నారని వైసీపీకి సమాచారం ఉందట. దీనికి కారణం ఏంటి? ఎక్కడ తప్పులు జరుగుతున్నాయనే విషయాలపై కొన్ని రోజుల కిందట పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణా రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డిలతో కూడిన కమిటీని వేసింది. ఈ కమిటీ విస్తృత అధ్యయనం చేసింది. అంతేకాదు ఎమ్మెల్యేలతో టెలీ కాన్ఫరెన్స్ కూడా పెట్టి వారి దూకుడును తెలుసుకుంది.
Also Read: అమరావతిపై అంటరాని ముద్ర..: జగన్ కొత్త రాజకీయం
ఈ నేపథ్యంలో ఈ త్రిసభ్య కమిటీ నివేదిక ఇటీవల జగన్‌కు అందించినట్టు తెలుస్తోంది. దీనిని ఆధారంగా చేసుకుని జగన్ రాజకీయ సలహాదారు.. సజ్జల రామకృష్ణారెడ్డి రెండు సర్క్యులర్లు జారీ చేశారని సమాచారం. ప్రస్తుతం వీటిపై జిల్లా ఇన్‌చార్జి మంత్రులు ఎమ్మెల్యేలకు క్లాసులు పీకుతున్నారని తెలుస్తోంది. ఈ విషయం మీడియాకు వెల్లడికాకుండా జాగ్రత్తలు తీసుకునే బాధ్యతను కూడా మంత్రులకే అప్పగించారని సమాచారం. మొత్తానికి ఈ రెండు సర్క్యులర్ల ద్వారా వైసీపీ ఎమ్మెల్యేల దూకుడుకు బ్రేకులు వేయడంతోపాటు.. పార్టీ పరంగా ఎలా వ్యవహరించాలనే విషయంపై ఉన్నత స్థాయి నుంచి గైడ్‌లైన్స్ వచ్చాయని తెలుస్తోంది. ఈ సర్య్కులర్లతో అయినా పార్టీలో నెలకొన్ని గందరగోళానికి బ్రేకులు పడేనా..? ఈ అంతర్గత విభేతాలు తొలగేనా అనే చర్చ మాత్రం నడుస్తోంది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్