Homeజాతీయ వార్తలుFake Rape allegations: అబద్దపు రేప్ లు.. ఆడవారే కుట్రదారులు..!?

Fake Rape allegations: అబద్దపు రేప్ లు.. ఆడవారే కుట్రదారులు..!?

ఒకప్పుడు మానం పోతే ప్రాణం పోయినట్టే.. మానభంగం జరిగిన మహిళలు ఉసురు తీసుకునే వారు.. కానీ కాలం మారింది.. కాలంతోపాటు మహిళలకు బోలెడు హక్కులు.. చట్టాలు.. రక్షణ వ్యవస్థలు.. వారిపై ఈగ వాలినా తప్పు ఈగదే.. మగాళ్లు ఈవ్ టీజింగ్ చేసినా.. చిన్న మాట అన్నా ఆడవాళ్లే ఎగబడి కొట్టేంతగా మన సమాజం ఎదిగింది.. మహిళలకు సంక్రమించిన ఈ స్వేచ్ఛను ఎవరూ కాదనలేరు. కానీ అది వారికి అడ్వంటేజ్ అయితే.. అత్యాచారం చేయకున్నా చేశారంటూ అబద్దమాడి మగవాళ్లను బుక్ చేస్తే.. మహిళే రేప్ చేసిందన్నాక పోలీసులు ఊరుకుంటారా? పురుషులు కూసాలు కదిలిస్తున్నారు. కానీ తాజాగా బయటపడుతున్న కేసుల్లో రేప్ జరుగకున్నా జరిగిందంటూ అమాయకులతో ఆడుకుంటున్నారు మహిళా మణులు.. ఈ ధోరణి ఇటీవల కాలంలో బాగా పెరిగిపోతోంది. తాజాగా మూడు ఘటనల్లోనూ తమపై రేప్ జరిగిందని పోలీసులను హైరానా పెట్టారు మహిళలు.. చివరకు బాధితులను ఎంత కొట్టినా నిజం తెలియకపోవడం.. అసలు విచారణలో మహిళలే అబద్దామాడారని తేలడంతో అంతా అవాక్కైన పరిస్థితి.. మహిళలు ఇలా మానాన్ని తమ అవసరాలు వాడుకుంటున్న తీరు నిజంగానే విస్తుగొలుపుతోంది..

-గాంధీ ఆస్పత్రిలో అసలు రేప్ యే జరగలేదు..
రాష్ట్రంలో ఇటీవల గాంధీ ఆస్పత్రి కేసు సంచలనం సృష్టించింది. హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో రోగి భార్య, మరదలుపై అత్యాచారం జరిగిందన్న కేసు కీలక మలుపు తిరిగింది. అత్యాచారం తర్వాత అందులో ఒకరు కనిపించకుండా పోయిన ఘటన కలకలం రేపింది. కానీ చివరకు ఈ అత్యాచార ఘటనలో పోలీసులకు నమ్మలేని నిజాలు వెలుగుచూశాయి. నాలుగురోజులుగా గాంధీ ఆస్పత్రిలో అత్యాచార ఘటనకు సంబంధించి పోలీసులు సీరియస్ గా తీసుకొని విస్తృతంగా పరిశోధించారు.మహబూబ్ నగర్ నుంచి ఈనెల 5న మూత్రపిండాల వ్యాధిని నయం చేసుకునేందుకు ఓ రోగి గాంధీ ఆస్పత్రికి వచ్చాడు. ఈ క్రమంలోనే రోగి భార్య, మరదలిపై అత్యాచారం జరగిందని.. అందులో ఒకరు కనిపించకుండా పోవడం సంచలనమైంది. కానీ చివరకు అత్యాచార ఘటన అంతా ఓ కట్టుకథగా పోలీసులు తేల్చారు. గాంధీ ఆస్పత్రిలో మహిళపై అత్యాచారం జరిగిన ఆధారాలు లభించలేదని పోలీసులు వెల్లడించారు. సీసీ కెమెరా దృశ్యాలు, వైద్య నివేదిక, సాంకేతికత ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు మహిళలు తమపై అత్యాచారం చేశారన్న ఆరోపణలు అవాస్తవం అని తేల్చారు.మత్తు ప్రయోగం.. అత్యాచారం జరగలేదని నిర్ధారించారు. రోగి భార్య, మరదలుకు కల్లు తాగే అలవాటు ఉందని.. వారు ప్రతిరోజు తాగుతూ కల్లు బానిసలుగా మారారని.. భర్తను ఆస్పత్రిలో ఉంచిన ఐదు రోజులు కల్లు తాగకపోయేసరికి భార్య వదిలేసి మహబూబ్ నగర్ వెళ్లిపోయిందని తేల్చారు. ఆమె చెల్లెలు మాత్రమే ఆస్పత్రిలో ఉందని.. ఆమె సెక్యూరిటీ గార్డుతో సన్నిహితంగా మెలిగిందని తేల్చారు. అంతే తప్ప వారిపై సెక్యూరిటీ గార్డు రేప్ చేసిన ఆనవాళ్లు లేవన్నారు. మహిళలు కల్లు దొరక్క అలా ప్రవర్తించారని.. అత్యాచారం ఆరోపణలు చేసినట్టు తేలింది. ఆర్ఎంపీ వైద్యులతో మాట్లాడి ఈ అక్కచెల్లెల్ల గ్రామంలో విచారణ జరపగా.. కల్లు బానిసలని.. వారు కల్లు దొరక్కపోవడంతోనే ఇలా ప్రవర్తించారని తేలింది. దీంతో అందులో అక్కను భరోసా సెంటర్ కు పంపి వైద్యపరీక్షలు చేయించారు. రేప్ జరగలేదని నిర్ధారించి మహిళలే అబద్దమాడారని పోలీసులు తేల్చారు.

