https://oktelugu.com/

China India: చైనాపై ఆధారపడకుండా భారత్ ఉండలేదా..?

China India: భారతదేశం, చైనా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదంతో ఇప్పటికే దేశంలో చైనాపై ప్రజలు భగ్గుమంటున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వం చైనా వస్తువులను కొనుగోలు చేయవద్దని ఆదేశించింది. అంతేకాకుండా చైనాకు చెందిన యాప్ లను నిషేధించింది. చైనాతో మనకు ఎప్పటికీ శత్రుత్వమేనని ప్రధానమంత్రి మోదీ ప్రకటించారు. అయితే తెలంగాణలో ఇటీవల సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి మోదీ వచ్చారు. అంతేకాకుండా సమతామూర్తి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై అభినందించారు. అయితే ఈ […]

Written By:
  • NARESH
  • , Updated On : February 15, 2022 / 12:55 PM IST
    Follow us on

    China India: భారతదేశం, చైనా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదంతో ఇప్పటికే దేశంలో చైనాపై ప్రజలు భగ్గుమంటున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వం చైనా వస్తువులను కొనుగోలు చేయవద్దని ఆదేశించింది. అంతేకాకుండా చైనాకు చెందిన యాప్ లను నిషేధించింది. చైనాతో మనకు ఎప్పటికీ శత్రుత్వమేనని ప్రధానమంత్రి మోదీ ప్రకటించారు. అయితే తెలంగాణలో ఇటీవల సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి మోదీ వచ్చారు. అంతేకాకుండా సమతామూర్తి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై అభినందించారు. అయితే ఈ విగ్రహం చైనాకు చెందిన కంపెనీతో తయారు చేయించారు. దేశంలో కంపెనీలు లేనట్లు చైనాకే ఎందుకు అప్పగించారు..? అనే విమర్శలు వస్తున్నారు.

    China India

    కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ ఇటీవల ట్విట్టర్ వేదికగా ఓ మెసేజ్ పెట్టారు. ‘స్టాట్యూ ఆప్ ఈక్వాలిటీ, చైనాలో తయారైంది. ఈ ఆధునిక భారతదేశం చైనాపై ఆధారపడుతోందా..?’’ అని ట్వీట్ చేశారు. అయితే సమతామూర్తి విగ్రహాన్ని చైనాకు చెందిన ‘ఏరోసన్ కార్పొరేషన్ ’అనే సంస్థ తయారు చేసింది. కాగా రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ‘ స్టాట్యూఆఫ్ లిబర్టీ విగ్రహ నిర్మాణంలో ప్రభుత్వం ప్రమేయం ఏమీ లేదు. ఇది పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమం. దీని తయారినీ 8 సంవత్సరాల కిందటే ప్రారంభించారు. ‘మేక్ ఇన్ ఇండియా’ క్యాంపెయిన్ ప్రారంభం కాకముందే ఈ విగ్రహ నిర్మాణాన్ని మొదలు పెట్టారు.’అని బదులిచ్చారు.

    Also Read:  యంగ్ హీరోయిన్‌ తో ఆ హీరో పెళ్లి !

    ఈ అంశాలు సోషల్ మీడియాలో ట్రెండ్ కావడంతో కొత్త చర్చ మొదలైంది. భారత్లోని లక్ష్మీ, దుర్గాదేవి విగ్రమాలు సైతం చైనానే తయారు చేయిస్తోందని అంటున్నారు. అలాగే గాలి పటాలు, మంజాల విక్రయం చైనా ఆధ్వర్యంలోనే అమ్మాకాలు సాగుతున్నాయని ఆరోపిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు చైనాపై ఆధారపడడాన్ని తగ్గించుకుంటున్నారు. ఆ దేశానితో వ్యాపార సంబంధాలను తగ్గించుకుంటున్నాయి. 2017లో విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ మాట్లాడుతూ భారత్ లో పెరుగుతున్న ఆర్థిక పెట్టుబడుల్లో ఎక్కువ శాతం చైనా నుంచే వస్తున్నట్లు తెలిపారు. అయితే 2014 కు ముంద చైనా పెట్టుబడులు 116 బిలియన్లు ఉంటే ఇప్పుడు అవి 160 బిలియన్లకు చేరుకుందని ఆ సమయంలో పేర్కొన్నారు.

    202లతో భారత్, చైనాల మధ్య ఉద్రిక్తల పరిస్థితులు నెలకొన్న సమయంలో ప్రధాన మంద్రి మోదీ చైనాకు వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టారు. చైనా వస్తువులను నిషేధించాలని నినదించిన ఆయన అక్కడి నుంచి వచ్చే పెట్టుబడునలు మాత్రం ఆపలేకపోతున్నారని విమర్శిస్తున్నారు. కరోనా కారణంగా దేశంలో కొన్ని వస్తువుల సరఫరా తగ్గింది. దీంతో 2021లోనూ చైనా నుంచి భారత్ కు దిగుమతులు సాగినట్లు ‘వాణిజ్య డేటా’ వెల్లడిస్తోంది. భారత్ తో వ్యాపారానికి సంబంధించిన డేటాను ‘ద చైనా జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్’ జనవరిలో విడుదల చేరసింది. ఈ డేటా ప్రకారం ఇరుదేశాల మధ్య వాణిజ్యం 125.6 డాలర్లుగా ఉంది.

    అయితే చైనాతో 100 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా వాణిజ్యం జరగడం ఇదే మొదటిసారి. అంటే ఇందులో 97.5 బిలియన్ డాలర్లు దిగుమతులు కాగా.. 28.1 బిలియన్ డాలర్ల ఎగుమతులు ఉన్నాయి. 2019తో పోలిస్తే మహమ్మారి కారణంగా 2020లో చైనాలో భారత వాణిజ్యం తగ్గింది. చైనా నుంచి భారత్లోకి దిగుబడులు క్రమంగా పెరుగుతున్నాయి. వాణిజ్య లోటు భారత్ ను ఎప్పుడూ పీడిస్తుంది. ఇది అంతం కాకపోవచ్చని ఆర్థిక విశ్లేషకులు వాదన.

    ఇక చైనాపై భారత్ మాత్రమే కాకుండా ప్రపంచ దేశాలు సైతం చైనాపై ఆధారపడుతున్నాయని విలీ షిహ్, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ ప్రొఫెసర్ తెలిపాడు. తయారీ రంగంలో ప్రపంచం చైనాపై ఆధారపడుతుందని అన్నారు. ఎలక్ట్రానిక్స్, ఫర్నీచర్, బొమ్మలు ప్రతీదీ చైనాపైనే ఆధారపడుతున్నారు. ఒకవేళ చైనాతో తలపడాలనుకుంటే దాని వల్ల ఎదురయ్యే పర్యావసనాలను ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలి అని ప్రొఫెసర్ తెలిపారు.

    Also Read:  వైరల్ అవుతున్న టుడే క్రేజీ అప్ డేట్స్ !