https://oktelugu.com/

Union Budget Of India 2022: వేతన జీవులకు ఊరట? నేటి బడ్జెట్లో కీలక పాయింట్ ఇదే!

Union Budget Of India 2022: మరి కొన్ని గంటల్లో పార్లమెంట్లో బడ్జెట్ ప్రసంగం ప్రారంభం కానుంది. 2022-23 సంవత్సరానికి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేపర్ లెస్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. అంటే ట్యాబ్ ద్వారా వివరాలు వెల్లడించనున్నారు. కరోనా కారణంగా గత సంవత్సరం ఇదే విధానాన్ని అవలంభించారు. అయితే ఈసారి బడ్జెట్ ప్రత్యేకమైందిగా చెప్పుకొంటున్నారు. ముఖ్యంగా వర్క్ ఫ్రం హోం ఉద్యోగులకు కోసం ప్రత్యేకంగా కొన్ని సదుపాయాలు అందించే అవకాశం ఉందంటున్నారు. ఆయా […]

Written By:
  • NARESH
  • , Updated On : February 1, 2022 / 09:39 AM IST
    Follow us on

    Union Budget Of India 2022: మరి కొన్ని గంటల్లో పార్లమెంట్లో బడ్జెట్ ప్రసంగం ప్రారంభం కానుంది. 2022-23 సంవత్సరానికి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేపర్ లెస్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. అంటే ట్యాబ్ ద్వారా వివరాలు వెల్లడించనున్నారు. కరోనా కారణంగా గత సంవత్సరం ఇదే విధానాన్ని అవలంభించారు. అయితే ఈసారి బడ్జెట్ ప్రత్యేకమైందిగా చెప్పుకొంటున్నారు. ముఖ్యంగా వర్క్ ఫ్రం హోం ఉద్యోగులకు కోసం ప్రత్యేకంగా కొన్ని సదుపాయాలు అందించే అవకాశం ఉందంటున్నారు. ఆయా కంపెనీలకు పన్ను మినహాయింపు ద్వారా ఉద్యోగులకు పలు సౌకర్యాలు కల్పించేలా బడ్జెట్ ను రూపొందించినట్లు తెలుస్తోంది. మరోవైపు క్రమంగా పెరుగుతున్న ద్రవోల్భణం, క్షీణిస్తున్న తలసరి ఆదాయం నేపథ్యంలో వేతన జీవులను ఊరట కలిగించే విషయాలు ఇందులో ఉండవచ్చని సమాచారం.

    కరోనా మహమ్మారి కారణంగా రెండు సంవత్సరాలు అన్ని రంగాలకు చెందిన వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా వర్క్ ఫ్రం హోం చేసే ఉద్యోగులు ఆర్థికంగా, మానసికంగా అనేక కష్టాలనెదుర్కొన్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఉద్యోగులు కార్యాలయాలకు రాలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో చాలా కంపెనీలు వర్క్ ఫ్రం హోం విధానాన్ని అవలంభించాయి. అయితే ఈ విధానంతో ఎక్కువగా ఉద్యోగులే నష్టపోయినట్లు తెలుస్తోంది. వర్క్ ప్రెజర్ తో పాటు ఫైనాన్షియల్ గా నష్టపోయినట్లు కొందరు వాపోతున్నారు.

    Also Read: Union Budget 2022: ఈ బడ్జెట్ లో ఏ వర్గాలకు న్యాయం? ఏఏ వర్గాలను ఆదుకోబోతోంది..?
    ఇంట్లో ఉండి పనిచేసిన ఉద్యోగులకు కార్యాలయాలకు వెళ్లే పని తప్పినా.. పనిగంటలు పెరిగాయి. అలాగే వర్క్ కోసం ఏర్పాటు చేసుకున్న ఇంటర్నెట్, మొబైల్ ఛార్జీలు తడిసి మోపడయ్యాయి. వీటికి తోడు విద్యుత్ బిల్లు కూడా అధికంగానే చెల్లించాల్సి వచ్చింది. ఇక వర్క్ చేసే సమయంలో కాఫీలు, టీల కోసం కూడా అదనంగా ఖర్చయినట్లు ఉద్యోగులు పేర్కొంటున్నారు. అయితే ఇన్ని ఖర్చులు భరించినా కొన్ని కంపెనీలు నామమాత్రపు సాలరీనే చెల్లించిందని అంటున్నారు. దీంతో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారు.

    ఈ నేపథ్యంలో వేతన జీవులను ఆదుకునేందుకు నేటి బడ్జెట్ ఉంటుందని అంటున్నారు. వర్క్ ఫ్రం హోం చేసే ఉద్యోగులకు పన్ను మినహాయింపు ఇవ్వడం వల్ల వారి జీతం పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో దేశంలో వస్తుసేవల డిమాండ్ పెరుగుతుందని క్లియర్ టాక్స్ వ్యవస్థాపకుడు అర్పిత్ గుప్తా చెబుతున్నారు. ఇప్పటికే ఉద్యోగ పన్ను మినహాయించాలని చాలా కంపెనీలో మొర పెట్టుకున్నాయి. కొన్ని సౌకర్యాలను సమకూర్చుకునేందుకు ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవ్వాలని కోరాయి. దీంతో దీనిపై ప్రసంగం చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇక కొన్నాళ్లుగా ప్రవేశపెడుతున్న బడ్జెట్లో పీఎఫ్ ఖాతాల్లోకి అదనపు చందాలు, వడ్డీలు పన్ను పరిధిలోకి వచ్చాయి. అయితే ఉద్యోగి పీఎఫ్ ను విడిగా అందించాలి. ఎందుకంటే రూ.1,50,000 మినహాయింపు పరిమితి కింద అర్హత లభిస్తుంది. దీంతో ఇంటితో పాటు ప్రభుత్వానికి మూలధనాన్ని అందిస్తాయి.

    Also Read: Union Budget Of India 2022: బడ్జెట్ 2022: కరోనా వేళ ఊరటదక్కేనా? ఐటీ పరిమితి పెరిగేనా? ఊసురుమంటారా?

    ఇదిలా ఉండగా కరోనా కారణంగా పరిశ్రమ రంగం తీవ్ర ఆర్థిక నష్టాల్లోకూరుకుపోయింది. దీంతో ఈ ప్రభావం ఉద్యోగులపై కూడా పడింది. ఈ నేపథ్యంలో ఫర్నీచర్, విద్యుత్, ఇంటర్నెట్ మొదలైన ధరలతో పాటు వైద్య ఖర్చులు పెరిగినందున గృహఅవసరాలపై ప్రతికూల ప్రభావం పడుతోంది. అందువల్ల స్టాండర్ట్ డిటక్షన్ పరిమితిని రూ.50 వేల నుంచి రూ.75 వేలకు పెంచాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. ఈ మేరకు కేంద్రానికి వినతిని అందించాయి. అయితే నేటి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక మంత్రి ఎవరికి ఊరట కలిగిస్తారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.