https://oktelugu.com/

International Women’s Day : టాప్ యూనివర్సిటీలను నడిపిస్తున్న అభినవ సరస్వతీ మాతలు వీరే..

International Women’s Day  : విద్యా దేవతగా, జ్ఞానాన్ని ప్రసాదించే తల్లిగా మనం సరస్వతీమాతను కొలుస్తాం.. వసంత పంచమి సందర్భంగా పూజలు చేస్తాం.. కానీ ఆ సరస్వతి మాతకు ప్రతీకైన ఆడపిల్లలకు మాత్రం చదువు దూరం చేస్తాం. ఒక వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తాం. మన బాధ్యత తీరిపోయిందని సంబరపడతాం. కానీ ఆడపిల్లకు ఓ మనసు ఉంటుందని, ఆమెకు కూడా చదువుకావాలని, సంఘంలో మంచి హోదా పొందాలని ఉంటుంది. కానీ పురుషాధిక్య సమాజం […]

Written By:
  • Rocky
  • , Updated On : March 7, 2023 / 12:50 PM IST
    Follow us on

    International Women’s Day  : విద్యా దేవతగా, జ్ఞానాన్ని ప్రసాదించే తల్లిగా మనం సరస్వతీమాతను కొలుస్తాం.. వసంత పంచమి సందర్భంగా పూజలు చేస్తాం.. కానీ ఆ సరస్వతి మాతకు ప్రతీకైన ఆడపిల్లలకు మాత్రం చదువు దూరం చేస్తాం. ఒక వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తాం. మన బాధ్యత తీరిపోయిందని సంబరపడతాం. కానీ ఆడపిల్లకు ఓ మనసు ఉంటుందని, ఆమెకు కూడా చదువుకావాలని, సంఘంలో మంచి హోదా పొందాలని ఉంటుంది. కానీ పురుషాధిక్య సమాజం ఒప్పుకోదు.. ఇది నిన్నా మొన్నటి మాట. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో మార్పు వస్తోంది. ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం, అన్నింటా సగం అనే నానుడితో అతివ దూసుకుపోతోంది. ఇందుకు నిదర్శనమే ఈ మహిళా మణులు. ఏకంగా ప్రపంచ స్థాయిలోనే హవా చూపిస్తున్నారు. విశ్వవిద్యాలయాలను నడిపిస్తూ నారీ శక్తిని సాటి చెబుతున్నారు.

    ప్రపంచంలోనే టాప్ విశ్వవిద్యాలయాలు మహిళల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. సాధారణంగా విశ్వవిద్యాలయాల్లో అధికార స్థానాలను పురుషులే నిర్వహిస్తూ ఉంటారు. అయితే నిర్ణయం తీసుకునే స్థానాల్లో ఎక్కువగా మహిళలే ఉంటున్నట్టు వివిధ సర్వేలు చెబుతున్నాయి. ప్రపంచంలోనే ప్రముఖ ఐదు విశ్వవిద్యాలయాల్లో నాలుగింటికి మహిళలే సారథ్యం వహిస్తున్నారు. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ గ్లోబల్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2023లో ఈ విషయాలు వెలుగు చూశాయి. జూలై నాటికి ఆక్స్ఫర్డ్, హార్వర్డ్, కేం బ్రిడ్జి, మసాచు సెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు మొట్టమొదటిసారిగా మహిళల నేతృత్వంలో కార్యకలాపాలు సాగరనున్నాయి. ఇక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని ప్రస్తుతం ఐరీన్ ట్రేసీ నడిపిస్తున్నారు. రెండవ స్థానంలో ఉన్న హార్వర్డ్ లో క్లాడిన్ గే, మూడో స్థానంలో ఉన్న కేం బ్రిడ్జిలో డెబోరా ప్రెంటిస్ సారధ్య బాధ్యతల్లో నియమితులు కానున్నారు. ఇక మసాచు సెట్ యూనివర్సిటీ సాలీ కార్న్ బ్లుత్ ఆధ్వర్యంలో కొనసాగుతోంది.

    ప్రపంచ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2023 జాబితా ప్రకారం రెండు వందల విశ్వవిద్యాలయాల్లో 48 మంది మహిళ అధ్యక్షులు లేదా వైస్ ఛాన్స్లర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. గత ఏడాది ఈ సంఖ్య 43 గా ఉండేది. ఇప్పుడు ఆది 12 శాతం పెరిగింది. ఐదేళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పుడు అది 40 శాతానికి ఎగబాకింది. అమెరికా, యూరప్, జర్మనీ దేశాల్లో విశ్వవిద్యాలయాల్లో సారధ్య బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అమెరికాలోని మొత్తం 58 లో 16 విశ్వవిద్యాలయాలకు మహిళలే సారధులుగా ఉన్నారు. జర్మనీ దేశంలో 5 అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలకు మహిళలు నాయకత్వం వహిస్తున్నారు. యూరప్ లోను దాదాపు ఇదే విధానం కొనసాగుతోంది. ఫ్రాన్స్ దేశంలో ఐదు విశ్వవిద్యాలయాలకు గాను మూడు, నెదర్లాండ్ లో 10కి 5, 28యూకే యూనివర్సిటీల్లో 8 విశ్వవిద్యాలయాలకు మహిళలు సారథ్యం వహిస్తున్నారు.

    ఈ విధానానికి ఆసియా నాంది పలికింది.. హాంకాంగ్ లోని యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సారధిగా నియమితులైన న్యూరో సైంటిస్ట్ నాన్సీ ఐప్.. విశ్వవిద్యాలయాలకు నాయకత్వం వహించిన తొలి మహిళగా రికార్డ్ సృష్టించారు. సౌదీ అరేబియాలోని అతిపెద్ద విశ్వవిద్యాలయం కింగ్ అబ్దులాజీజ్ యూనివర్సిటీకి ఆమె తాత్కాలిక సారధిగా కొనసాగుతున్నారు.. 2022లో 43 మంది, 2021లో 41 మంది, 2020లో 19 మంది, 2019, 2018 లో 34 మంది గ్లోబల్ యూనివర్సిటీల్లో మహిళా బాస్ లు గా నియమితులయ్యారు.. కానీ 27 దేశాల్లో చెందిన 12 టాప్ యూనివర్సిటీల్లో వారి నాయకత్వం లేకపోవడం నిజంగా విశేషమే.