Woman protesting on the road : ఎవరికైనా కోపం వస్తే ఏం చేస్తారు? చేతిలో ఉన్న ఫొన్ కానీ.. వస్తువులు కానీ కింద పడేస్తారు. ఇక ఇంట్లో భర్తతో గొడవలు ఉంటే కొందరు అసహాయ మహిళలు అయితే ఏడ్చి నానా గోల చేస్తారు. ఇక రెబల్ లేడీలు అయితే మొగుడిని వంగబెట్టి నాలుగు గుద్దులు గుద్దుతారు. కానీ ఈ మహిళలో అసహాయత ఉంది.. అదే సమయంలో కాస్త ఆవేశం పాళ్లు కూడా ఉన్నాయి. అందుకే తనను వేధిస్తున్న మొగుడిని, కుటుంబాన్ని ఏం అనకుండా సైలెంట్ గా ఒక కత్తి చేతబట్టుకొని వచ్చి ప్రధాన రహదారి మధ్యలో పడుకుంది.

కత్తి చేత బట్టుకొని నడిరోడ్డుపై టవల్ వేసుకొని దర్జాగా పడుకుంది. ఆమె దగ్గరకు వెళితే చేతిలో కత్తితో ఉంది. దీంతో పొడుస్తుందో ఏమోనని అందరూ కంగారు వెళ్లారు. ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు వచ్చి చూశారు. ఏంటమ్మా నీ సమస్య అని అడిగారు. దీంతో ఆ మహిళ బోరుమంది.
విశాఖ పట్నం అల్లిపురం మెయిన్ రోడ్ లో ఒక మహిళ హల్ చల్ చేసింది. ఒక చిన్నపాటి కత్తితో ఆమె హల్ చల్ చేయడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. చివరకు పోలీసులు జోక్యం చేసుకొని అదుపులోకి తీసుకున్నారు. ఏంటీ సమస్య అని అడిగితే ఆమె కుటుంబ సమస్యలు వల్లెవేసింది.
ఏడుస్తూ కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన మహిళ ఇలా నడిరోడ్డుపై నిరసనకు దిగింది. భర్తా, అత్తామామలు వేధింపులు భరించలేక తనను చంపడని.. చచ్చిపోతానంటూ వాపోయింది. ‘పోలీసులతో నాకు న్యాయం జరగదని.. తాను కోర్టుకు వెళ్లనని.. నేను చస్తే సినిమా చూస్తున్నట్టు మా వాళ్లు చూస్తారని ఆవేదన వ్యక్తం చేసింది.
తాము న్యాయం చేస్తామని.. చేతిలోని కత్తిని ఇవ్వాలని పోలీసులు కోరినా ఆ మమిళ మాత్రం వినిపించకుండా ముందు తనను వేధించేవారిపై చర్యలు తీసుకోవాలని ఏడుస్తూ వాపోయింది. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.
https://www.youtube.com/watch?v=W2wFSDo6hrc