-సంతోష్ నగర్ గ్యాంగ్ రేప్ కూడా ఒట్టిదే?
హైదరాబాద్ లోని సంతోష్ నగర్ లోనూ ఇదే కథ చోటుచేసుకుంది. అక్కడ గ్యాంగ్ రేప్ జరిగిందన్నది కట్టుకథ అని పోలీసులు తేల్చారు. ప్రియుడు తనను కాదని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటుండడంతో అతడిని ఇరికించాలనే ఉద్దేశంతోనే సదురు యువతి ఈ డ్రామాకు తెరలేపినట్టు నిర్ధారించారు. మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ప్యాసింజర్ ఆటో ఎక్కానని.. నాతోపాటు ఆటో ఉన్న ముగ్గురు వ్యక్తులు పహాడీ షరీఫ్ లోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి హింసించి గ్యాంగ్ రేప్ చేశారని బాధితురాలు పోలీసులకు తెలిపింది. ఈ క్రమంలోనే పోలీసులు సీరియస్ గా స్పందించారు. నిందితుల కోసం ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి గాలించారు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. ఒక్క క్లూ కూడా లభించలేదు. బాధితురాలి ఫిర్యాదుకు, క్షేత్రస్థాయిలో పరిస్థితులకు రేప్ జరిగినట్టు ఒక్క ఆధారం కూడా లభించలేదు. నిత్యంరద్దీగా ఉండే ఆ ప్రాంతంలో రాత్రి 9 గంటల సమయంలో ఆమెను కిడ్నాప్ చేయడం సాధ్యమా? నిజంగానే ఆమె ఆపదలో ఉన్నట్టు గుర్తిస్తే యువతి ఎందుకు కేకలు పెట్టలేదు అన్న సందేహాలు పోలీసులకు వచ్చాయి. పలువురు ఆటో డ్రైవర్లను విచారించినా ఒక్క ఆధారం లభించలేదు. దీంతో యువతి ఫిర్యాదుపై పోలీసులకు అనుమానం మరింత బలపడింది. ఆమెను పదే పదే అనేక కోణాల్లో విచారించగా అసలు విషయం తేలింది. తాను ప్రేమించిన వ్యక్తికి మరో యువతితో వివాహం నిశ్చయం చేసుకున్నాడని.. ఆ కక్షతోనే అతడిని కేసులో ఇరికించేందుకు నాటకమాడినట్టు అంగీకరించింది.

-గతంలో ఘట్ కేసర్ కేసు కూడా ఇలాగే..
ఈ ఏడాది ఫిబ్రవరిలో సంచలనం సృష్టించిన ఘట్ కేసర్ కేసులోనూ బీఫార్మసీ విద్యార్థిని గ్యాంగ్ రేప్ ఘటన కట్టుకథ అని తేలింది. ఇంట్లో వాళ్లపై అలిగి ఇంటికి వెళ్లలేక యువతి ఆడిన డ్రామాగా పోలీసులు తేల్చారు. ఆమెను కిడ్నాప్ బ్యాక్ డ్రాప్ కథలంటే ఇష్టం ఉండడంతో ఈ నాటకం ఆడి హంగామా సృష్టించినట్టు తేలింది.గతంలో ఓసారి చిల్లర విషయంలో ఓ ఆటో డ్రైవర్ తో గొడవ జరగడంతో ఆమె వారిని టార్గెట్ చేసినట్టుగా తేల్చారు. అటు పోలీసులను, ఇటు తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించి అనవసరంగా ఆటోడ్రైవర్లపై ఆరోపణలు చేసి వారికి పోలీసుల చేతిలో దెబ్బలు తినిపించింది. అనంతరం ఇదంతా ఒట్టి డ్రామా అని పోలీసులు తేల్చడంతో అవమానంతో చివరకు ఆత్మహత్య చేసుకుంది.

ఇలా ఆడవారికి ఆయుధంగా ఉండాల్సిన పోలీస్ వ్యవస్థతోనే అబద్దపు రేప్ లను సృష్టించి ఆడుకున్నారు. పోలీసులు ఈ విషయంలో నిక్కచ్చిగా నిజాలు రాబట్టబట్టి ఇదంతా మహిళలు చేసిన అపవాదుగా తేలింది. అదే అన్యాయంగా ఈ కేసులో ఎవరైనా చేయని నేరానికి పురుషులు బలైతే ఎంత దారుణమైన పరిస్థితులు ఎదురయ్యేవో.. ఇప్పటికే కొందరు మహిళలు ఇలా అత్యాచారాన్ని అడ్డదిడ్డంగా వాడుకొని అభాసుపాలు కాకూడదని.. నిజమైన రేప్ లు జరిగినా పోలీసులు అనుమానించాల్సిన పరిస్థితులు వస్తాయని పలువురు హితవు పలుకుతున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular